Leopard: తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో బోనులో పడ్డ చిరుతపులి.. పీల్చుకున్న విద్యార్థులు, అధ్యాపకులు..

పక్కా ప్లాన్ వేశారు. చిరుత కోసం రెండు చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు. చిక్కకుండా తప్పించుకుంటూ తిరిగిన చిరుత.. ఎట్టకేలకు బోనులో పడింది.

Leopard: తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో బోనులో పడ్డ చిరుతపులి.. పీల్చుకున్న విద్యార్థులు, అధ్యాపకులు..
Chirutha
Follow us

|

Updated on: Dec 25, 2022 | 11:33 AM

తిరుపతిలో 10 రోజులుగా చిరుత తప్పించుకు తిరుగుతోంది. వెటర్నరీ యూనివర్శిటీ చుట్టుపక్కల తిరుగుతూ.. స్థానికులను భయపెడుతోంది. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు.. పక్కా ప్లాన్ వేశారు. చిరుత కోసం రెండు చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు. చిక్కకుండా తప్పించుకుంటూ తిరిగిన చిరుత.. ఎట్టకేలకు బోనులో పడింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ చిరుతను జూపార్కుకి తరలించారు అధికారులు. అయితే మరో చిరుత కూడా ఉందని అధికారులు అంచనా వేశారు. దాని కోసం రెండు బోన్లను అలాగే ఉంచారు అధికారులు.

కొన్ని రోజులుగా వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత సంచరిస్తోంది. చిరుత భయంతో హాస్టల్‌కి వెళ్లాలంటే విద్యార్ధులు భయపడుతున్నారు. భయంతోనే అధ్యాపకులు, సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు.. చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టారు.

తిరుపతిలో చిరుతను పట్టుకునేందుకు గత కొంత కాలంగా అధికారుల ఆపరేషన్ మొదలుపెట్టారు. వెటర్నరీ విశ్వవిద్యాలయంలో రెండు బోన్లను ఏర్పాటు చేశారు అటవీశాఖాధికారులు. వెటర్నరీ యూనివర్సిటీ, కళాశాలల్లోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడమే కాకుండా.. పరిసర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఇది కాకుండా మరో చిరుత కూడా ఉందని అటవీ అధికారులు అంటుండటంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం

Latest Articles