Watch: నైట్ వాక్‌కు వచ్చిన సింహాలు.. హడలెత్తిన జనాలు.. వీడియో గుండె గుభేల్!
గుజరాత్ గిర్ అడవుల్లో సింహాల విహారానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. గిర్-సోమనాథ్ జిల్లాలోని కోడినార్ పట్టణానికి సమీపంలోని రాష్ట్ర రహదారిపై సావాజ్(సింహం) కుటుంబం తిరుగుతున్నట్లు కెమెరాకు చిక్కింది. 2 ఆడ సింహాలు.. 8 సింహం పిల్లలు హైవేపై తిరుగుతున్న దృశ్యం అందరినీ ఆకర్షిస్తోంది. గిర్ నేషనల్ పార్క్‌కు కిలోమీటర్ దూరంలో అర్థరాత్రి ఇలా వన్యప్రాణులు సంచరిస్తున్నాయి.

కొడినార్ దగ్గరున్న గ్రామాల్లో తరచూ ఇలా సింహాలు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు కొడినార్ పట్టణం దగ్గర కూడా మృగరాజుల సంచారం కలకలం రేకెత్తిస్తోంది. రోడ్డుపై ఇలా సింహాలను చూడగానే వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. రోనాజ్ రోడ్డులో ఎనిమిది సింహ పిల్లలు, రెండు సింహాలు తిరుగుతూ కనిపించాయి. దీన్ని చూసిన వాహనదారులు వెంటనే తమ కార్లు, బైక్ లను ఆపేశారు. స్థానికులు వెంటనే ఈ సంఘటనను తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై ఎటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ప్రజలు జాగ్రత్త వహించారు.యు యాత్రికులను ఎటువంటి అడ్డంకులు లేకుండా వెళ్ళడానికి అనుమతించారు.
వీడియో చూడండి..
ముఖ్యంగా సింహాలు రోజువారీ సంఘటనగా మారిన ప్రాంతాలలో, ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ విజ్ఞప్తి చేసింది. గిర్ పరిసర ప్రాంతాలలో సింహాలు తిరుగుతున్న దృశ్యాలు సర్వసాధారణం అవుతున్నాయి. ప్రకృతి ప్రేమికులకు, వన్యప్రాణుల ఔత్సాహికులకు గిర్ అనుభవం ప్రత్యేకమైన. అయితే భద్రతా జాగ్రత్తలు పాటించడం కూడా అంతే ముఖ్యం..!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..