Friday Puja Tips: శుక్రవారం ఏ దేవుళ్ళను పూజించడం శుభప్రదం.. శుక్ర గ్రహ స్థానం బలపడాలంటే ఏమి చేయాలంటే..
సనాతన సంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. ఈ రోజున లక్ష్మీ దేవిని మాత్రమే కాదు నవ గ్రహాల్లోని శుక్రుడిని కూడా పూజిస్తారు. ఈ రోజున శుక్ర గ్రహాన్ని పూజించడం వలన కోరిన కోర్కెలు నేరవేరతాయని నమ్మకం. ఈ రోజు లక్ష్మీదేవి, శుక్రుడి పూజా ప్రాముఖ్యత ఏమిటి? అనుగ్రహం కోసం ఏమి చేయాలి? తెలుసుకుందాం..

వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవత ఆరాధనకు అంకితం చేయబడిందని హిందూ మతంలో ఒక నమ్మకం ఉంది. ఒక నిర్దిష్ట రోజున దేవతలను పూజించడం ద్వారా భక్తులకు ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. దీనితో పాటు వారంలోని ప్రతి రోజు ఏదో ఒక గ్రహానికి అంకితం చేయబడుతుంది. వీటిలో ఒకటి శుక్రవారం. ఇది చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. శుక్రవారం లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది. ఈ రోజున సంపద దేవత అయిన లక్ష్మీ దేవిని మాత్రమే కాడు సంతోషి మాత, శుక్రుడిని కూడా పూజిస్తారు. ఈ రోజున అమ్మవారిని పూజించడం, ఉపవాసం ఉండటం వలన భక్తుల జీవితంలో ఆనందాన్ని ఇస్తుందని నమ్ముతారు. అలాగే ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అటువంటి పరిస్థితిలో శుక్రవారం ఈ దేవతలను పూజించడం ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం..
శుక్రునికి ఉపవాసం శుక్రవారం శుక్ర గ్రహానికి అంకితం చేయబడింది. జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం ప్రేమ, అందం, వైభవం, భౌతిక సుఖాలకు కారకం. ఎవరి జాతకంలోనైనా శుక్ర దోషం ఉన్నా లేదా శుక్రుడి స్థానం బలహీనంగా ఉన్నా అతను శుక్రవారం ఉపవాసం ఉండాలని సలహా ఇస్తారు. ఈ ఉపవాసంలో తెల్లని బట్టలు ధరించడం, తెల్లని పువ్వులు సమర్పించడం, బియ్యం, చక్కెర, తెల్లని తీపి పదార్థాలను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. వరుసగా 21 లేదా 31 శుక్రవారాలు ఉపవాసం ఉండటం వల్ల శుక్ర గ్రహం బలపడుతుందని.. జీవితంలో ఆనందం, శాంతి లభిస్తుందని నమ్ముతారు.
సంతోషి మాతకు ఉపవాసం పురాణాల ప్రకారం సంతోషి మాతను గణేశుడి కుమార్తెగా భావిస్తారు. ఆమెను సంతృప్తి, సరళతకు దేవతగా పూజిస్తారు. జీవితంలో ఎప్పుడూ సమస్యలు ఉన్నవారికి లేదా ఎప్పుడూ ఆందోళన చెందేవారికి ఈ ఉపవాసం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. 16 శుక్రవారాలు సంతోషి మాత ఉపవాసం పాటించడం ఆచారం. ఈ ఉపవాసంలో పుల్లని పదార్థాలు తినడం నిషేధించబడింది. అమ్మవారికి బెల్లం , శనగలను నైవేద్యం పెడతారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్ల పక్షంలోని ఏదైనా శుక్రవారం నుంచి ఈ ఉపవాసాన్ని ప్రారంభించవచ్చు. ఉపవాసం చివరిలో ఉద్యాపనం చేయడం మర్చిపోవద్దు, లేకుంటే ఉపవాసం అసంపూర్ణంగా పరిగణింపబడుతోంది.
వైభవ లక్ష్మీ వ్రతం వైభవ లక్ష్మిని సంపద, ఆనందం, అదృష్టానికి దేవతగా భావిస్తారు. ముఖ్యంగా వివాహిత స్త్రీలు ఈ ఉపవాసాన్ని పాటిస్తారు. ఈ ఉపవాసం శుక్రవారం నుంచి మొదలు పెట్టి.. 11 లేదా 21 శుక్రవారాలు పాటిస్తారు. ఈ ఉపవాసంలో రోజుకు ఒకసారి మాత్రమే తినాలి. రాత్రి వైభవ లక్ష్మీ వ్రతం కథను చదువుతారు. ఉపవాసం ముగింపులో 7 మంది వివాహిత స్త్రీలు లేదా బాలికలను పిలిచి వారికి పాయసం ప్రసాదంగా అందించడం అవసరమని భావిస్తారు. అలాగే వారికి వైభవ లక్ష్మి వ్రత కథ పుస్తకాన్ని బహుమతిగా ఇస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.