Credit Card: క్రెడిట్ కార్డును ఎప్పుడు రద్దు చేసుకోవాలో తెలుసా..? ఇవి తప్పనిసరి తెలుసుకోండి
ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డులను సులభంగా జారీ చేస్తున్నాయి. ఒకప్పుడు క్రెడిట్ కార్డు కావాలంటే..
ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డులను సులభంగా జారీ చేస్తున్నాయి. ఒకప్పుడు క్రెడిట్ కార్డు కావాలంటే ఎంతో ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడున్న రోజుల్లో తక్కువ సమయంలోనే కార్డులను అందజేస్తున్నాయి. కరోనా తర్వాత క్రెడిట్ కార్డుల వాడకం పెరిగిపోయింది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా వాటిని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా తర్వాత ఆర్థిక పరిస్థితులు, ఆదాయం తగ్గిపోవడం, ఖర్చులు పెరిగిపోవడం కారణంగా ఈఎంఐల భారం పెరిగిపోయింది. దీంతో చేసేదేమి లేక క్రెడిట్ కార్డుల్లో ఉన్న డబ్బుంతా వాడుకున్నారు. అయితే క్రెడిట్ కార్డుల వాడకంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని బ్యాంకు నిపుణులు చెబుతున్నారు. లేకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. గడువులోగా ఈఎంఐలను చెల్లించడం బెటర్. లేకపోతే అదనపు ఛార్జీలు పడుతుంటాయి.
ముఖ్యవిషయం ఏంటంటే వీలైనంత వరకు తక్కువ క్రెడిట్ కార్డులను ఉంచుకోవడం, కార్డులో తక్కువ అమోంట్‌ను వాడుతూ ఉండటం ముఖ్యం. క్రెడిట్ లిమిట్ తక్కువ ఉన్న కార్డుల వల్ల మీ రుణ వినియో నిష్పత్తి పెరుగుతుంది. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడుతుంది. అలాంటి సమయంలో మీ వద్ద తక్కువ పరిమితితో ఎక్కువ కార్డులు ఉన్నట్లయితే వాటిని రద్దు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఉదాహరణకు రూ.20 వేల లిమిట్ ఉన్న కార్డులో రూ.2 వేలు వాడితే 10 శాతం వాడినట్లే. అదే రూ.50 వేల లిమిట్ ఉన్న దాంట్లో రూ.5 వేలు వాడినా.. 10 శాతం అయినట్లే. ఇలాంటి పరిస్థితిలో కార్డులో ఎక్కవ లిమిట్ ఉండటం ముఖ్యం.
ఒకటి, రెండు కార్డుల కంటే ఎక్కువ ఉండటం, తక్కువ లిమిట్ ఉన్న కార్డులను రద్దు చేసుకోవడం మంచిదంటున్నారు. మీరు మొదటి తీసుకున్న క్రెడిట్ కార్డును వీలైనంత ఎక్కువ కాలం వాడితేనే మంచిది. ఎక్కువ రోజులు తక్కువ లిమిట్ ఉన్న కార్డును వాడారు కాబట్టి మీ క్రెడిట్ స్కోర్ దానిపై ఆధారపడి ఉంటుంది. అప్పుడు దానిని రద్దు చేస్తే క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంది. అందుకు ఎక్కువ రోజులు వాడకుండా రద్దు చేసుకోవడం మంచిది. లేదా కార్డు లిమిట్ పెంచుకోవడం మంచిది. ఒక వేళ మీ కార్డుపై లిమిట్ పెంచకుంటే రద్దు చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే తక్కువ లిమిట్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.
అయితే కొత్త కార్డులు ఉంటే వాటిని క్యాన్సిల్ చేసుకోవడం మంచిదే. మీరు మొదట తీసుకున్న కార్డు లిమిట్ సాధ్యమైనంత ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తక్కువగా ఉంటే లిమిట్ పెంచాలని బ్యాంకులను అభ్యర్థించవచ్చు. అలాగే వార్షికంగా వసూలు చేసే ఫీజులను సైతం తక్కువ చేమని కూడా బ్యాంకులను అడగవచ్చు. కస్టమర్‌కేర్‌కు కాల్ చేసి ఈ విషయాలను అడగవచ్చు. అలాగే మీ అభ్యర్థన మేరకు వారు వార్షిక ఫీజు తగ్గివంచడమే లేక లైఫ్‌టైమ్ ఎలాంటి వార్షిక ఫీజు లేకుండా కార్డును వాడుకోండని కూడా సూచిస్తుంటారు.
అలాగే ఒకవేళ మీ క్రెడిట్ కార్డును రద్దు చేసుకోవాలంటే అందులో ఒక్క రూపాయి కూడా బాకీ ఉండకూడదు. ఏమైనా బాకీ ఉన్నట్లయితే కార్డు రద్దు చేసేందుకు వీలుండదు. కార్డును రద్దు చేసుకున్నాక నో డ్యూ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి