AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రీల్స్ పిచ్చి.. ఏకంగా రన్నింగ్ ట్రైన్‌ను ఆపిన ఇంటర్ విద్యార్థులు.. కట్ చేస్తే

ఇద్దరూ ఇంటర్ చదువుతున్న విద్యార్థులు.. రీల్స్ కోసం వాళ్లు చేసిన పనికి.. ఓ ట్రైనే ఆగిపోయింది.. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకున్న వారి పనికిరాని పని.. బెడసికొట్టింది.. చివరకు ఇద్దర్నీ కటకటాల పాలు చేసింది.. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో కలకలం రేపింది.

రీల్స్ పిచ్చి.. ఏకంగా రన్నింగ్ ట్రైన్‌ను ఆపిన ఇంటర్ విద్యార్థులు.. కట్ చేస్తే
Kerala Students Stop Train For Reels
Shaik Madar Saheb
|

Updated on: Dec 25, 2025 | 7:16 PM

Share

ఇద్దరూ ఇంటర్ చదువుతున్న విద్యార్థులు.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం వాళ్లు చేసిన పనికి.. ఓ ట్రైనే ఆగిపోయింది.. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనుకున్న వారి పిచ్చి పని.. బెడసికొట్టి.. ఇద్దర్నీ కటకటాల పాలు చేసింది.. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో కలకలం రేపింది. కన్నూర్‌లో సినిమా రీల్స్ కోసం.. వెళుతున్న రైలును ఆపినందుకు ఇద్దరు ప్లస్ టూ విద్యార్థులను అరెస్టు చేశారు. ఎర్నాకుళం నుండి పూణేకు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఆపారు. గురువారం ఉదయం తలస్సేరి, మాహే మధ్య ఈ సంఘటన జరిగింది.

రైలు ట్రాక్ పై ఎర్రటి లైట్ వెలిగించడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. అది ప్రమాద సంకేతంగా భావించి రైలును ఆపారు. ఈ సమయంలో విద్యార్థులు రైల్వే ట్రాక్ దగ్గర రీల్స్ చిత్రీకరిస్తున్నారని.. ప్రమాద సంకేతమనుకుని.. పైలట్ ట్రైన్ ను ఆపారని.. పోలీసులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఈ సంఘటన తర్వాత, లోకో పైలట్ RPF, రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. దర్యాప్తు తర్వాత, ఇద్దరు ప్లస్ టూ విద్యార్థులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత వారిని బెయిల్‌పై విడుదల చేశారు. విద్యార్థులు చిత్రీకరించిన వీడియోను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..