మరో మూడు రోజుల్లో అదృష్టం కలిగే రాశులివే.. చేతినిండా డబ్బే డబ్బు
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది చాలా కామన్. ప్రతి గ్రహం తప్పకుండా తమ రాశిని మార్చుకుంటాయి. అయితే కేతువు గ్రహం తన నక్షత్రాన్ని మార్చుకోనుంది. దీంతో మూడు రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
Updated on: Jul 03, 2025 | 4:32 PM

గ్రహాలు రాశులను లేదా నక్షత్రాలను మార్చుకుంటాయి. కొన్ని నెలకు ఒకసారి తమ రాశిని లేదా నక్షత్రాను మార్చుకుంటే మరికొన్ని రాశులు సంవత్సరానికి ఒకసారి, మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి సంచారం చేస్తుంటాయి. అయితే జూలై ఆరో తేదీన కేతు గ్రహం పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి సంచారం చేయనుంది. దీని వలన మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. మరో మూడు రోజుల్లో మూడు రాశుల జీవితాల్లో కొత్త వెలుగులు చోటు చేసుకోనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

కుంభ రాశి : కుంభ రాశి వారికి కేతు సంచారంతో అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారంలో, వృత్తి ఉద్యోగాల్లో వీరికి కలిసి వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయం వీరిదే అవుతుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. అంతే కాకుండా ఈ రాశి వారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే అవసరానికి డబ్బు చేతికందుతుంది. చాలా ఆనందంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు.

వృషభ రాశి : వృషభ రాశి వారికి కేతు సంచారం అన్నింటా శుభ ఫలితాలను తీసుకొస్తుంది.ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గడంతో చాలా సంతోషంగా ఉంటారు. అంతే కాకుండా చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు, ఉద్యోగంలో చేరి చాలా సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

తుల రాశి : కేతు సంచారం తుల రాశి వారికి ఆదాయాన్ని తీసుకొస్తుంది. వీరికి వృత్తి, వ్యాపారాల్లో రాబడి దాదాపు రెట్టింపవుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. దీంతో కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారస్తులకు, రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి అద్భుతంగా ఉండబోతుంది. కొత్త కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి.

తుల రాశి : వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడం వలన అనేక లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మీ భవిష్యత్తుకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వైవాహికజీవితం అద్భుతంగా ఉంటుంది. భార్య భర్తల మధ్య మరింత బలపడే ఛాన్స్ ఉంది.



















