Mars Ketu Conjunction: సింహరాశిలో కుజుడు-కేతువు కలయిక.. ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, ఉద్రిక్తతలు పెరిగే అవకాశం..
యాభై ఐదు సంవత్సరాల తర్వాత కుజుడు-కేతువు సింహరాశిలో సంయోగం చెందనున్నారు. కన్యారాశిలోకి ప్రవేశించే ముందు కుజుడు కేతువుతో సమాన స్థాయిలో ఉండనున్నాడు. అదే సమయంలో శనిస్వరుడు తిరోగమనంలో కూడా ఉన్నాడు. దీంతో ఈ సంయోగం సమయంలో ప్రకృతి, మానవులపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఈ రోజు కుజుడు, కేతు సంయోగం వలన కలిగే ప్రభావం ఏమిటో తెలుసుకుందాం..

జాతకంలో గ్రహాల కదలికకు ముఖ్య స్థానం ఉంది. త్వరలో కుజుడు, కేతువు సింహరాశిలో సమన స్థాయిలో ఉండనున్నారు. ఇలా ఈ రెండు గ్రహాలు యాభై ఐదు సంవత్సరాలు తర్వాత సింహరాశిలో కలిసి ఉండనున్నాయి. సెప్టెంబర్ 1970లో ఈ రెండు గ్రహాలు సూర్య గ్రహం పాలించే సింహరాశిలో ఉన్నాయి. ఈ ఇద్దరి కలయిక సమయంలో కేతువు అంగారక గ్రహ అగ్నికి మరింత ఆజ్యం పోస్తాడు. కుజుడు దూకుడు స్వభావం పెరుగుతుంది. అ ప్రభావంతో ప్రజలు కూడా పరిణామాల గురించి ఆలోచించకుండా పనులు చేయడం ప్రారంభిస్తారు. హింసను చేయడనికి ప్రోత్సహించడానికి వెనుకాడని సమయం అవుతుంది. జూలై 24 నుంచి 30వ తేదీల మధ్య హింస, దాడులు, ప్రతిదాడులకు ప్రేరేపించడం, యుద్ధ పరిస్థితులు కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు కుజుడు-కేతువు సంయోగం ప్రభావం ఎలా ఉండనుందో తెలుసుకుందాం..
భావోద్వేగాల్లో హెచ్చు తగ్గులు: కుజుడు-కేతు గ్రహ సంయోగంపై చంద్రుని ప్రభావం ఉన్నప్పుడు.. దిశ లేదా ఉద్దేశ్యం లేకుండా ఆగ్రహం తెచ్చుకుంటారు. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారు. తాము చేసే పనుల వలన లేదా చర్య తర్వాత ఏమి జరుగుతుందో విచక్షణ నశించి.. తీవ్ర ఆందోళన పరిస్థితి ఏర్పడేలా చేస్తారు.
గందరగోళం: స్వార్థపూరిత సంకల్పం కేతువు గ్రహం సొంతం. అదే సమయంలో అంగారక గ్రహం ఆలోచనలు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకనే అకస్మాత్తుగా తలెత్తే ఆలోచనలతో భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. చేసే పనుల వలన కలిగే పరిణామాల గురించి ఆలోచించకుండానే.. మనిషికి అంగారక గ్రహం శక్తిని , సామర్థ్యాన్ని ఇస్తే.. కేతువు ఆ శక్తి సామర్ధ్యాలను ఎటువంటి ఉద్దేశ్యం లేదా లక్ష్యం లేకుండా ఉపయోగించుకునేలా చేస్తాడు.
చట్టపరమైన సమస్యలు: ఈ గ్రహ సంయోగం భూ వివాదాలను చట్టపరమైన సమస్యగా మారుస్తుంది. అందువల్ల భూమికి సంబంధించిన వివాదాలు ఉన్న భారతదేశం, పాకిస్తాన్ వంటి దేశాల మధ్య చట్టపరమైన సంఘర్షణలు తీవ్రమవుతాయి.
తిరోగమన శని ప్రభావం: మీనరాశిలో సంచరించే శని తిరోగమనంగా మారుతుంది. ఈ తిరోగమనంలో శనీశ్వర బలాన్ని పెంచుతుంది. కుంభరాశిలో సంచరించే సమయంలో శనీశ్వరుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. శత్రువులుగా చూసేవారు సైతం తమ సొంత ప్రయోజనం కోసం మనతో కలిసి రావడం కనిపిస్తుంది.
కుజుడు-రాహువు కోణం: రాహువు, కుజుడు ఒకరినొకరు దృష్టిలో ఉంచుకోవడం వలన రాహువు సూచించే వ్యక్తుల నుంచి దాడులు జరగవచ్చని చెప్పవచ్చు. సింహరాశిలో కుజుడు కుంభరాశిలో రాహువును చూస్తున్నాడు. ఇంకా కుజుడికి అదే ఫలితాన్ని ఇచ్చే కేతువు సింహరాశిలో కూడా ఉన్నందున.. జ్యోతిష్య అంచనాల ఆధారంగా దాడులు జరగవచ్చు. కనుక జాగ్రత్త అవసరం.
యుద్ధ సామగ్రి అమ్మకం: యుద్ధ పరిస్థితిని మరింత పెంచుతుంది, యుద్ధ సామగ్రి సరఫరా పెరుగుతుంది. తమ ఆయుధశాలల్లో ఇక ఆయుధాలు లేవని భావించి యుద్ధాన్ని కొనసాగించాల్సిన దేశాలకు యుద్ధ సామగ్రి సరఫరా చేయబడుతుంది.
సూర్యుని పాలన ప్రభావం: యుద్ధాన్ని సూచించే కుజుడు .. దానిని ప్రేరేపించే కేతువు రెండూ సూర్యుడు పాలించే సింహ రాశిలో కలవనున్నాయి. కనుక సూర్యుడు తన శక్తిని, ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి దాడులు, యుద్ధాలు, హింసకు ప్రేరేపించే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.