Home Loans: ఈఎంఐ భారం అయిపోయిందా? అయితే సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి.. మీ లోన్ త్వరగా తీరిపోతుంది..

ఫలితంగా బ్యాంకులు తాము వినియోగదారులకు అందించే లోన్లపై వడ్డీ రేటును కూడా అమాంతం పెంచేశాయి. ఇది సగటు వేతన జీవిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో పెరిగిన రెపో రేటు కారణంగా అధికమవుతున్న వడ్డీ రేట్ల భారం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

Home Loans: ఈఎంఐ భారం అయిపోయిందా? అయితే సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి.. మీ లోన్ త్వరగా తీరిపోతుంది..
Home Loan
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Dec 24, 2022 | 7:06 PM

సగటు మనిషి జీవిత కాల ఆశయం ఓ సొంతిల్లు నిర్మించుకోవడం. అందుకోసం జీవితమంతా కష్టపడుతుంటాడు. అయితే నెలవారీ సంపాదనతో ఆ ఆశను నెరవేర్చుకోవడం కష్టం. ఎందుకంటే ప్రస్తుతం అన్ని నిర్మాణ సామగ్రి రేట్లు ఆకాశన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో హోమ్ లోన్ ను ఆశ్రయించడం అనివార్యమవుతోంది. వాటిని తిరిగి నెలనెలా ఈఎంఐ కట్టుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ ఏడాదిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును భారీగా పెంచింది. మే నెల నుంచి డిసెంబర్ వరకూ పెంచుతూనే ఉంది. ఈ నెల ఏడో తేదీన పెంచిన 35 బేస్ పాయింట్లు పెంచగా.. మొత్తం ఈ ఏడు నెలల కాలంలో దాదాపు 225 బేస్ పాయింట్లు పెంచింది. దీంతో రేపో రేటు 4 శాతం నుంచి ఇప్పుడు 6.25శాతానికి చేరింది. ఫలితంగా బ్యాంకులు తాము వినియోగదారులకు అందించే లోన్లపై వడ్డీ రేటును కూడా అమాంతం పెంచేశాయి. ఇది సగటు వేతన జీవిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో పెరిగిన రెపో రేటు కారణంగా అధికమవుతున్న వడ్డీ రేట్ల భారం పడకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిని నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్త వారిపైనే కాదు.. పాత లోన్లపై కూడా..

ప్రస్తుతం పెరిగిన రెపో రేటు కారణంగా బ్యాంకర్లు వినియోగదారులకు ఇచ్చే వడ్డీ రేట్లను రివైజ్ చేశాయి. అయితే ఈ రేటు కేవలం కొత్తగా లోన్ తీసుకునే వారికే వర్తిస్తాయనుకోవడం సరికాదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న లోన్లపై కూడా ఈ వడ్డీ రేటు భారం పడుతుంది.

భారం ఎంత పడుతుందో తెలుసా..

ఇవి కూడా చదవండి

ఒక సింపుల్ ఉదాహరణ చూస్తే.. మీరు రూ. 50 లక్షలు హోమ్ లోన్ ను తీసుకున్నారను కోండి. ఏడు శాతం వడ్డీ తో 20 ఏళ్లలో కట్టేలాగా పెట్టుకున్నారనుకోండి. మీరు నెల నెలా కట్టాల్సిన ఈఎంఐ రూ. 38, 765 ఉంటుంది. మొత్తం 20 ఏళ్లలో మీరు అసలుపై కట్టే వడ్డీ రూ. 43,03, 587 అవుతుంది. ఇప్పుడు ఊహించుకోండి రెపో రేటు పెరిగిన కారణంగా ఇదే లోన్ పై మీ బ్యాంకు వడ్డీ రేటు రివైజ్ చేసిందనుకోండి. ఏడు శాతం ఉన్న రేటు కాస్త 8.5 శాతం అయ్యిందనుకుంటే.. ప్రతి నెలా మీరు కట్టే ఈఎంఐ రూ. 43,391కి చేరుతుంది. మొత్తం 20 ఏళ్లలో మీరు అసలుపై కట్టే వడ్డీ రూ. 54,13,397 అవుతుంది. ఒకవేళ మీరు పాత ఈఎంఐనే కడతానంటే మొత్తం కాల వ్యవధి 20 ఏళ్లకు బదులు 28.9 ఏళ్లకు చేరుతుంది. ఆ వడ్డీ మొత్తం రూ. 84, 50, 166 అవుతుంది.

ఈ భారాన్ని తప్పించుకోవాలంటే..

కొన్ని అనుకూల పద్ధతులను వినియోగించి ఈ భారాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏటా ఒక ఈఎంఐ అధికంగా చెల్లించడం.. మీరు ప్రతి నెలా చెల్లించే ఈఎంఐ ఒక నెల అధికంగా చెల్లించడం. అంటే రూ. 50 లక్షల లోన్ 20 ఏళ్లలో చెల్లించేలా 8.5శాతం వడ్డీకి తీసుకుంటే.. మీరు కట్టే ఈఎంఐ రూ. 43, 391 అవుతుంది. ఒక ఏడాదిలో మీరు ఒక ఈఎంఐ అధికంగా చెల్లిస్తే మొత్తం లోన్ కాల వ్యవధిలో దాదాపు రూ. 10.2 లక్షల వడ్డీని తగ్గించుకోవడంతో పాటు లోన్ కాల పరిమితని దాదాపు 3.3 ఏళ్లు తగ్గించుకోవచ్చు.

అధిక ఈఎంఐ.. చెల్లించే ఈఎంఐని 5శాతం మేర పెంచుకుంటూ వెళ్తే.. మీరు లోన్ పై కట్టే వడ్డీపై రూ. 19.5 లక్షలు సేవ్ చేసుకోవచ్చు. అలాగే దాదాపు 7.5 ఏళ్లు కాల వ్యవధి తగ్గుతుంది.

ప్రీపేమెంట్ చేస్తే.. మీకు ఒక వేళ యాన్యూవల్ ఇన్సెన్టివ్స్, బోనస్ వంటివి వస్తే.. ఆ సమయంలో ఈ లోన్ లపై పార్షియల్ పేమెంట్స్ చేయడం ఉత్తమం. ఇలా ఒక ఏడాదిలో ఒక లక్ష చేస్తే.. మొత్త లోన్ కాల వ్యవధిలో రూ. 18.5 లక్షల వరకూ వడ్డీని సేవ్ చేసుకోవడంతో పాటు మీ టెన్యూర్ని దాదాపు ఆరేళ్లు తగ్గించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?