Chanakya Niti: ఈ 3 విషయాలను ఖచ్చితంగా గుర్తించుకోండి.. లేదంటే జీవితం నాశనమైనట్లే!

Chanakya Niti: మన జీవితంలో అనేక సమస్యలు చుట్టుముడతాయి. ప్రతీ దానికి ఓ పరిష్కారాన్ని కనిపెట్టాలి. చిన్న చిన్న సమస్యలే కదా అని నిర్లక్ష్యం చేస్తే..

Chanakya Niti: ఈ 3 విషయాలను ఖచ్చితంగా గుర్తించుకోండి.. లేదంటే జీవితం నాశనమైనట్లే!
Chanakya Niti
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 04, 2021 | 8:32 PM

మన జీవితంలో అనేక సమస్యలు చుట్టుముడతాయి. ప్రతీ దానికి ఓ పరిష్కారాన్ని కనిపెట్టాలి. చిన్న చిన్న సమస్యలే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. మున్ముందు తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సరిగ్గా ఇదే సూత్రాన్ని ఆచార్య చాణక్యుడు నమ్మారు. ఏ విషయాన్ని తక్కువ చేసి చూడకూడదు అని చెప్పారు. అజాగ్రత్త వ్యవహరించవద్దు అని సూచించారు. ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే పెద్ద నష్టాన్ని చూడాల్సి వస్తుందని అన్నారు.

ఆచార్య చాణక్యుడు గొప్ప మేధావి మాత్రమే కాదు.. రాజకీయవేత్త, దౌత్యవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త. ఆచార్య చాణక్యుడు చెప్పిన సూత్రాలు నేటి ప్రజలకు చాలా అవసరం. వాటిని పాటిస్తే.. ప్రజలు ఖచ్చితంగా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే ఆచార్య చాణక్యుడు.. తాను రచించిన నీతి శాస్త్రంలో.. మూడు విషయాల గురించి వివరించారు. వాటిని ఎప్పుడూ చిన్నవిగా భావించకూడదని.. లేకుంటే మొత్తం జీవితం నాశనం అవుతుందని చెప్పుకొచ్చారు. అవేంటో చూసేద్దాం పదండి.

1. రుణాలు పొందటం చాలా సులభం. కానీ వాటిని చెల్లించడమే కష్టం. మీరు లోన్ తీసుకున్నట్లయితే.. దాన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోవద్దు. తిరిగి చెల్లించడం చాలా కష్టతరం అవుతుంది. రోజురోజుకూ పెరుగుతూపోతుంది. ఒకవేళ ఇదే జరిగితే.. మనిషి నాశనానికి అది ఆరంభం అని చెప్పవచ్చు. కాబట్టి రుణం తీసుకోకుండానే పనులు అయిపోయేలా చూసుకోండి. లేదా మరేదైనా కారణం చేత రుణం తీసుకుంటే.. ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని.. వీలైనంత త్వరగా ఆ రుణాన్ని తిరిగి చెల్లించడానికి ప్రయత్నించండి.

2. మీ కంటే శత్రువు బలహీనంగా ఉన్నాడని.. ఎప్పుడూ భావించొద్దు. అలాంటి పొరపాటు చేయకండి. అతడు మీకన్నా బలహీనంగా ఉన్నప్పటికీ.. మీ శత్రువే.. అవకాశం దొరికినప్పుడల్లా మీపై దాడి చేస్తాడు. ఛాన్స్ మిస్ చేసుకోడు. అందుకే శత్రువు బలహీనంగా ఉన్నాడని భావించి.. సైలెంట్ కావొద్దు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి. శత్రువును ఓడించడానికి ప్రణాళికలు సిద్దం చేసుకోండి.

3. మన శరీరానికి అయ్యే చిన్న గాయాలే.. అప్పుడప్పుడూ ప్రమాదకరంగా మారుతున్నాయి. అందుకే తలనొప్పి వచ్చినా.. జలుబు చేసినా.. దేనిని లైట్ తీసుకోకూడదు. అది మన ప్రాణాల మీదకు రావొచ్చు. అజాగ్రత్తగా ఉండకూడదు. మొదటి నుంచే అప్రమత్తంగా ఉండండి. దానికి అవసరమయ్యే చికిత్స తీసుకోండి.

Read Also: ఒక్క వికెట్‌ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?

హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..