Pawan Kalyan Birthday: పవర్ స్టార్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన సూపర్ స్టార్.. అభిమానుల్లో ఆనందం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఆపేరులో వైబ్రేషన్ ఉంది.. ఆ కటౌట్‌కు అంతులేని క్రేజ్ ఉంది. పవర్ స్టార్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన

Pawan Kalyan Birthday: పవర్ స్టార్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన సూపర్ స్టార్.. అభిమానుల్లో ఆనందం
Mahesh Babu


Pawan Kalyan Birthday: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఆపేరులో వైబ్రేషన్ ఉంది.. ఆ కటౌట్‌కు అంతులేని క్రేజ్ ఉంది. పవర్ స్టార్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాములుగా హీరోలకు అభిమానులు ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్‌కు మాత్రం భక్తులుంటారు. అతడు ఆరడుగుల బుల్లెట్టు… పవర్‌కే ప్యాకెట్టు.. ఫాలోయింగ్‌లో ఎవరెస్టు… ! రికార్డుల పనిపట్టు.. ! మంచితనంతో చేయు కనికట్టు. అభిమానులకు అతడు బానిసైనట్టు…! ఇవి పవన్‌ గురించి ప్రతీ అభిమాని కాలర్‌ ఎగిరేసి మరీ చెప్పే మాటలు. ఇక తాజాగా పవన్ పుట్టిన రోజు సందార్భంగా అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.  పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇక పలువురు ప్రముఖులు కూడా పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నెట్టింట పవన్‌కు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పవర్ స్టార్‌కు సూపర్ స్టార్ బర్త్ డే విషెస్ తెలిపారు.Mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా పవర్ స్టార్‌కు స్పెషల్ బర్త్ డే విషెస్ అందజేశారు.’హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్! మీకు ఈ ఏడాది అద్భుతంగా ఉండాలని.. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని మహేష్ బాబు ట్వీట్ చేశాడు. మహేష్ బాబు ఇలా తమ హీరోకు విషెస్ చెప్పడంతో పవన్ అభిమానులు తెగ ఖుష్ అవుతున్నారు. అటు మహేష్ అభిమానులు, ఇటు పవన్ అభిమానులు ఈ ట్వీట్‌ను తెగ షేర్ చేస్తున్నారు. గతంలో పవన్ కరోనా బారిన పడినప్పుడు కూడా మహేష్ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఇక ఈ ఇద్దరు హీరోలకు ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఇప్పుడు మహేష్ పవన్ కు బర్త్ డే విషెస్ తెలుపడంతో.. మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తే బాగుంటుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు హరిహరవీరమల్లు చిత్రమూనిట్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ..రిలీజ్ ఎప్పుడంటే

Happy Birthday Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేర్, చైల్డ్‌హుడ్ ఫొటోస్.. మీరు ఓ లుక్ వేయండి..

Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష ఇంస్టాగ్రామ్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

 

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu