RBI: ఇక 10 రూపాయల నోట్లు కనిపించవా..? ఆర్బీఐ అసలు ప్లాన్ ఇదే!
Reserve Bank of India: పది రూపాయల నోట్లకు బదులుగా రూ.10 నాణేలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఈ నాణేలు చెల్లవని గతం నుంచి చాలా సార్లు వదంతులు వచ్చాయి. ఈ నాణేలు చెల్లవని పుకార్లు రావడంతో చాలా మంది ఈ..

Reserve Bank of India: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి 10 రూపాయల నోట్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. చిన్న చిన్న అవసరాలకు ఈ పది రూపాయల నోట్ల ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కిరాణ కొట్టు, కూరగాయల షాపు, ఆటో, బస్సులు ఇలా ఒక్కటేమిటి చాలా అవసరాలకు 10 రూపాయల నోట్లు చాలా ఉపయోగపడుతున్నాయి. ఉదయం పాల నుంచి మార్కెట్లో కూరగాయలు, నిత్యావసరాల కొనుగోళ్లలో పది రూపాయల నోట్ల ప్రాధాన్యత మామూలుది కాదనే చెప్పాలి. అయితే రానున్న రోజుల్లో ఈ పది రూపాయల నోట్లు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే పది రూపాయల నోట్లకు బదులుగా రూ.10 నాణేలు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఈ నాణేలు చెల్లవని గతం నుంచి చాలా సార్లు వదంతులు వచ్చాయి. ఈ నాణేలు చెల్లవని పుకార్లు రావడంతో చాలా మంది ఈ పది రూపాయల నాణేలను తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో వాటి చెలామణిలో తీవ్ర ఇబ్బందలు వచ్చాయి. రూ.10 నాణెం తయారీ కంటే 10 నోట్ల ముద్రణ తక్కువ ఖర్చవుతున్నా వాటి జీవిత కాలం తక్కువగా ఉండటంతో నోట్ల ముద్రణను ఆర్‌బీఐ నిలిపివేసినట్లు సమాచారం. వేయి రూ.10 నోట్లు ముద్రించడానికి ఆర్‌బీఐకి 966(ప్రతీ నోటుకు 1.01 రూ) రూపాయలు ఖర్చవుతుండగా. 10 నాణెం తయారీకి 5.54 రూపాయలు ఖర్చు అవుతున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. నోట్ల ముద్రణకు ఖర్చు తక్కువ అవుతున్నప్పటికీ జీవితకాలం కూడా తక్కువగానే ఉంటుందట. అందుకే ఈ రూ.10 నోట్లు ఏడాదిలోపే శిథిలమవుతున్నాయట. కానీ ఈ పది రూపాయల నాణేలు మాత్రం జీవితకాలం పాడవకుండా ఉంటాయి.
ఇది కూడా చదవండి: Best Selling Bikes: మళ్లీ రికార్డ్.. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన బైక్ ఇదే.. టాప్ 10 జాబితా!
ఈ కారణంగా రిజర్వ్ బ్యాంకు కూడా (RBI) నోట్ల ముద్రణ కంటే నాణేల ముద్రణకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ 10 రూపాయల నాణేలు చెల్లవనే వదంతులపై కూడా ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. ఈ 10 రూపాయల నాణేలను తీసుకునేందుకు ఎవరైనా నిరాకరిస్తే వారిపై ఫిర్యాదు చేయవచ్చని, సంబంధిత అధికారుల ఫోన్ నంబర్లను సోషల్ మీడియా ద్వారా, బ్యాంకులలో కూడా ప్రదర్శించారు.
ఇది కూడా చదవండి: PM Kisan: కీలక అప్‌డేట్.. పీఎం కిసాన్ 22వ విడత ఎప్పుడో తెలుసా?
వందంతులకు గురైన పాత రూ.10 నాణాలతో పాటు, గత ఏడాది కొత్త రూ.10 నాణాలను కూడా ఆర్‌బీఐ విడుదల చేసింది. రూ.10 నోట్ల కొరత కారణంగా ప్రస్తుతం రూ.10 నాణాల పట్ల మార్కెట్లో తిరస్కరణ ఉండటం లేదని పలువురు అంటున్నారు. జనాల్లో అవగాహన రాడంతో ఇప్పుడు మార్కెట్లో ఈ నాణేలు చెల్లుబాటు అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Electric Splendor Bike: పాత స్ప్లెండర్‌ను ఎలక్ట్రిక్‌గా మార్చుకోండి.. కిట్ కేవలం రూ.35,000కే.. రేంజ్ ఎంతో తెలుసా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




