Community Kitchen: ఈ గ్రామం వెరీ వెరీ స్పెషల్.. అందరూ వృద్ధులే.. వంట ఇల్లే ఉండదు.. మరి ఆహారం ఎలా తింటారంటే..
మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్నదో పెద్దదో వంట గది ఉంటుంది. లేదంటే వంట చేసుకునే ప్రత్యేక ప్లేస్ ఉంటుంది. అయితే మన దేశంలో వంటగది లేని ఒక ప్రత్యేకమైన గ్రామం ఉందని తెలుసా..!అయితే ఈ గ్రామస్తులు భోజనం కోసం ఏమి చేస్తారని ఆలోచిస్తున్నారా.. ఈ రోజు వంట గదిలేని గ్రామం ఎక్కడ ఉంది? ఆ గ్రామస్తులు ఎలా ఆహారాన్ని తింటారు వంటి అనేక ఆసక్తికరమైన సమాచారం గురించి తెలుసుకుందాం..

ఇంట్లో వంటగది చాలా ముఖ్యం. వంటగది లేని ఇంటిని ఊహించడం అసాధ్యం. అయితే మన దేశంలో ఈ గ్రామంలో.. మీరు ఏ ఇంటికి వెళ్ళినా.. మీకు వంటగది దొరకదు. అయితే ఈ గ్రామంలో ప్రజలు తినకుండా ఉపవాసం ఉంటారా లేక కందమూలాలు, పండ్లు ఫలాలు తింటారా అనే ప్రశ్న తలెత్తవచ్చు. ఈ సందేశానికి సమాధానం ఏమిటంటే.. ఈ గ్రామంలో వృద్ధులు మాత్రమే నివసిస్తున్నారు. ఇక్కడి ప్రజలు మధ్యాహ్నం భోజనం చేస్తారు. వంటగది లేని ఈ గ్రామం ఎక్కడ ఉంది? ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటి? ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన సమాచారం గురించి తెలుసుకుంది.
భారతదేశంలో ఒక ప్రత్యేకమైన గ్రామం
భారతదేశంలోని ఈ గ్రామం చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడి యువకులందరూ మంచి విద్యను అభ్యసించారు, మంచి ఉద్యోగాలు సంపాదించారు. నగరానికి వలస వెళ్లారు. అందువల్ల ఇక్కడ వృద్ధులు మాత్రమే కనిపిస్తారు. వెయ్యి మందికి పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో ఇప్పుడు 500 మంది మాత్రమే ఉన్నారు. ఈ ప్రత్యేకమైన గ్రామం పేరు చందంకి. ఇది గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలో ఉంది. ఈ అభివృద్ధి చెందిన గ్రామాలకు కాంక్రీట్ రోడ్లు , 24 గంటల విద్యుత్ ఉన్నాయి. అయితే ఈ గ్రామంలోని ఇళ్లలో ఏ ఒక్కదానికీ వంటగది లేదు. అందువల్ల ఇక్కడి ప్రజలు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకున్నారు. కమ్యూనిటీ కిచెన్ అని పిలువబడే ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి కూర్చుని తింటారు.
కమ్యూనిటీ కిచెన్ అంటే ఏమిటి?
గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని చందంకి గ్రామంలో ఇంట్లో ఎవరూ వంట చేయరు. ఇక్కడ ఒక కమ్యూనిటీ కిచెన్ ఉంది. అక్కడ వృద్ధులకు అవసరమైన ఆహారాన్ని తయారు చేస్తారు. ఈ గ్రామంలోని యువత నగరాలకు వెళ్లదాంతో ఆ గ్రామంలో వృద్ధులు సహజంగానే ఒంటరిగా మిగిలిపోయారు. అందువల్ల రోజులో మూడు సార్లు తినేందుకు వచ్చే వృద్ధులు అందరూ కలుస్తారు. ఇలా సమావేశమవడం అవ్వడం ద్వారా వృద్ధులు తమ బాధలను మరచిపోయి.. ఒకరికొకరం అన్నట్లు అందరితో కలిసిపోతారు.
కమ్యూనిటీ కిచెన్ నాయకులు ఎవరు?
కమ్యూనిటీ కిచెన్ అనే ప్రత్యేకమైన వ్యవస్థను గ్రామ సర్పంచ్ పూనంబాయి పటేల్ స్థాపించారు. గ్రామంలోని ఈ హాలులో 35-40 మంది కలిసి కూర్చుని తినవచ్చు. ఎయిర్ కండిషన్డ్ వ్యవస్థ కూడా ఉంది. కమ్యూనిటీ కిచెన్‌లో వంట చేయడానికి వంటవారిని నియమించారు. అతని నెల జీతం దాదాపు పదకొండు వేల రూపాయలు. మెనూలో పప్పు, బియ్యం, చపాతీ, కిచిడి, రోటి, మెంతి గోట, ధోక్లా, ఇడ్లీ సాంబార్ సహా వివిధ స్వీట్లు ఉంటాయి. ఇక్కడ వృద్ధులందరూ కలిసి కూర్చుని తింటారు. మరో ప్రత్యేకత ఏమిటంటే మహిళలు మొదట తింటారు. తరువాత పురుషులు తింటారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలు ఈ ప్రత్యేకమైన గ్రామాన్ని సందర్శిస్తారు. ఈ గ్రామస్తులు సోదరభావం, ఐక్యతకు ఉదాహరణగా నిలుస్తున్నారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..