AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. రద్దు చేయకుండానే మీ ట్రైన్ టికెట్ రీషెడ్యూల్‌ చేసుకోండి!

Indian Railways: జనవరి 1 నుండి రైల్వే ప్రయాణికులకు కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇకపై మీ రైలు ప్రయాణం కోసం టికెట్స్‌ కన్ఫర్మ్‌ అయిన తర్వాత ప్రయాణం వాయిదా పడినట్లయితే, మీ టికెట్స్‌ను రద్దు చేసుకోకుండా, ఎలాంటి ఛార్జీలు లేకుండా కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది..

Indian Railways: ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. రద్దు చేయకుండానే మీ ట్రైన్ టికెట్ రీషెడ్యూల్‌ చేసుకోండి!
Indian Railways
Subhash Goud
|

Updated on: Dec 25, 2025 | 8:02 PM

Share

Indian Railways: రైల్వే ప్రయాణికులకు జనవరి 1వ తేదీ నుంచి ఒక ముఖ్యమైన శుభవార్త అందుబాటులోకి వచ్చింది. భారతీయ రైల్వే అమలు చేస్తున్న కొత్త నిబంధనల ప్రకారం, ప్రయాణం వాయిదా పడిన సందర్భాలలో కన్ఫర్మ్ అయిన ట్రైన్ టికెట్లను రద్దు చేయకుండానే వాటిని కొత్త తేదీకి రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పించారు. గతంలో ప్రయాణ తేదీ మారితే, పాత టికెట్‌ను రద్దు చేసుకుని, కొత్త టికెట్ బుక్ చేసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల క్యాన్సిలేషన్ ఛార్జీలు భరించాల్సి వచ్చేది.

ఈ కొత్త నిబంధన జనవరి 1వ తేదీ తర్వాత బుక్ చేసిన టికెట్లకు వర్తిస్తుంది. ప్రయాణికులు తమ జర్నీని పోస్ట్‌పోన్ చేయాల్సి వస్తే, వారు తమ టికెట్ బుక్ చేసుకున్న యాప్‌ను ఓపెన్ చేసి, టికెట్ వివరాలపై క్లిక్ చేయాలి. అక్కడ “రీషెడ్యూల్” అనే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, తమకు కావాల్సిన కొత్త తేదీని ఎంచుకోవాలి.

ఇది కూడా చదవండి: RBI: ఇక 10 రూపాయల నోట్లు కనిపించవా..? ఆర్బీఐ అసలు ప్లాన్‌ ఇదే!

ఇవి కూడా చదవండి

ఒకవేళ మీరు ఎంచుకున్న కొత్త తేదీలో అదే ట్రైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటే మీ టికెట్ ఎటువంటి అదనపు రుసుము లేకుండా ఉచితంగా రీషెడ్యూల్ అవుతుంది. అయితే, ఈ సౌకర్యం కన్ఫర్మ్డ్ టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది. RAC లేదా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్లకు రీషెడ్యూల్ చేసుకునే అవకాశం లేదు. ఇది రైల్వే ప్రయాణికులకు గణనీయమైన ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండిBest Selling Bikes: మళ్లీ రికార్డ్‌.. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన బైక్ ఇదే.. టాప్‌ 10 జాబితా!

ఇది కూడా చదవండి: PM Kisan: కీలక అప్‌డేట్‌.. పీఎం కిసాన్‌ 22వ విడత ఎప్పుడో తెలుసా?

ఇది కూడా చదవండి: Electric Splendor Bike: పాత స్ప్లెండర్‌ను ఎలక్ట్రిక్‌గా మార్చుకోండి.. కిట్‌ కేవలం రూ.35,000కే.. రేంజ్‌ ఎంతో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి