AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఇలాంటి లక్షణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే ఆ కొంప కొల్లేరే అంటున్న ఆచార్య చాణక్య

ఆచార్య చాణక్యుడు తన నీతిలో కెరీర్, వ్యక్తిగత జీవితం, వైవాహిక జీవితం, ఆరోగ్యం గురించి ప్రజలకు అనేక ఉపయోగకరమైన చిట్కాలను ఇచ్చాడు. అటువంటి వాటిల్లో ఒకటి పెళ్ళికి సంబందించిన సూచనలు. పురుషులు తమ జీవితం నరకంగా మారకూడదు అని అనుకుంటే ఇలాంటి లక్షణాలున్న స్త్రీని పెళ్లి చేసుకోవద్దని నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. జీవితం నరకంగా మారకూడదనుకుంటే జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి.. ఎలాంటి స్త్రీలను పురుషులు వివాహం చేసుకోకూడదో ఈ రోజు తెలుసుకుందాం..

Chanakya Niti: ఇలాంటి లక్షణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే ఆ కొంప కొల్లేరే అంటున్న ఆచార్య చాణక్య
Acharya Chanakya
Surya Kala
|

Updated on: May 05, 2025 | 8:42 PM

Share

వివాహం అనేది నిండు నూరేళ్ళు దంపతులను కట్టి ఉంచే బంధం. జీవితంలో జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అతి ముఖ్యమైన విషయం. ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సరైన భాగస్వామిని ఎంచుకోవడంలో తడబడి జీవితంలో బాధపడ్డవారు చాలా మంది ఉన్నారు. కనుక జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. అదేవిధంగా, ఆచార్య చాణక్యుడు పురుషులు ఎలాంటి జీవిత భాగస్వామిని ఎంచుకోవాలి? ఎలాంటి స్త్రీలను పొరపాటున కూడా వివాహం చేసుకోకూడదు అనే విషయంపై కొన్ని సలహాలు ఇచ్చాడు. కనుక ఈ రోజు పురుషులు ఎలాంటి స్త్రీలను వివాహం చేసుకోకూడదో చూద్దాం.

ఇలాంటి స్త్రీలను పురుషులు ఎప్పుడూ వివాహం చేసుకోకూడదు:

చెడు కుటుంబ నేపధ్యం నుంచి వచ్చిన వారు: ఆచార్య చాణక్యుడి ప్రకారం పురుషులు ఎప్పుడూ చెడ్డ కుటుంబానికి చెందిన స్త్రీని వివాహం చేసుకోకూడదు. ఆమె అందంగా ఉన్నా డబ్బులున్నా సరే ఆమె కుటుంబం బాగా లేకుంటే అటివంటి యువతిని ఎప్పటికీ వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే దీని వల్ల మీరు తరువాత జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు.

తన కుటుంబాన్ని గౌరవించని స్త్రీ: తన కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను గౌరవించని స్త్రీని ఎప్పుడూ వివాహం చేసుకోకూడదని చాణక్యుడు చెప్పాడు. అలాంటి స్త్రీ కారణంగా కుటుంబం విచ్ఛిన్నమయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

చెడుగా ప్రవర్తించే స్త్రీ: ఒక స్త్రీ చూడటానికి చాలా అందంగా ఉన్నప్పటికీ.. ఆమె వైఖరి, ప్రవర్తన బాగా లేకపోతే మీరు అలాంటి స్త్రీని వివాహం చేసుకోకూడదు. ఆచార్య చాణక్యుడి ప్రకారం, అలాంటి స్త్రీ ఎప్పుడైనా తన భర్తను విడిచిపెట్టవచ్చు.

అబద్ధం చెప్పే స్త్రీ: అబద్ధం చెప్పడంలో నైపుణ్యం ఉన్న స్త్రీని ఎప్పుడూ వివాహం చేసుకోకూడదని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. అబద్ధాలు చెప్పే స్త్రీలు వివాహం తర్వాత కూడా భర్తపై తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా భర్త జీవితాన్ని నాశనం చేయవచ్చు. ఇది మాత్రమే కాదు అలాంటి స్త్రీలు తన భర్తని.. అతని తల్లిదండ్రుల నుంచి దూరం చేసేందుకు అబద్ధాలు చెప్పవచ్చు. కనుక అబద్ధం చెప్పే వ్యక్తిని ఎప్పుడూ వివాహం చేసుకోవద్దు అని చెప్పాడు ఆచార్య చాణక్య.

వ్యంగ్యంగా మాట్లాడే స్త్రీ: చాణక్యుడి ప్రకారం ఎప్పుడూ కఠినంగా, వ్యంగ్యంగా మాట్లాడే స్త్రీని వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే వివాహం తర్వాత కూడా అలాంటి స్త్రీ తన వ్యంగ్య మాటలతో తన భర్తని, అతని మొత్తం కుటుంబాన్ని అవమానించగలదు. అలాంటి భార్య వల్ల ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరిగే అవకాశం ఉంది.

అంతర్గత సౌందర్యం లేని స్త్రీ: చాణక్య నీతి ప్రకారం ఒక స్త్రీ బాహ్యంగా ఎంత అందంగా ఉన్నా.. ఆమెకు అంతర్గత సౌందర్యం లేకుంటే లేదా ఆమె ఆలోచనలు మంచివి కాకపోతే ఆమెను ఎప్పటికీ వివాహం చేసుకోకూడదు. అవును స్త్రీ శారీరక సౌందర్యానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ఒక స్త్రీ శారీరకంగా అందంగా ఉన్నప్పటికీ.. ఆమె మనస్సు స్వచ్ఛంగా లేకుంటే, ఆమె మనసు అహంకారంతో నిండి ఉంటే.. ఆమె తన భర్త ఇంటిని, అతని జీవితాన్ని నాశనం చేయగలదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి