MLA Purchase Case: ఒకవైపు సిట్‌.. మరోవైపు ఈడీ ఎంట్రీతో ట్విస్ట్‌లు.. ఫామ్‌హౌస్‌ కేసులో ఏ2 నందకుమార్‌ను ప్రశ్నించనున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరో మలుపు తిరగబోతోంది. ఇవాళా రేపు A2 నందకుమార్‌ స్టేట్‌మెంట్‌ రికార్డు చేయబోతోంది ఈడీ. అయితే, నందు స్టేట్‌మెంట్‌ రికార్డుకు ముందే వివాదం చెలరేగింది. తనపై కుట్ర జరుగుతోందంటూ సంచలన కామెంట్స్‌ చేశారు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి. ఈడీపై హైకోర్టుకు వెళ్తున్నట్టు ప్రకటించారు. రోహిత్‌రెడ్డి ఆరోపణల వెనక అసలు రీజనేంటి?. ఇవాళ అసలేం జరగబోతోంది?

MLA Purchase Case: ఒకవైపు సిట్‌.. మరోవైపు ఈడీ ఎంట్రీతో ట్విస్ట్‌లు.. ఫామ్‌హౌస్‌ కేసులో ఏ2 నందకుమార్‌ను ప్రశ్నించనున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌
Nandakumar Mla Purchase Case
Follow us

|

Updated on: Dec 26, 2022 | 6:53 AM

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇవాళ కీలక పరిణామం జరగబోతోంది. A2 నందకుమార్‌ను ఈరోజు ప్రశ్నించబోతోంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. చంచల్‌గూడ జైల్లో నందు స్టేట్‌మెంట్‌ తీసుకోంది ఈడీ. అయితే, నందకుమార్‌ను ఈడీ ఏం అడగబోతోంది?. ఎలాంటి ప్రశ్నలను నందు ముందుంచబోతోంది?. ఈడీ ప్రశ్నలకు నందకుమార్‌ ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారనేది ఉత్కంఠ రేపుతోంది. నందు స్టేట్‌మెంట్‌ రికార్డుకు ఈడీ రెడీ అయిన వేళ, సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి. ఫామ్‌హౌస్‌ కేసులో ఈడీ ఎంట్రీపైనే డౌట్స్‌ రెయిజ్‌ చేస్తున్నారు. అసలు, ఈడీ విచారణ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. స్పాట్‌లో ఎలాంటి డబ్బు దొరకనప్పుడు ఈడీ ఎంట్రీ ఎందుకన్నది రోహిత్‌రెడ్డి వాదన. ఇదంతా తనను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ చేయిస్తున్న కుట్ర అంటున్నారు రోహిత్‌రెడ్డి.

దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్టుగా ఫామ్‌హౌస్‌ కేసులో తననే దోషిగా చూపించేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేశారంటున్నారు రోహిత్‌రెడ్డి. అయితే, ఎన్ని కొత్త కుట్రలు చేసినా, ఎన్ని మాస్టర్ ప్లాన్‌ వేసినా తగ్గేదేలే అంటున్నారు. రోహిత్‌ కామెంట్స్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్ ఇచ్చింది బీజేపీ. ఈడీ తన పని తాను చేస్తుంటే ఎందుకంత ఉలికిపాటు అంటూ సెటైర్లు వేశారు రామచంద్రరావు. ఫామ్‌హౌస్‌లో అసలేం జరిగింది..?ఎవరు ఎవర్ని సంప్రదించారు? అనే సమాచారాన్ని నందకుమార్‌ నుంచి తీసుకోనుంది ఈడీ. నందు స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఆ తర్వాత రోహిత్‌రెడ్డిని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు కలవరం పుట్టిస్తోంది.

ఇదంతా తనను ఇరికించేందుకు జరుగుతోన్న కుట్ర అంటోన్న రోహిత్‌రెడ్డి, హైకోర్టులో రిట్‌ వేయబోతున్నారు. అసలు, నందు ఎలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వనున్నాడు?. రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుంది?. రేపు మళ్లీ ఈడీ విచారణకు హాజరుకాబోతున్న రోహిత్‌ను ఈడీ ఏం అడగనుంది? ఇవన్నీ ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..