Vidura Niti: యవ్వనంలో సమయం విలువ తెలుసుకోకపోతే.. వృద్ధ్యాప్యంలో బాధలు తప్పవంటున్న విదుర..
పంచమ వేదం మహాభారతంలో ఒక్కొక్క పాత్రకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. భీష్మ పితామహుడు, పాండవులు, శ్రీ కృష్ణుడు, కర్ణుడు వంటి వారికి ఎంతటి ప్రాధాన్యత ఉందో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత విదురుడికి ఉంది. విదురుడు గొప్ప ఆధ్యాత్మిక వేత్త. నీటి శాస్త్ర నిపుణులు. ఆయనధృతరాష్ట్రుడికి బోధించిన విషయాలు విదుర నీతి ఖ్యాతి గాంచాయి. ఈ రోజు విడురుచేప్పిన సమయం ప్రాముఖ్యతని గురించి తెలుసుకుందాం..

మహాభారత ఇతిహాసంలోని ప్రధాన పాత్రలలో మహాత్మ విదురుడు ఒకరు. ఆయనను గొప్ప ఆధ్యాత్మిక సాధకుడని, సత్త్వ జ్ఞాన సంపన్నుడని నీతి శాస్త్రంలో నిపుణుడిగా పరిగణిస్తారు. ఆయన ఆలోచనలు విదుర నీతిగా ప్రాముఖ్యతని సొంతం చేసుకున్నాయి. విదుర్ నీతి ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన సామాజిక , వ్యక్తిగత జీవితం గురించి చెబుతుంది. విదుర నీతులు అర్థం చేసుకున్న వాటి ప్రకారం నడిచే వారికి ఎటువంటి కష్టాలు బాధలు కలుగావని.. పాపాలు అంటవని నమ్మకం. జీవితంలో సమయం చాలా ముఖ్యమైనది. సరైన సమయంలో పనులు పూర్తి అయితే ఒత్తిడి కూడా తగ్గుతుంది. విదుర నీతి సమయం ప్రాముఖ్యత గురించి చెబుతుంది.
సమయం ప్రాముఖ్యత ఏమిటంటే
విదుర నీతిలో సమయం ప్రాముఖ్యతను వివరిస్తోంది. విదుర నీతిలో మనుషులు మంచి ప్రణాళిక ప్రకారం పని చేయాలని పేర్కొంది. ఒక వ్యక్తి పగటి సమయంలోనే అన్ని పనులను పూర్తి చేయాలి. తద్వారా అతను రాత్రి ప్రశాంతంగా నిద్రపోతాడు. సంతృప్తికరమైన మనస్సు కలిగి ఉంటాడు. అయితే సోమరితనంతో రోజంతా పనులను వాయిదా వేస్తే.. అది ఆందోళనకు కారణమవుతుంది. మహాత్మ విదురుడు చెప్పిన ప్రకారం, ఒక వ్యక్తి సంవత్సరంలో ఎనిమిది నెలల్లో ఇలా ఏరోజుకా రోజు పనిని పూర్తి చేయాలి. ఇలా చేయడం వలన వర్షాకాలంలో సులభంగా జీవించవచ్చు. అంతేకాదు ఎవరైనా సరే తమకు రానున్న కష్ట సమయాన్ని గుర్తించి ముందుగానే సిద్ధం కావాలి.
మహాత్మా విదురుడి ప్రకారం.. జీవిత దశకు అనుగుణంగా పనిచేయాలి. శరీరంలో బలం ఉన్నప్పుడు.. బాగా చదువుకోవాలి. కష్టపడి పనిచేయడం ద్వారా విజయం సాధించాలి. అంటే యవ్వనంలోనే సమయానికి విలువ ఇచ్చి.. శ్రద్దగా పని చేయాలి. తద్వారా వృద్ధాప్యంలో జీవితం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అప్పుడు వృద్దాప్య సమయం హాయిగా గడిచిపోతుంది. యవ్వనంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా ముఖ్యం. శరీరంలో శక్తి ఉన్నప్పుడు చిన్న వయస్సులోనే డబ్బు సంపాదించండి. అందరితోనూ మంచి సంబంధాలు కొనసాగించండి. ఇలా చేయడం వలన ఆరోగ్యం బాగుంటుంది. విదుర నీతి ప్రకారం మరణం తర్వాత కూడా ప్రజలు మిమ్మల్ని గుర్తుంచుకునేలా జీవితంలో ఏదైనా మంచి పని చేయమని విదుర నీతిలో పేర్కొన్నాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.