Chicken vs Mutton vs Fish:చికెన్-మటన్ లేదా చేప.. ఏ నాన్-వెజ్ ఆరోగ్యకరమైనది.. ఏ సమస్య ఉన్నవారు ఏది తినాలంటే..
మాంసాహారం అంటే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేవి మటన్, చికెన్, చేపలు. ఈ మూడింటిలో వేటికవే సొంత ప్రయోజనాలు, పోషకాలున్నాయి. కొన్నిటిలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటే.. మరికొన్నింటిలో అధిక ఐరన్ కంటెంట్ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఏ నాన్-వెజ్ ఆహారం ఎక్కువ ఆరోగ్యకరమైనది అనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది? మీకు కూడా ఆలోచన ఉంటే ఈ రోజు ఇక్కడ పోషక విలువ ఆధారంగా ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం..

మాంసాహార ప్రియులలో ఏ నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువ ప్రయోజనకరం అనే చర్చ తరచుగా జరుగుతుంది. చికెన్, మటన్ లేదా చేప ఏది బెస్ట్ ఫుడ్ అనే విషయంలో ఎప్పుడూ గందరగోళమే.. ఒక వైపు చికెన్‌లో తక్కువ కొవ్వు ఉండి.. అధిక ప్రోటీన్ ఉన్న ఆహారం. మరోవైపు మటన్‌ను శక్తి , ఐరెన్ నిధిగా చెబుతారు. మరోవైపు చేపలు గుండె, మెదడు ఆరోగ్యానికి సూపర్‌ఫుడ్‌గా పరిగణించబడుతుంది. అయితే ఆరోగ్యం దృక్కోణంలో చూస్తే..ఆహారం అంటే రుచి ఉంటేనే మాత్రమే సరిపోదు.. వీనిని తినడం వలన శరీరానికి కలిగే ప్రయోజనాలు, హానిని కూడా గుర్తుంచుకోవాలి?
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పోషక విలువల ఆధారంగా చికెన్, మటన్, చేపలలో ఏ నాన్-వెజ్ ఫుడ్ ఆరోగ్యకరమైన ఎంపిక ఏది అంటే సాల్మన్ ఫిష్, స్కిన్‌లెస్ చికెన్, లీన్ మటన్ మధ్య ఉన్న పోషకాల గురించి తెలుసుకుందాం.. ఎందుకంటే ఇవి చాలా ప్రజాదరణ పొందిన కొన్ని రకాలు.
చికెన్, మటన్, చేపల పోషకాహారం చికెన్, మటన్, చేపలలో పోషకాలు వేర్వేరు మొత్తాలలో ఉంటాయి. ఉదాహరణకు చికెన్ లో అత్యధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల చికెన్‌లో దాదాపు 31 గ్రాముల ప్రోటీన్, 165 కిలో కేలరీలు మరియు 3.6 గ్రాముల కొవ్వు ఉంటుంది. మటన్‌లో కొంచెం ఎక్కువ కొవ్వు ఉంటుంది. ఇందులో 294 కిలో కేలరీలు, 25 గ్రా ప్రోటీన్, 20 గ్రాముల కొవ్వు ఉంటుంది. చేపలో 208 కిలో కేలరీలు ఉంటాయి. దీనితో పాటు, 20 గ్రాముల ప్రోటీన్, 13 గ్రాముల కొవ్వు ఉంటుంది.
ప్రోటీన్ అధికంగా ఉండే చికెన్ ముందుగా చికెన్ గురించి మాట్లాడుకుంటే.. ఇది అత్యంత ఇష్టపడే నాన్-వెజ్. దీనిలో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అదే సమయంలో కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇది బరువు తగ్గడానికి మంచి ఎంపిక. దీనితో పాటు ఇది విటమిన్ బి6 , నియాసిన్ వంటి ముఖ్యమైన విటమిన్లను కూడా కలిగి ఉంటుంది.ఇవి శరీర శక్తి స్థాయిని నిర్వహించడంలో సహాయపడతాయి. కేలరీల గురించి మాట్లాడితే, చికెన్‌లో 165 కిలో కేలరీలున్నాయి.
మటన్ ప్రయోజనాలు మటన్‌లో ఐరన్ , జింక్ పుష్కలంగా ఉన్నాయి. ఇది హిమోగ్లోబిన్‌ను పెంచడంలో, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, మటన్ అధిక కేలరీలు, అధిక శక్తి కలిగిన ఆహారం కనుక ఇది ఎక్కువ శారీరక శ్రమ చేయాల్సిన వారికి లేదా ఎక్కువ శక్తి అవసరమయ్యే వారికి ఈ మటన్ సరైన ఎంపిక. ఇందులో బి-విటమిన్లు, ముఖ్యంగా బి12 విటమిన్ ఉంది. ఇది నాడీ వ్యవస్థ, మెదడు ఆరోగ్యానికి అవసరం. అయితే దీనిలో కొవ్వు శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది.
చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె, మెదడు ఆరోగ్యానికి అద్భుతమైనవిగా భావిస్తారు. ఇందులో సంతృప్త కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. ఇది గుండెకు అనుకూలమైన ఎంపికగా మారుతుంది. అలాగే చేపలు ఎముకలు, థైరాయిడ్ పనితీరుకు అవసరమైన విటమిన్ డి, అయోడిన్ ల మంచి మూలం.
ఈ మూడింటిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమైనదంటే చికెన్, మటన్, చేపలలో ఏది ఆరోగ్యకరమైనదో మీ శరీర అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఎవరికైనా ఎక్కువ ప్రోటీన్ అవసరమైతే చికెన్ బెస్ట్ ఎంపిక. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనుకున్నా, మెదడు శక్తిని పెంచుకోవాలనుకున్నా చేపలు తినాల్సి ఉంటుంది. మరోవైపు ఎక్కువ శక్తి అవసరమయ్యే వారికి మటన్ మంచిది. అంటే శరీర ఆరోగ్యానికి అనుగుణంగా మీకు ఏది సరైనదో ఎంచుకోవచ్చు లేదా మీరు ఈ మూడింటినీ తినే ఆహారంలో చేర్చుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)