AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold and Silver Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర.. నేడు గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే

భారతీయులకు బంగారం కొనడం అంటే అమితమైన ఇష్టం. దీంతో ఎటువంటి సందర్భం వచ్చినా సరే శక్తి కొలది బంగారం లేదా వెండి కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. అంతగా బంగారం, వెండి లోహాలు మన జీవితాలతో ముడిపడిపోయాయి. బంగారం నగలు అలంకారానికి మాత్రమేకాదు.. ఆర్ధిక భరోసాగా కూడా భావిస్తారు. గత కొంత కాలంగా పసిడిని మంచి పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. దీంతో పసిడి, వెండి లోహాలకు భారీ డిమాండ్ నెలకొంది. దీంతో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. ఈ రోజు (జూన్ 11 వ) బుధవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Gold and Silver Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర.. నేడు గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే
Gold And Silver Price
Surya Kala
|

Updated on: Jun 11, 2025 | 6:59 AM

Share

ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన పరిమాణాలతో బంగారం ధరల్లో రోజు రోజుకీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పసిడి ప్రియులకు కొనుగోలు చేసే విషయంలో కొంచెం గందరగోళం నెలకొంది. అయితే వాస్తవానికి పసిడి, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ మారకంపై ఆధారపడి ఉంటాయి. అంతేకాదు ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, వడ్డీ రేట్లపై కూడా ఆధారపడి ఉంటాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు (జూన్ 11వ తేదీ) బుధవారం తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బుధవారం ధరలు ఎలా ఉన్నాయంటే…

హైదరాబాద్ లో పసిడి ధర మంగళవారం వలెనే బుధవారం కూడా స్వల్పంగా తగ్గింది. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,440ఉండగా.. 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 97,570లకు దిగి వచ్చింది. దాదాపు ఇవే ధరలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, పొద్దుటూరు, వరంగల్ లో కొనసాగుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 97,570లుఉండగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.89,440గా కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,720లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 89,590గా ఉంది.

చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్ల ధర రూ. 97,570లకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,440గా ఉంది. ఇవే ధరలు బెంగళూరు, కేరళ, కోల్ కతా, పూణే వంటి ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి.

జూన్ 11 వ తేదీ బుధవారం వెండి ధర

ప్రాచీన కాలం నుంచి వెండి విలువైన లోహంగా ప్రసిద్ధిచెందినది. వెండిని ఆభరణాలు, నాణేలు, వంటపాత్రల తయారీ కోసం మాత్రమే కాదు రసాయనిక చర్యలలో ఉత్ప్రేరకంగా కూడా ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో వెండి మంచి పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. అందుకనే బంగారం త‌ర్వాత వెండి లోహం కొనుగోలుకి ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. ఈ నేపధ్యంలో వెండి కొనాలనుకునే వినియోగదారులు మార్కెట్ లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు వెండి ధర (జూన్ 11 వ తేదీ బుధవారం )ఎలా ఉందొ తెలుసుకుందాం..

బంగారం క్రమంగా దిగి వస్తుండగా వెండి ధర మాత్రం షాక్ ఇస్తూ పై పైకి చేరుకుంటుంది. ఈ రోజు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర స్వల్పంగా అంటే వంద రూపాయలు మేర పెరిగింది. దీంతో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 1,19,100లకు చేరుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
వైస్ కెప్టెన్సీ పోస్ట్ పాయే.. వన్డే టీం నుంచి పీకేసే..
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
రాత్రి అన్నం మిగిలిందా? రూపాయి ఖర్చు లేకుండా కరకరలాడే వడియాలు
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
ఏసీ రూముల్లో ఉన్నా శరీరం డీహైడ్రేట్ అవుతుందా..?
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
సమ్మర్లో తులసి మొక్క గుబురుగా పెరగాలంటే గింజలు ఇలా చల్లాలి..
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
ఆధార్ ఉన్నవారికి కేంద్రం అలర్ట్.. యాప్ సేవలు బంద్
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
భారత వన్డే జట్టులో ఐపీఎల్ హవా.. ఏ టీం నుంచి ఎంతమంది ఉన్నారంటే?
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.4 రేటింగ్
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
చిన్న పిల్లలకు నూనె మసాజ్ చేయడం వల్ల ఇన్ని లాభాలా? తల్లిదండ్రులు
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
రాత్రికి రాత్రే వీరి అప్పులు మొత్తం తీర్చేస్తారు..
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?
ప్రపంచకప్ హీరోతోపాటు మరో ముగ్గురికి మొండిచేయి.. ఇంత అన్యాయమా?