Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంటి ముంగిట ఈ 9 చెట్లను నాటితే ధన ప్రాప్తి కలుగుతుంది..!

uppula Raju

uppula Raju |

Updated on: Sep 02, 2021 | 5:33 PM

Vastu Tips: మన ఇంటి ఆవరణలో నాటిన చెట్లు, మొక్కలు, చల్లని నీడ, పండ్లు, పువ్వులు, ప్రాణవాయువును అందిస్తాయి. మన జీవితానికి కావలసిన వస్తువులతో పాటు

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంటి ముంగిట ఈ 9 చెట్లను నాటితే ధన ప్రాప్తి కలుగుతుంది..!
Plant

Vastu Tips: మన ఇంటి ఆవరణలో నాటిన చెట్లు, మొక్కలు, చల్లని నీడ, పండ్లు, పువ్వులు, ప్రాణవాయువును అందిస్తాయి. మన జీవితానికి కావలసిన వస్తువులతో పాటు మన అదృష్టాన్ని కూడా పెంచుతాయి. వాస్తు ప్రకారం కొన్ని చెట్లను మన ఇంటి లోపల నాటితే ఐశ్వర్యం పెరుగుతుంది. పవిత్రమైన చెట్లు, ఇంటి అందంతో పాటు ఐశ్వర్యాన్ని పెంచుతాయి. అయితే ఆ మొక్కలను ఏ దిశలో ఎక్కడ నాటాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తొమ్మిది రకాల మొక్కలు అదృష్టాన్ని పెంచుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

1. మామిడి – ఈ చెట్టు మానవుడికి అత్యంత అవసరం. దీని కలప, పండ్లు, విత్తనాలు, ఆకులు మానవుడికి అన్ని విధాలుగా ఉపయోగపడుతాయి. ఈ పవిత్రమైన చెట్టు ఇంటి నుంచి తూర్పు లేదా ఉత్తరం మధ్యలో ఉంటే శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. 2. నేరేడు – మధుమేహం, గుండె రోగులు నేరేడు పండును దివ్య ఔషధంగా భావిస్తారు. ఈ చెట్టును దక్షిణ లేదా నైరుతి మధ్యలో నాటితే శుభ ఫలితాలను ఇస్తుంది. 3. దానిమ్మ – ఇంటి బయట దానిమ్మ చెట్టును ఆగ్నేయ దిశలో నాటడం శ్రేయస్కరం. రక్త సంబంధిత రుగ్మతలను తొలగించడానికి దానిమ్మ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 4. చింతచెట్టు- వాస్తు ప్రకారం ఇంటి ఆగ్నేయ దిశలో చింతపండు మొక్కను నాటాలి. 5. బేల్ – బేల్ చెట్టును ఇంటి పశ్చిమ దిశలో నాటాలి. ఈ చెట్టు ఆకులు, పండ్లను ప్రత్యేకంగా శివుని పూజలో ఉపయోగిస్తారు. ఇది చాలా పవిత్రమైన చెట్టు. ఈ చెట్టు నీడ చాలా చల్లగా ప్రయోజనకరంగా ఉంటుంది. 6. ఉసిరి – ఉసిరి చెట్టును వాస్తు ప్రకారం ఈశాన్య మూలలో నాటాలి. 7. జాక్ ఫ్రూట్ – వాస్తు ప్రకారం ఇంటి లోపల పండ్ల చెట్టు నాటకూడదు. దానిని మీ ఇంటి బయట ఉత్తర లేదా తూర్పు దిశల మధ్య నాటితే మంచిది. 8. పీపాల్ – పీపాల్ చెట్టు దేవతల నివాసంగా భావిస్తారు. వాస్తు ప్రకారం ఈ చెట్టును ఇంటి నుంచి పడమర దిక్కున నాటడం శుభప్రదంగా భావిస్తారు. 9. మర్రి – ఈ చెట్టుకు హిందూ మతంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇది అన్ని రకాల కోరికలను నెరవేరుస్తుంది. వాస్తు ప్రకారం ఈ చెట్టు ఇంటి నుంచి తూర్పు దిశలో ఉండటం శుభప్రదంగా భావిస్తారు.

SBI Recruitment 2021: నిరుద్యోగులు అలర్ట్..! ఎస్బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఈ రోజే చివరితేదీ..

Pawan Kalyan Birthday: పవర్ స్టార్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన సూపర్ స్టార్.. అభిమానుల్లో ఆనందం

మీ కారు నీటిలో మునిగిపోతే.. వర్షపు నీటిలో దెబ్బతింటే ఇన్సూరెన్స్‌ వర్తిస్తుందా..! తెలుసుకోండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu