Winter Health: చలికాలం అని బద్దకిస్తున్నారా.. ఉదయం లేచి ఈ పనులు చేయండి.. ఆరోగ్యంగా ఉండండి..
చలికాలం చంపేస్తోంది. ఉదయం బారెడు పొద్దెక్కినా.. నిద్ర లేవడం లేదు. ముసుగు తన్ని పడుకుంటున్నారు. ఇక ఇలాంటి సమయాల్లో వ్యాయామం గురించి చెప్పనవసర లేదు. బద్దకం కారణంగా ఎక్సర్సైజ్ చేసేందుకు...
చలికాలం చంపేస్తోంది. ఉదయం బారెడు పొద్దెక్కినా.. నిద్ర లేవడం లేదు. ముసుగు తన్ని పడుకుంటున్నారు. ఇక ఇలాంటి సమయాల్లో వ్యాయామం గురించి చెప్పనవసర లేదు. బద్దకం కారణంగా ఎక్సర్సైజ్ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. అయితే ఇలాంటి ఆలోచన చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో రన్నింగ్‌తో సహా అవుట్‌డోర్ యాక్టివిటీ చాలా రకాలుగా మీకు మేలు చేస్తుంది. ఇది శరీరానికి విటమిన్ డి ని పెంచడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా చలికాలంలో పరుగెత్తడం ద్వారా దృఢమైన శరీరాన్ని పొందవచ్చు. అయితే.. వాకింగ్ చేసే సమయంలో సురక్షితంగా ఉంచడానికి నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. అవేంటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
వెచ్చని బట్టలు, బూట్లు ధరించాలి: వాకింగ్ ప్రారంభించే ముందు మంచి బూట్లను ధరించాలి. అవి తడిగా లేకుండా జాగ్రత్త పడాలి. తలపై టోపీ ధరించాలి. వేగంగా పరుగెత్తడం ప్రారంభించవద్దు. ఎందుకంటే శరీర భాగాలు చల్లగా ఉంటాయి. శరీరం వెచ్చదనాన్ని సంతరించుకునేందుకు సమయం పడుతుంది కాబట్టి.. మెల్లగా నడుస్తూ వాకింగ్ స్టార్ట్ చేయాలి. హ్యాండ్ గ్లోవ్స్ కూడా వేసుకోవాలి. తి తొడుగులు
ఎక్కువ నీరు తాగాలి: వేసవిలో దాహం పెరగడం కంటే చలికాలంలో కూడా శరీరంలో నీటి పరిమాణం తగ్గుతుంది. అందుకోసం శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. శరీరానికి నీరు అవసరం. వాకింగ్ ప్రారంభించడానికి ముందు నీరు తాగాలి. వాకింగ్ చేసే సమయంలో వాటర్ బాటిలో కూడా తీసుకెళ్లాలి.
వైద్యుడిని సంప్రదించండి: నడుస్తున్నప్పుడు ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వాకింగ్ ను ఆపేయాలి. కండరాలు తిమ్మిరిగా అనిపిస్తే స్వంత వైద్యం కాకుండా వైద్యుడిని సంప్రదించాలి. దాని కన్నా ముందు వాకింగ్ కు మీరు ఏ ప్రదేశానికి వెళ్తున్నారో ఆ వివరాలను కుటుంబసభ్యులకు చెప్పడం మాత్రం మరవద్దు.
గుండె సమస్యలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. చల్లని వాతావరణంలో వ్యాయామం చేయడం వల్ల గుండె ఒత్తిడికి గురవుతుంది. ఉదాహరణకు, జలుబు రక్తపోటు పెరగడానికి కారణమవుతుందని నమ్మదగిన మూల పరిశోధన సూచిస్తుంది. గుండె జబ్బులు ఉన్న కొంతమందికి ఆకస్మిక లేదా అధిక వ్యాయామం ప్రమాదకరం.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహనం కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.