Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: మెట్ల కింద టాయిలెట్ నిర్మాణం.. వాస్తు దోషం అని తెలుసా.. డబ్బులకోసం ఇబ్బందులు తప్పవు..

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి నిర్మాణం మాత్రమే కాదు.. ఇంట్లో గదుల ఏర్పాటు, వస్తువులను పెట్టుకునే విషయంలో కూడా నియమాలున్నాయి. వాస్తు ప్రకారం.. మెట్ల కింద టాయిలెట్ నిర్మించడం అశుభంగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని కలిగిస్తుంది. అయితే స్థలం లేకపోవడం వల్ల చాలా మంది మెట్ల కింద టాయిలెట్లు నిర్మించుకుంటారు. మీ ఇంట్లో కూడా మెట్ల కింద టాయిలెట్ ఉంటే, మీరు కొన్ని నియమాలను తెలుసుకోవాలి.

Vastu Tips: మెట్ల కింద టాయిలెట్ నిర్మాణం.. వాస్తు దోషం అని తెలుసా.. డబ్బులకోసం ఇబ్బందులు తప్పవు..
Toilet Under Stairs
Follow us
Surya Kala

|

Updated on: Jun 11, 2025 | 8:29 AM

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ప్రతి మూలకు సంబంధించి కొన్ని నియమాలున్నాయి. వాస్తు ప్రకారం మెట్ల కింద టాయిలెట్ ఉండటం అశుభకరమని భావిస్తారు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని కలిగిస్తుంది. అయితే ప్రస్తుతం ఇంటిని నిర్మించుకోవడనికి తగినంత స్థలం లేకపోతే.. ఉన్న స్థలంలోనే తగిన విధంగా ఇంటిని నిర్మించుకుంటారు. ఇందులో భాగంగా మెట్ల కింద టాయిలెట్ నిర్మించుకుంటున్నారు. ఎవరి ఇంట్లోనైనా మెట్ల కింద టాయిలెట్ ఉంటే.. తప్పని సరిగా కొన్ని వాస్తు నియమాలను తెలుసుకోవాలి. ఈ వాస్తు నియమాలను నిర్లక్షం చేస్తే.. ఆ ఇంట్లో ఉండేవారు ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని, డబ్బు ఇబ్బందిని ఎదుర్కోవలసి ఉంటుంది.

మెట్ల కింద టాయిలెట్ నిర్మిస్తే ఏమవుతుంది?

వాస్తు శాస్త్రం ప్రకారం మెట్ల కింద ఎప్పుడూ టాయిలెట్ నిర్మించకూడదు. మెట్ల కింద టాయిలెట్ ఉండటం వల్ల ఇంటికి దురదృష్టం కలుగుతుందని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం టాయిలెట్ అత్యంత ప్రతికూల శక్తిని వ్యాపింపజేస్తుంది. అటువంటి పరిస్థితిలో టాయిలెట్‌ను మెట్ల కింద నిర్మిస్తే ఈ ప్రతికూలత ఇల్లు అంతటా వ్యాపించడం ప్రారంభమవుతుంది. మెట్ల కింద టాయిలెట్ నిర్మించడం వల్ల ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది.

టాయిలెట్ మెట్ల కింద ఉంటే ఏమి చేయాలంటే..

  1. మెట్ల కింద టాయిలెట్ ఉండటం వల్ల ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఇది ప్రతికూల శక్తిని ప్రోత్సహిస్తుంది. ఆర్థిక సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇంట్లో మెట్ల కింద కూడా టాయిలెట్ ఉంటే.. కొన్ని వాస్తు నివారణలు చేయడం ద్వారా ప్రతికూల శక్తిని తగ్గించుకోవచ్చు.
  2. ఉప్పు: మెట్ల కింద టాయిలెట్ ఉంటే టాయిలెట్‌లో ఒక గిన్నె ఉప్పు ఉంచండి. ఆ గిన్నెలోని ఉప్పుని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి. ఇలా చేయడం ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది.
  3. వాస్తు యంత్రం: టాయిలెట్ మెట్ల కింద ఉంటే.. దానిలో వాస్తు యంత్రం లేదా క్రిస్టల్‌ను ఉంచవచ్చు. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు కూడా తగ్గుతాయని నమ్ముతారు.
  4. ఇతర పరిష్కారాలు: టాయిలెట్‌లో నీలిరంగు బకెట్, అద్దం, మొక్క లేదా పెయింటింగ్ ఉంచడం వల్ల ప్రతికూల శక్తిని తగ్గించి సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతాయి.
ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.