ఇంట్లో డ్రై ఫ్రూట్ లడ్డూలు చేసుకోండి… సింపుల్ రెసిపీ మీ కోసం రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం
డ్రై ఫ్రూట్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ డ్రై ఫ్రూట్స్ ను వివిధ రకాలుగా తింటారు. అయితే వీటితో లడ్డులు చేసుకుని తినవచ్చు అని తెలుసా.. స్వీట్ షాప్ లో దొరికే రుచితో ఇంట్లోనే తయారు చేసుకుని తినవచ్చు. ఈ రోజు డ్రై ఫ్రూట్స్ లడ్డులను తయారు చేసుకోవడానికి సులభమైన రెసిపీని తెలుసుకుందాం. ఈ లడ్డూలను చక్కెర లేకుండా సహజ తీపితోనే తయారు చేసుకోవచ్చు. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. ఎముకలను బలోపేతం చేస్తాయి. ఈ లడ్డులు పిల్లలు, పెద్దలు ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటాయి.

భారతదేశంలో రకరకాల వంటకాలు తయారు చేస్తారు. కారంగా ఉండే ఆహార పదార్థాల నుంచి తీపి వంటకాల వరకు.. రకరకాల ఆహార పదార్ధాలు విందులో దర్శనం ఇస్తాయి. వీటిని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు మన శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. భారతీయ వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాల గురించి ఆయుర్వేదంలో కూడా ప్రస్తావించబడింది. అవి ఆహార రుచిని పెంచుతాయి. వంటగదిలో లభించే డ్రై ఫ్రూట్స్ కూడా ఆరోగ్యానికి ఒక వరం వంటివి. వీటిలో అనేక రకాల పోషకాలున్నాయి. చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తింటారు. మరికొందరు వీటిని ఉపయోగించి డెజర్ట్ , పులావ్ వంటి వాటిని కూడా తయారు చేస్తారు. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ తో పోషకాలను అందించే లడ్డులను కూడా తయారు చేసుకోవచ్చు. వీటి రుచి అద్భుతంగా ఉంటుంద. వీటిని భోజనం లేదా రాత్రి భోజనం తర్వాత తినవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్ లడ్డులను తయారు చేసే రెసిపీని గురించి తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్స్ తయారీకి కావలసిన పదార్థాలు
- ఖర్జూరం- ఒక కప్పు(గింజలు తీసినవి )
- జీడిపప్పు- అర కప్పు
- బాదం- అర కప్పు
- వాల్‌నట్స్- అర కప్పు
- పిస్తాపప్పులు-2 టేబుల్ స్పూన్లు
- ఎండుద్రాక్ష-2 టేబుల్ స్పూన్లు
- నెయ్యి- ఒ ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
- ఎండు కొబ్బరి తురుము- రెండు టేబుల్ స్పూన్లు
- యాలకుల పొడి – అర టీస్పూన్
డ్రై ఫ్రూట్ లడ్డు తయారీ విధానం:
- లడ్డులు తయారు చేయడానికి ముందుగా జీడిపప్పు, బాదం, వాల్‌నట్, పిస్తాపప్పులను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేదా మిక్సీ లో వేసి కొంచెం పలుకులు ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.
- దీని తరువాత ఎండుద్రాక్ష, ఖర్జూరాన్ని కట్ చేసుకోండి.
- ఇప్పుడు ఒక పాన్ తీసుకుని వేడి చేసిన తర్వాత కొంచెం నెయ్యి వేయండి.
- ఇప్పుడు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ని తక్కువ మంట మీద లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- దీని తరువాత వాతిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు దీని తరువాత అదే పాన్‌లో కొంచెం నెయ్యి వేసి, కట్ చేసుకున్న ఖర్జూరాలను వేసి ఖర్జూరాలు మెత్తబడే వరకు రెండు నిమిషాలు రోస్ట్ చేయండి. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్, ఎండుద్రాక్ష , యాలకుల పొడిని వేసి ఖర్జూర ముక్కల్లో కలిసే టట్లు బాగా కలపండి.
- దీని తర్వాత కొద్దిగా చల్లబరచండి.
- ఇప్పుడు మీ చేతులకు నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డులుగా తయారు చేసుకోండి.
- ఇలా చేసుకున్న లడ్డూలను ఓకే ప్లేట్ లో ఉన్న కొబ్బరి పొడిపై దోర్లించండి. ఈ లాడ్డులకు కొబ్బరి అంటుకున్న తర్వాత పిస్తా పప్పుతో అలంకరించండి. అంతే టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ.
ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు వల్ల కలిగే ప్రయోజనాలు
- వీటిని చక్కెర లేకుండానే సహజ తీపి పదార్ధాలతో తయారు చేసుకోవచ్చు.
- వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
- ఇవి పిల్లల. పెద్దల ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
- వీటిని తినడం వల్ల ఎముకలు బలపడతాయి.