- Telugu News Photo Gallery Business photos IRCTC changed 7 rules related to ticket booking, know the new rules here
Indian Railways Rules: భారత రైల్వే మార్చిన 7 నియమాల గురించి మీకు తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!
Indian Railways Rules: ప్రయాణికులకు సేవలను సులభతరం చేయడానికి, పారదర్శకతను పెంచడానికి భారతీయ రైల్వేలు అనేక మార్పులు చేశాయి. ఈ మార్పులు జూలై 2025 నుండి అమలులోకి వచ్చాయి. రిజర్వేషన్ చార్టులను తయారు చేసే సమయం, దూరం ఆధారంగా టికెట్ ధర, తత్కాల్..
Updated on: Jul 04, 2025 | 3:34 PM

Indian Railways Rules: ప్రయాణికులకు సేవలను సులభతరం చేయడానికి, పారదర్శకతను పెంచడానికి భారతీయ రైల్వేలు అనేక మార్పులు చేశాయి. ఈ మార్పులు జూలై 2025 నుండి అమలులోకి వచ్చాయి. రిజర్వేషన్ చార్టులను తయారు చేసే సమయం, దూరం ఆధారంగా టికెట్ ధర, తత్కాల్ టిక్కెట్లకు అవసరమైన ఆధార్, ఓటీపీ ఆధారిత ధృవీకరణ మొదలైనవి ఈ మార్పులలో ఉన్నాయి. టిక్కెట్లకు సంబంధించి రైల్వేలు చేసిన మార్పుల తెలుసుకుందాం.


కౌంటర్లు, ఏజెంట్ల నుండి తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి OTP అవసరం. జూలై 15, 2025 నుండి కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్లు, రైల్వేల అధీకృత ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకున్న అన్ని తత్కాల్ టిక్కెట్లకు మరొక ధృవీకరణ అవసరం.

జూలై 1, 2025 నుండి అధికారం కలిగిన ఏజెంట్లు నిర్దిష్ట సమయాల్లో టిక్కెట్లు బుక్ చేసుకోకుండా నిషేధించింది రైల్వే. దీని వలన బుకింగ్‌లో సాధారణ ప్రయాణికులకు ప్రాధాన్యత లభిస్తుంది. ఏజెంట్లు ఉదయం 10:00 గంటల నుండి 10:30 గంటల వరకు AC తరగతి టిక్కెట్లను బుక్ చేసుకోలేరు. అదే సమయంలో ఏజెంట్లు ఉదయం 11 గంటల నుండి 11:30 గంటల వరకు ఏసీయేతర తరగతి టిక్కెట్లను బుక్ చేసుకోలేరు.

జూలై 1, 2025 నుండి అమలు చేసిన కొత్త ఛార్జీల విధానం వల్ల అనేక ప్రధాన, ప్రత్యేక రైళ్లు ప్రభావితమవుతాయి. ఇప్పుడు రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజస్, హమ్‌సఫర్, అమృత్ భారత్, మహామన, గతిమాన్, అంత్యోదయ, జన శతాబ్ది, యువ ఎక్స్‌ప్రెస్, ఎసి విస్టాడోమ్‌లలో ప్రయాణించడం ఖరీదైనదిగా మారవచ్చు. సాధారణ నాన్-సబర్బన్ సర్వీస్‌లో 500 కి.మీ కంటే ఎక్కువ దూరాలకు కూడా కొత్త ఛార్జీ వర్తిస్తుంది. కొత్త ఛార్జీలు వివిధ వర్గాల ప్రకారం నిర్ణయిస్తుంది రైల్వే.

రైల్వే బోర్డు ప్రకారం.. రైలు బయలుదేరడానికి 8 గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ తయారు అవుతుంది. గతంలో రిజర్వేషన్ చార్ట్‌ను రైలు బయలుదేరడానికి కేవలం నాలుగు గంటల ముందు తయారు చేసేవారు. కానీ ఇప్పుడు నిబంధనలు మారుస్తూ బయలుదేరడానికి 8 గంటలు ముందుగానే తయారు అవుతుంది.

2025 జూలై 1 నుండి రైలు ఛార్జీలలో మార్పులు జరిగాయి. సాధారణ నాన్-ఏసీ రైళ్ల ఛార్జీలు పెంచింది రైల్వే. సెకండ్ క్లాస్ ఛార్జీని కి.మీ.కు అర పైసా (0.5 పైసా) పెంచారు. కానీ ఇందులో కొన్ని షరతులు ఉన్నాయి. 500 కి.మీ వరకు ప్రయాణానికి ఎటువంటి పెరుగుదల ఉండదు. 501 నుండి 1,500 కి.మీ దూరానికి రూ.5 పెరుగుదల ఉంటుంది. 1501 నుండి 2,500 కి.మీ దూరానికి రూ.10 పెరుగుదల ఉంది. అదే సమయంలో ఈ పెరుగుదల 2501 నుండి 3,000 కి.మీ దూరానికి రూ.15.

ఫస్ట్ క్లాస్ ఏసీ రైలు ఛార్జీని కిలోమీటరుకు 0.5 పైసలు పెంచారు. సెకండ్ క్లాస్ ఛార్జీని కిలోమీటరుకు 1 పైసా పెంచారు. స్లీపర్ క్లాస్‌లో కిలోమీటరుకు 1 పైసా పెంచారు. అదేవిధంగా, ఫస్ట్ క్లాస్ ఛార్జీని కిలోమీటరుకు 1 పైసా పెంచారు. రైల్వే ఛార్జీలలో ఇటీవలి మార్పులలో రిజర్వేషన్ ఫీజు, సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జ్, ఇతర అదనపు ఫీజులలో ఎటువంటి మార్పు లేదు. ఈ ఛార్జీలన్నీ మునుపటిలాగే ఉంటాయి. ఇది కాకుండా ఇప్పటికే అమలులో ఉన్న నిబంధనల ప్రకారం టికెట్ ధరపై GST విధింపు ఉంటుంది. ఛార్జీల రౌండింగ్ సూత్రాలు కూడా మునుపటిలాగే ఉంటాయి.



















