Fixed Deposits: ఆఫర్ అదిరిపోయిందిగా! ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపు.. ఇండస్ఇన్డ్ బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్
మీరు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? ఏ బ్యాంకులో అధిక వడ్డీ ఇస్తారా అని ఎదురుచూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్..
మీరు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? ఏ బ్యాంకులో అధిక వడ్డీ ఇస్తారా అని ఎదురుచూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ప్రైవేటు సెక్టార్ బ్యాంక్ అయిన ఇండస్ఇన్డ్ బ్యాంకు తన ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఫిక్స్ డ్ డిపాజిట్ కింద రూ. 2 కోట్ల లోపు ఉండే ఖాతాలకు కొత్త రేట్లను ప్రకటించింది. పెంచిన కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 22 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. డొమెస్టిక్, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ, సీనియర్ సిటిజెన్స్ కు చెందిన ఫిక్స్ డ్ డిపాజిట్లపై పెంచిన కొత్త వడ్డీ రేట్లు అమలవుతాయని పేర్కొంది. మెచ్యూరిటీ పీరియడ్ కి ముందు ఖతాను ఉపసంహరించినా వడ్డీ అందిస్తామని పేర్కొంది.
ఎఫ్ డీ వడ్డీ రేట్లు ఇలా..
ఇండస్ఇన్డ్ బ్యాంకు రోజుల లెక్కన ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును అమలు చేస్తోంది. ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన మొత్తంపై ఏడు నుంచి 61 రోజులకుపైనా మెచ్యూరిటీ వ్యవధి అయితే 3.5 శాతం నుంచి 6.5శాతం వరకు వడ్డీ అందిస్తోంది. అదే సీనియర్ సిటిజెన్ లకు అయితే 4శాతం నుంచి 7.10 శాతం వరకు ఇస్తోంది. రెండేళ్ల నుంచి రెండేళ్ల ఒక నెలలో మెచ్యూరిటీ సాధించే డిపాజిట్లపై గణనీయంగా 7.25 శాతం వడ్డీ ఇస్తోంది. అదే సీనియర్ సిటిజెన్లకు అయితే 7.85 శాతం అందిస్తోంది.
రోజుల లెక్కన..
– ఏడు రోజుల నుంచి 30 రోజుల్లో మెచ్యూరిటీ పెట్టిన డిపాజిట్లపై 3.50 శాతం, అలాగే 31 నుంచి 45 రోజులకు 4 శాతం, 46 రోజుల నుంచి 60 రోజుల వరకూ 4.25 శాతం, 61 రోజుల నుంచి 120 రోజులకు 4.50 శాతం వడ్డీని ఆయా డిపాజిట్లపై అందిస్తోంది. – 121 నుంచి 180 రోజుల్లో మెచ్యూరిటీ వ్యవధి విధించుకున్న డిపాజిట్లపై 4.75 శాతం వడ్డీని ఇండస్ఇన్డ్ బ్యాంకు అందిస్తోంది. అలాగే 181 రోజుల నుంచి 269 రోజుల వరకూ 5.50 శాతం, 270 నుంచి 354 రోజుల వరకూ 5.75 శాతం, 355 నుంచి 364 రోజులకు మెచ్యూరిటీ సాధించే డిపాజిట్లపై 6.00శాతం వడ్డీని ఇస్తున్నట్లు ప్రకటించింది. – అలాగే ఒక సంవత్సరం నుంచి సంవత్సరం ఆరు నెలల్లో మెచ్యూరిటీ పెట్టుకున్న డిపాజిట్లపై 6.75 శాతం, సంవత్సరం ఆరు నెలల నుంచి రెండేళ్ల కాలంలో మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లపై 7.00 శాతం వడ్డీ అందిస్తోంది. – అదే మీరు రెండేళ్ల నుంచి రెండేళ్ల ఒక నెలకు మెచ్యూరిటీ విధించుకుంటే దానిపై వడ్డీ రేటు 7.25 శాతం ఉంటుంది. రెండేళ్లకు పైన మూడేళ్ల వరకూ పెట్టుకుంటే 7శాతం వడ్డీ ఇండస్ఇన్డ్ బ్యాంకు అందిస్తుంది.
సీనియర్ సిటిజెన్స్ కు స్పెషల్ ఆఫర్..
ప్రత్యేకించి సీనియర్ సిటిజెన్స్ పై రెండు కోట్లలోపు డిపాజిట్లపై అదనంగా మరో 0.50 శాతం వడ్డీని అధికంగా ఇస్తుంది. ఇది మిగిలిన ఖాతాదారులకు వర్తించదు.
ప్రీ మెచ్యూర్ విత్ డ్రాల్..
ఎఫ్డీ ఖాతాలో మెచ్యూరిటీ వ్యవధి పూర్తవకుండానే డిపాజిట్ విత్ డ్రా చేయాలంటే అకౌంట్ ప్రారింభినప్పటి నుంచి రోజుల లెక్కగట్టి దానిపై వడ్డీ స్లాబ్ నిర్ధారిస్తారు. దీనికి అదనంగా 1శాతం వడ్డీని పెనాల్టీ గా విధించి, మిగిలిన మొత్తాన్ని ఇస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..