Pawan Kalyan Birthday: అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్.. పవన్ అభిమానులకు పూనకాలే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలనుంచి అదిరిపోయే అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమానుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు.

Pawan Kalyan Birthday: అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన హరీష్ శంకర్.. పవన్ అభిమానులకు పూనకాలే..
Follow us

|

Updated on: Sep 02, 2021 | 5:26 PM

#PSPK28: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలనుంచి అదిరిపోయే అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమానుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రానా కూడా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాతోపాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న  హరి హర వీరమల్లు సినిమానుంచి కూడా అప్డేట్ వచ్చింది. మొగలాయిలా కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. అలాగే సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు పవన్. ఈ మూవీ నుంచి కూడా అప్డేట్ వచ్చింది. ఇలా వరుస సర్‌ప్రైజ్‌లు అభిమానులను ఆనందంలో ముంచేస్తున్నాయి. తాజాగా మరో సినిమా అప్డేట్ కూడా వచ్చేసింది. పవన్‌తో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా నుంచి ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ తెలుపుతూ అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్‌లో బైక్ పై పవన్ స్టైల్‌గా కూర్చొని గన్ పట్టుకొని ఉన్నట్టుగా డిజైన్ చేశారు. పోస్టర్ వెనక ఇండియా గెట్‌ను చూపించారు. ఈ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోందని పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. మరో సారి పవన్‌తో హరీష్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.Pawan

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు హరిహరవీరమల్లు చిత్రమూనిట్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ..రిలీజ్ ఎప్పుడంటే

Happy Birthday Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేర్, చైల్డ్‌హుడ్ ఫొటోస్.. మీరు ఓ లుక్ వేయండి..

Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష ఇంస్టాగ్రామ్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ