- Telugu News Photo Gallery Business photos Business Idea: Want to Start a Business Cooking from Home Here is a Smart Idea
Business Idea: తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే వ్యాపారం.. కాసులు కురిపించే బిజినెస్.. లక్షల్లో లాభం!
Business Idea: మీరు ఇలాంటి బిజినెస్‌ను ఇష్టపడితే ఇది మంచి లాభాలు తెచ్చి పెడుతుందని గుర్తించుకోవాలి. మీ వంట వ్యాపారం ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకుంటే మీకు తిరుగుండదు. ఈ వ్యాపారం ద్వారా మీరు పేరు సంపాదించడంతో పాటు భారీ లాభం కూడా సంపాదించవచ్చు..
Updated on: Jul 03, 2025 | 4:15 PM

మార్కెట్లో డబ్బు సంపాదించేందుకు రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే వ్యాపారాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందుకే చాలా మంది ఉద్యోగాలను వదిలి వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు అద్భుతమైన బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. మీరు ఈ వ్యాపారాన్ని చిన్న స్థాయిలో ప్రారంభించాలనుకుంటే కేవలం రూ.50,000 నుండి రూ.1,00,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ వ్యాపారాన్ని మధ్యస్థ స్థాయిలో ప్రారంభించాలని ఆలోచిస్తుంటే రూ.2 నుండి రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే మీరు ఈ వ్యాపారాన్ని పెద్ద స్థాయిలో ప్రారంభించాలనుకుంటే రూ.8 నుండి రూ.10 లక్షల వరకు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉండండి. ఈ వ్యాపారం ఫుడ్ క్యాటరింగ్.

మీరు చిన్న ఆర్డర్‌లపై నెలకు దాదాపు రూ.30,000 నుండి రూ.50,000 వరకు లాభాలు పొందవచ్చు. మధ్యస్థ స్థాయిలో ఈ ఆదాయం రూ.70,000 నుండి రూ.1.5 లక్షలకు చేరుకుంటుంది. పెద్ద ఆర్డర్‌లు, వివాహాలపై మీరు ఒకే ఆర్డర్ నుండి రూ.2 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈ వ్యాపారంలో లాభ మార్జిన్ మన నిర్వహణపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఈ వ్యాపారం 20% నుండి 40% వరకు లాభాన్ని ఇస్తుంది.

క్యాటరింగ్ వ్యాపారానికి అవసరమైన పత్రాలలో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, షాప్, ఎస్టాబ్లిష్‌మెంట్ లైసెన్స్, FSSAI లైసెన్స్, GST నంబర్ ఉన్నాయి. ఇక వంట చేయడానికి పెద్ద పాత్రలు, గ్యాస్ స్టవ్‌లు, నీటిని వేడి చేయడానికి ఒక యంత్రం, టేబుల్‌వేర్, ఆహారాన్ని వేడిగా ఉంచడానికి ఒక ప్రత్యేక కంటైనర్ అవసరం.

సిబ్బందికి మంచి చెఫ్, వెయిటర్లు, క్లీనింగ్ పర్సన్, డ్రైవర్ అవసరం. మార్కెటింగ్ కోసం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో ఒక పేజీని సృష్టించండి. ఆహారానికి సంబంధిచిన ఫోటోలను పోస్ట్ చేయండి. అలాగే మీ వ్యాపారం గురించి ఇతరులతో పంచుకోండి. దీనితో పాటు 'ఇన్‌ఫ్లుయెన్సర్స్'ద్వారా మీ క్యాటరింగ్ సర్వీస్‌ను ప్రసిద్ధి చెందేలా చేయండి.

మీరు కొత్తగా ఉంటే మొదట క్యాటరింగ్ సర్వీస్‌లో చేరి శిక్షణ పొందండి. ఆ తర్వాత చిన్న చిన్న క్యాటరింగ్ ఆర్డర్‌లు తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించండి. ఈ వ్యాపారం ద్వారా మీరు టిఫిన్ సర్వీస్‌ను కూడా ప్రారంభించవచ్చు.

క్యాటరింగ్ వ్యాపారంలో మీకు మార్గనిర్దేశం చేసే క్యాటరింగ్ సేవలకు సంబంధించిన అనేక వీడియోలు YouTubeలో ఉన్నాయి. వాటిని చూస్తే వ్యాపారం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఎల్లప్పుడూ పరిశుభ్రతను పాటించండి. మెనూను అప్‌డేట్ చేయండి. కస్టమర్ల నమ్మకాన్ని పొందడానికి అభిప్రాయాల ఆధారంగా మెరుగుదలలు చేయండి.

మీరు ఇలాంటి ఫుడ్ క్యాటరింగ్ బిజినెస్‌ను ఇష్టపడితే ఇది మంచి లాభాలు తెచ్చి పెడుతుందని గుర్తించుకోవాలి. మీ వంట వ్యాపారం ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకుంటే మీకు తిరుగుండదు. ఈ వ్యాపారం ద్వారా మీరు పేరు సంపాదించడంతో పాటు లాభం కూడా సంపాదించవచ్చు.



















