- Telugu News Photo Gallery Spiritual photos Morning rituals: Don't do these things when you wake up at morning
రోజు హ్యాపీగా సాగిపోవాలంటే.. ఉదయం నిద్రలేచిన వెంటనే పొరపాటున కూడా ఈ వస్తువులు చూడొద్దు ఎందుకంటే..
ఎవరికైనా రోజు ప్రారంభం బాగుంటే.. ముగింపు కూడా అంతే బాగుంటుందని చాలా బాగుంటుందని నమ్ముతారు. రోజు అందంగా మొదలు కావాలంటే చాలా మంది ఉదయాన్నే నిద్రలేచి యోగా, వ్యాయామం, పూజ వంటి మంచి పనులతో రోజును ప్రారంభిస్తారు. అటువంటి పరిస్థితిలో ఉదయం నిద్ర లేచిన వెంటనే కొన్ని తప్పులు చేయడం వల్ల రోజు నాశనం అవుతుంది. అవును ముఖ్యంగా ఉదయం నిద్ర లేచిన వెంటనే కొన్ని విషయాలను చూడటం వల్ల రోజు మొత్తం నాశనం అవుతుంది. ఈ విషయాన్ని అనేక శాస్త్రాల్లో ప్రస్తావించబడింది. కనుక ఉదయం నిద్ర లేచిన వెంటనే వేటిని చూడకూడదో తెలుసుకుందాం..
Updated on: Jul 04, 2025 | 8:01 AM

అద్దం: చాలా మందికి ఉదయం మంచం దిగిన వెంటనే అద్దంలో చూసుకోవడం అలవాటు. అయితే పురాణ శాస్త్రాల ప్రకారం.. ఎవరైనా సరే నిద్ర లేచిన వెంటనే అద్దంలో తమ ముఖం చూసుకోకూడదు. ఈ అలవాటు ఎవరి జీవితంపైన అయినా సరే ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అంటారు.

ఆగిపోయిన గడియారం: ఉదయం నిద్రలేవగానే ఆగిపోయిన గడియారాన్ని చూడటం అశుభమని భావిస్తారు. ఆగిపోయిన గడియారాన్ని చూడటం వల్ల చేయవలసిన పనిలో అడ్డంకులు ఏర్పడటమే కాదు జీవితంలో కొన్ని సమస్యలను కూడా కలిగిస్తాయి.

కృర జంతువులు: ఉదయం నిద్రలేచిన వెంటనే పులులు మొదలైన కూర జంతువుల చిత్రాలను చూడకూడదు. ఎందుకంటే ఇది రోజంతా మనస్సులో ఏదో ఒక విషయం గురించి వివాదం, గందరగోళాన్ని సృష్టిస్తుంది. అలాంటి చిత్రాలు సంఘర్షణ, పోరాటాలను సూచిస్తాయని చెబుతారు. కనుక మీ గదిలో జంతువుల చిత్రాలను ఉంచడం అశుభకరం.

శుభ్రం చేయని పాత్రలు: ఉదయం నిద్ర లేవగానే వంటగదిలో శుభ్రం చేయని మురికి పాత్రలు కనిపించడం కూడా అశుభమని భావిస్తారు. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని, పేదరికాన్ని తీసుకువస్తుందని కూడా నమ్ముతారు. అందుకే రాత్రి సమయంలోనే పాత్రలను శుభ్రం చేయాలని అంటారు.

నీడ: ఉదయం నిద్ర లేవగానే మీ సొంత నీడను లేదా ఇతరుల నీడను చూడటం మానుకోవాలి. ఎందుకంటే నీడను చూడటం వల్ల దురదృష్టం వస్తుంది. నీడను చూడటం వల్ల ఆ వ్యక్తిలో భయం, ఒత్తిడి, గందరగోళం పెరుగుతాయని అంటారు. అందుకే మీరు సూర్యోదయానికి ముందే మేల్కొనాలి.

మొబైల్: ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మీ మొబైల్ ఫోన్ వైపు చూడకూడదు. అవును, ఉదయం ప్రతికూల లేదా చెడు వార్తలు వినడం వల్ల మీ మొత్తం రోజు నాశనం అవుతుంది. కనుక ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ మొబైల్ ఫోన్ చూసే అలవాటు ఉంటే వెంటనే స్వస్తి చెప్పండి.

కనుక ఎవరైనా మీరు ఉదయాన్నే నిద్రలేవగానే.. మొదట చేయవలసినది మీ చేతులను చూసుకుని దేవుడిని ధ్యానించి, సంతోషకరమైన రోజు కోసం ప్రార్థించడం. అలాగే మనస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపే దేవుని చిత్రాలను చూడండి. ఇలా చేయడం ద్వారా రోజంతా సానుకూలంగా ఉంటుంది.




