- Telugu News Photo Gallery Spiritual photos Jupiter's Powerful Transit: Wealth and Prosperity for these zodiac signs for next 3 months
Zodiac Signs: మూడు నెలలు ‘గురు’ యోగాలు.. ఆ రాశులకు ధన, గృహ, సంతాన అనుగ్రహం
Jupiter's Powerful Transit: అత్యంత శుభ గ్రహమైన గురు గ్రహానికి జూలై, అక్టోబర్, నవంబర్ నెలల్లో విపరీతంగా బలం పెరుగుతోంది. జూలై 8 తర్వాత నుంచి రవి ప్రభావం నుంచి బయటపడడం వల్ల, అక్టోబర్, నవంబర్ నెలల్లో కర్కాటక రాశిలో ప్రవేశించి ఉచ్ఛపట్టడం వల్ల గురువు కొన్ని రాశుల వారికి ధన, గృహ, సంతతి వ్యవహారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అనుగ్రహించడం జరుగుతుంది. వృషభం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశుల వారు అందుకు తగ్గట్టుగా ఆదాయ వృద్ధికి, గృహ యోగానికి, సంతాన ప్రాప్తికి ప్రయత్నాలు సాగించడం మంచిది.
Updated on: Jul 04, 2025 | 11:20 AM

వృషభం: ఈ రాశివారికి ధన స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయం రెట్టింపయ్యే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా ఆదాయ ప్రయత్నాలన్నీ అంచనాలకు మించిన ఫలితాలనిస్తాయి. కుటుంబంలో పెళ్లి, గృహప్రవేశం వంటి శుభ కార్యాలు జరుగుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్ప కుండా విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపా రాలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తాయి. సంతాన యోగానికి తప్పకుండా అవకాశం ఉంది.

సింహం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న గురువు జూలైతో పాటు అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ రాశివారి ఆర్థిక పరిస్థితిని ఎన్నడూ లేని విధంగా మెరుగుపరిచే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలను ముమ్మరం చేయడం మంచిది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. కొందరు ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది.

కన్య: ఈ రాశికి ప్రస్తుతం దశమ, లాభ స్థానాల్లో సంచారం చేస్తున్న గురువు వల్ల ఏ పని తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. ఉద్యోగంలో జీత భత్యాలు, హోదాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. తప్పకుండా సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది.

తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న గురువు అక్టోబర్, నవంబర్ నెలల్లో ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ మూడు నెలల కాలంలో అనేక విధాలుగా రాజయోగాలు, భాగ్య యోగాలు కలుగుతాయి. తప్పకుండా గృహ, వాహన యోగాలు పడతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీత భత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. సంతాన యోగం కలుగుతుంది.

ధనుస్సు: ఈ రాశికి సప్తమంలో సంచారం చేస్తున్న గురువు రెండు నెలల పాటు కర్కాటక రాశిలో ఉచ్ఛ పట్టడం వల్ల ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవడం లేదా అటువంటి వ్యక్తితో ప్రేమలో పడడం జరుగు తుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగిపోతాయి. సంతాన యోగం కలుగుతుంది.

మీనం: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న గురువు ఆ తర్వాత ఉచ్ఛ స్థితికి వస్తున్నందు వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి తగిన ప్రయత్నాలు చేయడం వల్ల లాభం ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి చాలావరకు బయట పడడం జరుగుతుంది. గృహ, వాహన లాభాలు కలుగుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది.



