AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ ఐదుగురు వ్యక్తులకు పొరపాటున కూడా డబ్బులు ఇవ్వొద్దు.. తర్వాత మీరే బాధపడాల్సి ఉంటుంది.. ఎందుకంటే..

ఆచార్య చాణక్యుడు అపర మేథావి. తక్షశిల విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడు. మొదటి మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి. కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లతో కూడా చాణక్యుడిని పిలుస్తారు, చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రంలో పాటు మానవ గుణగణాలను నడుచుకునే తీరుని తెలియజేస్తూనీతి దర్పణం అనే పుస్తకాన్ని రచించాడు. ఇందులో చాణక్యుడు డబ్బుకు సంబంధించిన నియమాలను కూడా ప్రస్తావించాడు. ఎవరైనా సరే ఐదుగురికి డబ్బు ఇవ్వకూడదని.. వారికీ డబ్బు ఇస్తే అందుకు బాధపడాల్సి వస్తుందని పేర్కొన్నాడు. ఈ రోజు ఎవరికి డబ్బు ఇవ్వకూడదో తెలుసుకుందాం.

Chanakya Niti: ఈ ఐదుగురు వ్యక్తులకు పొరపాటున కూడా డబ్బులు ఇవ్వొద్దు.. తర్వాత మీరే బాధపడాల్సి ఉంటుంది.. ఎందుకంటే..
Acharya Chanakya
Surya Kala
|

Updated on: Jun 11, 2025 | 8:07 AM

Share

ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సమయంలో డబ్బు కొరతను ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితిలో ప్రజలు తమ పొరుగువారి నుంచి లేదా స్నేహితుల నుంచి డబ్బు అప్పుగా తీసుకుంటారు. అయితే గొప్ప దౌత్యవేత్త, పండితుడిగా పరిగణించబడే ఆచార్య చాణక్యుడు డబ్బును సరిగ్గా ఉపయోగించడం, కూడబెట్టుకోవడం, ఖర్చు చేయడం గురించి అనేక ముఖ్యమైన సలహాలను ఇచ్చారు. దీనిలో ఎటువంటి వ్యక్తులకు డబ్బు ఇవ్వకూడదో కూడా చెప్పాడు. తప్పుడు వ్యక్తులకు డబ్బు ఇవ్వడం వల్ల డబ్బు నష్టపోవడమే కాదు జీవితంలో సమస్యలు కూడా పెరుగుతాయని చాణక్యుడు నమ్మాడు. అదే విషయాన్నీ తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. చాణక్య నీతి ప్రకారం పొరపాటున కూడా ఎవరికి డబ్బు ఇవ్వకూడదో ఈ రోజు తెలుసుకుందాం..

చెడు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు చాణక్య నీతి ప్రకారం చెడు ప్రవర్తన ఉన్నవారికి డబ్బు ఇవ్వడం ఇబ్బందులను ఆహ్వానించడం లాంటిది. అనైతిక కార్యకలాపాలలో పాల్గొనే, మోసం చేయడంలో నిపుణులైన వ్యక్తులకు ఎప్పుడూ డబ్బు ఇవ్వకూడదని చాణక్య చెప్పాడు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ డబ్బు వృధా కావడమే కాదు.. చాలాసార్లు మీరు ఇబ్బందుల్లో పడవచ్చు.

అసంతృప్తితో ఉండే వ్యక్తులకు లేదా ఎప్పుడూ విచారంగా ఉండే వ్యక్తులకు చాణక్య నీతిలో స్పష్టంగా చెప్పబడినది ఏమిటంటే.. ఎప్పుడూ అసంతృప్తిగా ఉండి, జీవితం పట్ల ప్రతికూల దృక్పథం కలిగి ఉండే వ్యక్తులకు ఎప్పుడూ డబ్బు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులకు డబ్బుల విలువ తెలియదు. ఎంత ఉన్నా వీరికి ఎప్పుడూ సంతృప్తి అన్న మాట ఉండదు. అసంతృప్తితోనే జీవిస్తారు. చాణక్య ప్రకారం ఇలాంటి నిత్య అసంతృప్తి వ్యక్తులకు దూరంగా ఉండటం తెలివైన పని, ఎందుకంటే వీరితో ఉండటం వల్ల మీ మనస్సు ప్రతికూలతతో నిండిపోతుంది.

ఇవి కూడా చదవండి

మూర్ఖులు, బాధ్యతారహితమైన వ్యక్తులు మూర్ఖులు, బాధ్యతారహిత వ్యక్తులకు డబ్బు ఇవ్వడం పొరపాటు చర్య అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఏది కరెక్ట్, ఏది తప్పు అన్న తేడాను గుర్తించలేరు. డబ్బును తప్పుడు విషయాలకు ఉపయోగించడానికి కూడా వెనుకాడరు. చాణక్యుడి ప్రకారం ఒక మూర్ఖుడు ఎవరి సలహాను వినడు. తన సొంత ఇష్టానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు. అటువంటి పరిస్థితిలో మూర్ఖులకు డబ్బు ఇవ్వడం అంటే వీరికి సహాయం చేయడం పనికిరానిది మాత్రమే కాదు.. అలా డబ్బులు ఇచ్చి మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది.

మద్యం అలవాటు ఉన్నవారికి చాణక్య నీతిలో మాదకద్రవ్యాలకు , మద్యం వంటి అలవాట్లకు బానిసలైన వ్యక్తులకు డబ్బు ఇవ్వడం ఖచ్చితంగా తప్పే అని చెప్పాడు. అలాంటి వ్యక్తులు తమ అలవాట్ల కోసం ఎంతకైనా దిగజారి.. డబ్బును దుర్వినియోగం చేయవచ్చు. ఏదేమైనా.. మాదకద్రవ్యాల బానిసలు ఏది సరైనది.. ఏది తప్పు అన్న తేడాను గుర్తించలేరు. ఆచార్య చాణక్యుడి ప్రకారం అలాంటి వారికి డబ్బు ఇవ్వడం డబ్బును వృధా చేయడం వంటిది. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు తమ వ్యసనాన్ని తీర్చుకోవడానికి మాత్రమే డబ్బులను ఉపయోగిస్తారు.

తమ సంపద గురించి గర్వపడే వ్యక్తులకు చాణక్య నీతి కూడా తమ సంపదను చూసి గర్వపడే వారికి డబ్బు ఇవ్వడం సముచితం కాదని చెబుతుంది. అలాంటి వ్యక్తులు డబ్బును గౌరవించరు. తప్పుడు మార్గాల్లో ఖర్చు చేస్తారు. చాణక్య ప్రకారం తమ సంపదను చూసి గర్వపడే వ్యక్తులు త్వరలో పేదరికం అంచుకు చేరుకుంటారు. వీఎరికి సహాయం చేయడం వల్ల మీ డబ్బు వృధా అవుతుంది. అలాగే మీ సమయం, శక్తికి అవమానం జరుగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.