Jobs: ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.? వచ్చే ఏడాది మీకు పండగే, ఎన్ని కొత్త ఉద్యోగాలు రానున్నాయంటే..

ప్రస్తుతం ప్రపంచం ఆర్థిక మాంద్యం భయంలో ఉంది. ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా పలు పెద్ద పెద్ద సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందో అన్న భయాందోళనలు నెలకొన్నాయి. దీనికితోడు..

Jobs: ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.? వచ్చే ఏడాది మీకు పండగే, ఎన్ని కొత్త ఉద్యోగాలు రానున్నాయంటే..
Jobs In 2023
Follow us

|

Updated on: Dec 25, 2022 | 12:30 PM

ప్రస్తుతం ప్రపంచం ఆర్థిక మాంద్యం భయంలో ఉంది. ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా పలు పెద్ద పెద్ద సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందో అన్న భయాందోళనలు నెలకొన్నాయి. దీనికితోడు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యల్బణం భారీగా పెరుగుతోంది. అయితే ఇలాంటి నెగిటివ్‌ వార్తల్లో ఒక పాజిటివ్‌ వార్త ఊరటనిస్తోంది. ప్రంపంచవ్యాప్తగా పరిస్థితిలు ఎలా ఉన్నా భారత్‌లో మాత్రం వివిధ రంగాల్లో భారీగా ఉద్యోగవకాశాలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సంస్థ టీమ్‌లీజ్‌ ఈ విషయాన్ని అంచనా వేసింది. వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లో సర్వీస్‌ సెక్టార్‌లో ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలు లభిస్తాయని ఈ సంస్థ చెబుతోంది. దేశంలోని 79 శాతం సంస్థలు కొత్తవారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాయని పేర్కొంది. టీమ్‌లీజ్‌ సంస్థ తమ ‘ఎంప్లాయ్‌మెంట్‌ ఔట్‌లుక్‌ రిపోర్ట్‌’లో ఈ విషయాలను పేర్కొంది.

దేశ వ్యాప్తంగా నగరాలకు చెందిన 14 సేవారంగాలల్లోని 573 చిన్న, మధ్యతరహా, పెద్ద కంపెనీల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఎంట్రీ లెవల్‌ ఉద్యోగ కల్పనలో పెద్ద నగరాలు ముందు వరుసలో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. టెలికం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాల విషయంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై మెట్రోసిటీలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. ఇక ఈ కామర్స్‌లో 98 శాతం, ఎడ్యుకేషన్‌లో 93 శాతం, టెలీకమ్యూనికేషన్స్‌లో 94 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో 88 శాతం, లాజిస్టిక్స్‌ కంపెనీల్లో 81 శాతం స్థిరమైన ఉద్యోగ అవకాశాలు రానున్నట్లు టీమ్‌లీజ్‌ అంచనా వేసింది.

టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ ఛీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మయూర్‌ టాడే మాట్లాడుతూ.. ‘ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సర్వీసెస్‌ సెక్టార్‌లో భారత్‌ ‘గ్లోబల్‌ లీడర్‌’గా ఉద్భవించే దిశలో సాగుతోందని తెలిపారు. ఇక 5జీ టెలికం సర్వీసుల కారణంగా పరిశ్రమలు, సంస్థలు ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరుస్తోంది. ఇవి ఎడ్యుకేషన్‌, ఫైనాన్షియల్‌, ఔట్‌ సోర్సింగ్ సర్వీసులపై సానుకూల ప్రభావం చూపుతుందని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజోయ్‌ థామస్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. టమాటోతో ఐస్‌క్రీమ్ రోల్..
ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. టమాటోతో ఐస్‌క్రీమ్ రోల్..
భారత్‌లో త్వరలో ఎయిర్ టాక్సీ సేవలు.. ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసా?
భారత్‌లో త్వరలో ఎయిర్ టాక్సీ సేవలు.. ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసా?
కారు బీమాతో ఆర్థిక ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ తప్పలు వద్దంతే.!
కారు బీమాతో ఆర్థిక ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ తప్పలు వద్దంతే.!
మతం మంటల్లో దేశరాజకీయం ఉడుకుతోందా?
మతం మంటల్లో దేశరాజకీయం ఉడుకుతోందా?
చెన్నైతో హై ఓల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిన ఆర్సీబీ.. తుది జట్లు ఇవే
చెన్నైతో హై ఓల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిన ఆర్సీబీ.. తుది జట్లు ఇవే
ఇసుక తవ్వుతుండగా ఏం బయటపడిందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు
ఇసుక తవ్వుతుండగా ఏం బయటపడిందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు
సీనియర్ సిటిజన్లు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదా..?
సీనియర్ సిటిజన్లు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదా..?
వేసవిలో ఎన్ని గుడ్లు తినవచ్చో తెలుసా నిపుణులు ఏమి చెబుతున్నారంటే
వేసవిలో ఎన్ని గుడ్లు తినవచ్చో తెలుసా నిపుణులు ఏమి చెబుతున్నారంటే
నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా!.SRH కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?
నువ్వు చాలా మంచోడివి కమిన్స్ మామా!.SRH కెప్టెన్ ఏం చేశాడో తెలుసా?
వెచ్చటి వేసవిలో ఏసీలపై కూల్ కూల్ ఆఫర్స్..!
వెచ్చటి వేసవిలో ఏసీలపై కూల్ కూల్ ఆఫర్స్..!