Chanakaya Niti: మీ పిల్లలు చదువులో సక్సెస్ కావాలంటే ఈ అలవాట్ల నుంచి దూరం చేయమన్న చాణక్య
ఆచార్య చాణక్యుడు తక్షశిల అధ్యాపకుడు. రాజనీతజ్ఞుడు. అత్యంత ప్రాచీన భారతదేశ పండితుడైన చాణక్యుడు వివిధ పేర్లతో రాసిన గ్రంథాలు నేటికీ అనుసరణీయం. ఆయన ఇచ్చిన విధానం నేటికీ సందర్భోచితంగా ఉందని పెద్దలు అనుసరణీయం అని చెబుతారు. చాణక్య నీతిలో విద్యార్ధులకు విద్య ఆర్జించే విధానం చెప్పాడు. విద్యార్థులు ఆచార్య చాణక్యుడు కొన్ని అలవాట్లను వదులుకోవడం గురించి చెప్పాడు.

జీవితంలో విజయం సాధించాలంటే విద్యార్థి జీవితంలో కష్టపడి పనిచేయాలి. ముందుకు సాగాలంటే విద్యార్థులు కొన్ని విషయాలను త్యాగం చేయాలని, కొన్ని విషయాలపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఆచార్య చాణక్య రచించిన చాణక్య నీతిలో కూడా దీని గురించి చెప్పారు. ఆచార్య చాణక్య ఇప్పటికీ ప్రాచీన భారతదేశ పండితుడిగా ఖ్యాతినిగాంచారు. ఆయన చెప్పిన విధానం నేటికీ అనుసరణీయంగా ఉంటుంది. ఆచార్య చాణక్య విద్యార్థి చేయకూడని కొన్ని విషయాల గురించి చెప్పాడు. అవి ఏమిటో ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.
దురాశ: ఆచార్య చాణక్యుడి ప్రకారం విద్యార్థులు దురాశకు దూరంగా ఉండాలి. దురాశ ఒక వ్యక్తిని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తుంది. విద్యార్థి జీవితంలో అతని లక్ష్యాల నుంచి దూరం చేస్తుంది.
కోపం: జీవితంలో నిజాయితీగా పని చేయాలి. చదువుకునే వారు కోపంగా ఉండకూడదు. కోపం ఆలోచనా శక్తిని తగ్గిస్తుంది. సంబంధాలను చెడగొడుతుంది. విద్యార్థి ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉండాలి.
రుచికోసం తినొద్దు: చాణక్య నీతి ప్రకారం విద్యార్థులు వేయించిన ఆహారాలు తినకూడదు. లేకుంటే అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సరళమైన, సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి.
ఫ్యాషన్ దుస్తులు: స్టూడెంట్స్ చదువుకోవడానికి ఏకాగ్రత అవసరం. ఆచార్య చాణక్య విద్యార్థులు అతిగా దుస్తులు ధరించడం, గొప్పగా కనిపించాలను కోవడం మానుకోవాలని సలహా ఇచ్చాడు.
అతి నిద్ర: ఆచార్య చాణక్యుడు అతి నిద్రను నివారించమని సలహా ఇచ్చాడు. అతిగా నిద్రపోవడం వల్ల పిల్లలు సోమరిపోతులుగా మారిపోతారు. అప్పుడు పిల్లలు చదువుకునే సమయం కూడా వృధా అవుతుంది. ఆరోగ్యానికి నిద్ర ముఖ్యం కానీ అతిగా నిద్రపోయే అలవాటును తగ్గించుకోవాలి. అతి వినోదం కూడా చదువుకు ఆటంకం కలిగిస్తుంది. కనుక దీనికి కూడా స్టూడెంట్స్ దూరంగా ఉండాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.