Study Abroad: ఉన్నత చదువుల కోసం ఎడ్యూకేషన్ లోన్, పర్సనల్ లోన్లలో ఏది బెస్ట్ ఆప్షన్? ఇదిగో ఇలా సెలక్ట్ చేసుకోండి..
విద్యార్థులకు అందుబాటులో ఉన్నవి రెండు రకాల లోన్లు. అవి పర్సనల్ లోన్.. రెండోది ఎడ్యూకేషన్ లోన్. ఈ రెండూ విద్యార్థుల అవసరాలు తీర్చేందుకు సాయపడతాయి. అయితే ఈ రెండింటిలో ఏది మంచిది?
ఇటీవల కాలంలో చాలా మంది ఉన్నత చదువులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటర్ తోనో డిగ్రీతోనో ఆపేయకుండా పీజీలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. అది కూడా చిన్నా చితకా సంస్థల్లో కాకుండా యూనివర్సిటీ స్థాయిలోనే చేయడానికి ఇష్టపడుతున్నారు. మరికొంతమంది విదేశాలకు వెళ్లి చదువుకోడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకనుగుణంగా పలు విదేశీ విద్యా సంస్థలు ఆకర్షణీయమైన కోర్సులతో విద్యార్థులను రారామ్మని ఆహ్వానిస్తున్నాయి. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ, హాస్పిటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్, బిజినెస్ మేనేజ్మెంట్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అయితే అంత దూరం వెళ్లి చదువుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, ప్రతి రోజూ ఖర్చులు అన్ని ఉంటాయి. ఈ నేపథ్యంలో అందరూ బ్యాంకు లోన్ల వైపు చూస్తున్నారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్నవి రెండు రకాల లోన్లు. అవి పర్సనల్ లోన్.. రెండోది ఎడ్యూకేషన్ లోన్. ఈ రెండూ విద్యార్థుల అవసరాలు తీర్చేందుకు సాయపడతాయి. అయితే ఈ రెండింటిలో ఏది మంచిది? విద్యార్థులు ఏది ప్రయోజనకరంగా ఉంటుంది? నిపుణులు సూచిస్తున్న అంశాలివే..
ఎడ్యూకేషన్ లోన్.. పర్సనల్ లోన్ మధ్య తేడా ఏంటి..
పర్సనల్ లోన్.. మీ వ్యక్తిగత అవసరాలకు చక్కగా ఉపయోగపడుతుంది. లోన్ తీసుకునే వారి ఏ విధంగానైనే ఆ సొమ్మును వినియోగించుకోవచ్చు. చదువు, ట్యూషన్ ఫీజు, పెళ్లి, హోమ్ రెన్నోవేషన్స్ వంటివి చేసుకోవచ్చు. తీసుకున్న అప్పును నిర్ణీత కాలవ్యవధిలో తీర్చేయవలసి ఉంటుంది. ఎటువంటి ష్యూరిటీ, డాక్యూమెంట్స్ లేకుండానే బ్యాంకులు ఈ రుణం అందిస్తాయి.
ఎడ్యూకేషన్ లోన్.. కేవలం విద్యార్థులు మాత్రమే వినియోగించుకోదగిన లోన్ ఇది. చదువు నిమిత్తం మాత్రమే ఇస్తారు. ఎడ్యూకేషన్ లోన్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి డొమెస్టిక్, మరొకటి ఓవర్సీస్ ఎడ్యూకేషన్ లోన్. డొమెస్టిక్ అంటే మన దేశంలో ఉండి ఉన్నత చదువు అభ్యసించాలనుకునే వారికి ఇస్తారు. ఈ లోన్ తీసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా ఏదో ఒక విద్యాసంస్థలో అడ్మిషన్ పొంది ఉండాలి. ఓవర్సీస్ లోన్ అంటే విదేశాలు వెళ్లి చదవాలనే విద్యార్థుల కోసం రూపొందించబడినది. ఇది అక్కడి విద్యాసంస్థలో ట్యూషన్ ఫీజు, హాస్టల్ తదితర ఖర్చులు కవర్ అవుతాయి.
ఎంత మొత్తం ఇస్తాయి..
ఎక్కువ మొత్తంలో కావాలి అనుకునే వారికి పర్సనల్ లోన్ తో పోల్చుకుంటే ఎడ్యూకేషన్ లోన్ చాలా బెటర్. ఎందుకంటే ఎడ్యూకేషన్ లోన్లో రూ. 7.5 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు రుణాన్ని అందిస్తుంది. కానీ పర్సనల్ లోన్ పరిమితి చాలా తక్కువ. దీనిలో రూ. 25 లక్షల వరకూ మాత్రమే లోన్ పొందగలం. మరికొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రూ. 40 లక్షల వరకూ బ్యాంకర్లు ఇస్తారు.
వడ్డీ రేటు..
వడ్డీ రేటు కూడా ఎడ్యూకేషన్ లోన్లలో తక్కువ ఉంటుంది. దాదాపు 8.3 శాతం నుంచి 10.5శాతం వరకూ ఉండొచ్చు. అదే పర్సనల్ లోన్లపై వడ్డీ రేటు అధికంగా ఉంటుంది. అది 10.99 శాతం నుంచి 24 శాతం వరకూ ఉండే అవకాశం ఉంటుంది. దీనిని చూసుకుంటే ఉన్నత విద్యకు ఎడ్యూకేషన్ లోన్ మించిన ఆప్షన్ మరొకటి లేదు.
మారటోరియ్ పీరియడ్..
ఎడ్యూకేషన్ లోన్లో మారటోరియ్ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు చదువు పూర్తయ్యే వరకూ ఎటువంటి చెల్లింపులు చేయనవసరం లేదు. చదువు పూర్తయిన తర్వాత ఆరు నెలల నుంచి లేదా మరికొన్ని బ్యాంకులు ఏడాది తర్వాత చెల్లింపులు చేసేలా అవకాశాన్ని కల్పిస్తాయి. కానీ పర్సనల్ లోన్లలో ఈ పరిస్థితి ఉండదు. అలాగే ఎడ్యూకేషన్ లోన్ పై ఇన్ కం ట్యాక్స్ యాక్ట్ 80 ఈ కింద ఎనిదేళ్ల వరకూ ట్యాక్స్ మినహాయింపు కూడా పొంద వచ్చు. వీటన్నంటిని బేరీజు వేసుకున్నాక.. మీకే అర్థం అవుతుంది. ఉన్నత చదువులకు ఎడ్యూకేషన్ లోన్ మించిన ఆప్షన్ మరొకటి ఉండదని.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..