SBI Recruitment 2021: నిరుద్యోగులు అలర్ట్..! ఎస్బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఈ రోజే చివరితేదీ..

uppula Raju

uppula Raju |

Updated on: Sep 02, 2021 | 5:09 PM

SBI Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఎదురుచూసే నిరుద్యోగులకు చివరి అవకాశం. SBI SO రిక్రూట్‌మెంట్ దరఖాస్తు విండో ఈ రోజు మూసివేస్తారు.

SBI Recruitment 2021: నిరుద్యోగులు అలర్ట్..! ఎస్బీఐ స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఈ రోజే చివరితేదీ..
Sbi

SBI Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఎదురుచూసే నిరుద్యోగులకు చివరి అవకాశం. SBI SO రిక్రూట్‌మెంట్ దరఖాస్తు విండో ఈ రోజు మూసివేస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాలలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల కోసం నియామకాలు జరుపుతోంది. ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 69 పోస్టులు భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 13 నుంచి ప్రారంభమైంది. ఇందులో దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే చివరితేది. అభ్యర్థులకు రాత్రి వరకు సమయం ఉంది. దరఖాస్తు తేదీ ముగిసిన తర్వాత అధికారిక వెబ్‌సైట్ sbi.co.in నుంచి దరఖాస్తు ఫారం లింక్ తీసివేస్తారు. దరఖాస్తు చేయడానికి ముందు దయచేసి వెబ్‌సైట్‌లో ఉన్న అధికారిక నోటిఫికేషన్‌ని ఒక్కసారి పరిశీలించండి. డిప్యూటీ మేనేజర్ – 10 పోస్టులు, రిలేషన్‌ షిప్‌ – 06 పోస్టులు, ప్రొడక్ట్ మేనేజర్- 02 పోస్టులు, అసిస్టెంట్ మేనేజర్ – 50 పోస్టులు, సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ సలహాదారు – 01 పోస్ట్ భర్తీ చేస్తారు.

ఇలా అప్లై చేయండి 1. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్- sbi.co.in కి వెళ్లండి. 2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో ప్రస్తుత ఖాళీపై క్లిక్ చేయండి. 3. ఇప్పుడు SBI SCO రిక్రూట్‌మెంట్ 2021 లింక్‌కి వెళ్లండి. 4. ఇక్కడ అడిగిన వివరాలను నమోదు చేయండి. 5. రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ ఫారం నింపండి. 6. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, ప్రింట్ అవుట్ తీసుకోండి.

మీ కారు నీటిలో మునిగిపోతే.. వర్షపు నీటిలో దెబ్బతింటే ఇన్సూరెన్స్‌ వర్తిస్తుందా..! తెలుసుకోండి..

Shocking: బ్లడ్ బ్యాంక్, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. 8 నెలల చిన్నారికి హెచ్ఐవీ పాజిటివ్ రక్తం.. ఆపై

NPS: పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. రాబోయే రోజుల్లో వారి జీతం మరింత పెరిగే ఛాన్స్.. ఎలానో తెలుసుకోండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu