Job Mela: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జాబ్‌ మేళా.

ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (APSSDC) పలు జాబ్‌ మేళాలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు జాబ్‌ మేళాలను నిర్వహించిన ఏపీఎస్‌ఎస్‌డీసీ..

Job Mela: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జాబ్‌ మేళా.
Job Mela
Follow us

|

Updated on: Dec 25, 2022 | 2:56 PM

ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (APSSDC) పలు జాబ్‌ మేళాలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు జాబ్‌ మేళాలను నిర్వహించిన ఏపీఎస్‌ఎస్‌డీసీ తాజాగా మరో జాబ్‌ మేళాను నిర్వహించేందుకు సిద్ధమైంది. డిసెంబర్‌ 27వ తేదీన నిర్వహించనున్న జాబ్‌ మేళాలో కుశాలవ హూండయ్‌, అపోలో ఫార్మసీ సంస్థలు పాల్గొననున్నాయి. ఇంతకీ ఈ జాబ్‌ మేళా ద్వారా మొత్తం ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* ఈ జాబ్‌ మేళాలో భాగంగా కుశలవ హూండయ్‌, అపోలో ఫార్మసీస్‌ లిమిటెడ్‌ సంస్థలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.

ఇవి కూడా చదవండి

* హూండయ్‌ కంపెనీ మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో సేల్స్ మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ ప్యాకర్, సర్వీస్ అడ్వైజర్, సర్వీస్ టెక్నీషియన్ వంటి పోస్టులు ఉన్నాయి. ఇంటర్‌ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైన వారు విజయవాడలో పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 8 వేల నుంచి రూ. 15 వేల వరకు ఉంటుంది.

* అపోలో ఫార్మసిస్‌ లిమిటెడ్‌లో మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఫార్మసిస్ట్, ఫర్మాసీ అసిస్టెంట్, ఫార్మసీ ట్రైనీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, గ్రాడ్యుయేషన్, బీ/ఎం/డీ ఫార్మసీ అర్హతతో పాటు పీసీఐ సర్టిఫికేట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 10,110 నుంచి రూ. 16 వేల వరకు చెల్లిస్తారు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఈ లింక్‌ ద్వారా రిజిస్టఱ్‌ చేసుకోవాలి.

* ఇంటర్వ్యూను ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, రామేష్ హాస్పటల్స్ ఎదురుగా, విజయవాడలో నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం 9700092606 నెంబర్‌ను సంప్రదించండి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles