ఇదెక్కడి ఆచారం మావ.! పెళ్లి కావాలంటే మగాళ్లు అలా చేయాల్సిందేనట.. ఎక్కడంటే
స్త్రీ, పురుషుల మధ్య పెళ్లి వేడుక మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అబ్బాయిల హృదయాన్ని అమ్మాయిలు గెలుచుకుని పెళ్లి చేసుకుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో అమ్మాయిల మనసు గెల్చుకుని అబ్బాయిలు పరిణయం చేసుకుంటారు. అయితే అబ్బాయిల హృదయాలను గెలుచుకోవడం చాలా ఈజీ. అయితే అమ్మాయిల హృదయాలను గెలుచుకోవడం అంత సులభం కాదు. అందువలన అమ్మాయిల దృష్టిని ఆకర్షించడానికి యుక్తవయస్సు చేరుకున్న అబ్బాయిలు రకరకాల సర్కస్ ఫీట్స్ చేస్తారు. అయితే ప్రపంచంలో ఒక తెగకు చెందిన పురుషులు.. మహిళల దృష్టిని ఆకర్షించడానికి ఒక ప్రత్యేక నృత్యం చేస్తారు. ఈ నృత్యం ఎప్పుడు ప్రదర్శించబడుతుంది? దీని ప్రత్యేకత ఏమిటి? ఆ తెగ ఎక్కడ ఉంటుందంటే..

కొంతమంది గిరిజన ప్రజలు జీవించే విధానం, వారి ఆచారాలను చూడటం నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ ఆటవిక జాతి ప్రజలు ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉంటూ.. తమ సొంత వింత ఆచారాలు, సాంప్రదాయలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తారు. అయితే ఒక అటవీ తెగ పురుషులు స్త్రీలను వివాహం చేసుకోవడానికి డ్యాన్స్ చేస్తారు. అవును వీరు గెరెవాల్ పండుగను జరుపుకుంటారు. ఈ పండగ సమయంలో ఈ తెగ పురుషులు ప్రత్యేకమైన యాకి నృత్యాన్ని చేస్తూ మహిళలను ఆకర్షిస్తారు.
అవును ఈ రకమైన వింత ఆచారం ఆఫ్రికన్ తెగలో వలనే ఉంటుంది. వుడాబే అనే ఆఫ్రికన్ తెగలో పురుషులు పెళ్లి కాని యువతుల మనసుని మాత్రమే కాదు వేరొకరి భార్య హృదయాన్ని కూడా దొంగిలిస్తారు. దీని కోసం సెప్టెంబర్ నెలలో ఒక భారీ పండుగను నిర్వహిస్తారు. ఈ తెగ ప్రజలు సంచార జాతులు. వివిధ ప్రదేశాలకు వలస వెళ్ళే ఈ తెగ ప్రజలు సెప్టెంబర్ నెలలో తమ అసలు స్థావరానికి లేదా ఇంటికి తిరిగి వస్తారు. ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళినా సరే సొంత ప్రదేశానికి చేరుకుంటారు.
గెరెవాల్ పండుగ అంటే ఏమిటి?
ఆఫ్రికన్ తెగ వొడాబే సెప్టెంబర్‌లో గెరెవాల్ అనే పండుగను జరుపుకుంటుంది. ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ యాకీ నృత్యం. ఈ నృత్యాన్ని ముఖ్యంగా ఈ తెగ పురుషులు ప్రదర్శిస్తారు. పురుషులు దీన్ని ప్రదర్శించడం వెనుక ఒక కారణం ఉంది. దాదాపు ఏడు రోజుల పాటు జరిగే ఈ పండుగ కూడా చాలా ప్రత్యేకమైనది. అయితే ఈ పండుగ ఎక్కడ జరుగుతుందో ఎవరికీ ముందుగా తెలియదు. ఈ విషయన్ని ఆ తెగ పెద్దలు రహస్యంగా ఉంచుతారు. ఈ పండుగ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు పండగ జరిగే ప్రదేశాన్ని ప్రకటిస్తారు.
నృత్యం వెనుక ఉన్న కారణం ఇదే.
గెరెవాల్ పండుగలో యాకి నృత్యం చాలా ముఖ్యమైనది. ఈ నృత్యం దాదాపు ఆరు గంటల పాటు ప్రదర్శించబడుతుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే పురుషులు మాత్రమే ఈ నృత్యం చేస్తారు. వివాహిత, పెళ్లికి ఎదిగిన బాలికలు పురుషులు చేసే ఈ నృత్యాన్ని చూడటానికి భారీగా చేరుకుంటారు. ఎందుకంటే ఈ యాకి నృత్యం చేస్తున్న పురుషులను చూడానికి మాత్రమే కాదు.. ఇలా పురుషులు డ్యాన్స్ చేస్తున్న సమయంలో.. అమ్మాయిలు తాము పెళ్లి చేసుకునేందుకు ఉత్తమంగా నృత్యం చేసే పురుషుడిని ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉంటారు. అందువల్ల పురుషులు తమ నృత్యం ద్వారా స్త్రీలను, బాలికలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. ఈ నృత్యం ముఖ్య ఉద్దేశ్యం స్త్రీలను ఆకట్టుకోవడమే. తద్వారా వారు తమకు నచ్చిన స్త్రీతో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈ తెగలో మరొక విశేషం ఏమిటంటే..పెళ్లి అయిన స్స్త్రీలు కూడా డ్యాన్స్ చేస్తున్న పురుషులలో తమకి నచ్చిన వారిని ఎంచుకునే స్వేచ్చని కలిగి ఉన్నారు. అలా వారితో కూడా కుటుంబాన్ని కలిగి ఉండే స్వేచ్ఛను కలిగి ఉంటారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..