Snake Dance: నాగిని సాంగ్‌కు ఓ రేంజ్‌లో డ్యాన్స్ చేస్తున్న పాము.. ఒక్క రోజులోనే రెండు కోట్ల వ్యూస్ సొంతం..
కెమెరాలో రికార్డయిన దృశ్యాలు అద్బుతంగా ఉంటాయి. అటువంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాయి. అయితే కొన్ని దృశ్యాలు చూస్తే ఇది నిజమేనా అనిపిస్తాయి. ఒకొక్కసారి మన కళ్ళను మనం నమ్మడం కష్టం అవుతుంది. తాజాగా ఒక పాము మొబైల్ ఫోన్ లోని నాగిని సాంగ్ ప్లే చేస్తుంటే డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తోంది.

చాలాసార్లు మనం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలను చూస్తాము. వాటిని చూసిన తర్వాత ఇవి నిజమేనా అనిపిస్తాయి. అంతేకాదు ఆశ్చర్యపరుస్తాయి. ఎందుకంటే మనం ఇంతకు ముందు ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదని కూడా కామెంట్ చేస్తారు కొందరు. అందుకే అలాంటి వీడియోలు ప్రజల ముందుకు వచ్చినప్పుడు.. వాటిని ఒకరితో ఒకరు విస్తృతంగా షేర్ చేస్తారు. ప్రస్తుతం ఒక పాముకి సంబంధించిన ఆశ్చర్యకరమైన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే.. నాగిని సాంగ్ కు పాము ఓ రేంజ్ లో నృత్యం చేసింది.
వేణువు శబ్దం విన్న తర్వాత పాములు నృత్యం చేయడం ప్రారంభిస్తాయని తరచుగా సినిమాల్లో చూసి ఉంటారు. అయితే నిజ జీవితంలో చాలా తక్కువ మంది మాత్రమే చూసి ఉంటారు. అయితే ప్రస్తుతం బీహార్ కు చెందిన ఒక బాలుడి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన ఫోన్‌లో నాగిన్ ట్యూన్ ప్లే చేయగా.. ఈ ట్యూన్ కి అనుగుణంగా పాము డ్యాన్స్ చేసింది. ఈ ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. కేవలం ఒక రోజులోనే ఈ వీడియోను 2 కోట్లకు పైగా వీక్షించారంటే ఈ వీడియో ఎలా నెటిజన్లను ఆకట్టుకుందో ఊహించవచ్చు.
వీడియోను ఇక్కడ చూడండి
ఫోన్‌లో నాగిన్ ట్యూన్ ప్లే అవ్వడం మొదలవ్వగానే పాము నేలపై పాకడం ప్రారంభించినట్లు వీడియోలో కనిపిస్తుంది. దీని తరువాత పాము వింతైన పనులు చేయడం ప్రారంభిస్తుంది. పాము నేల మీద పాకడానికి తన శరీరాన్ని వింతగా ఊపడం ప్రారంభించింది. కొని సార్లు పాము నోరుని కదిలించింది. కొన్ని సార్లు నేలపై దొర్లడం మొదలు పెట్టింది. మెలికలు తిరగడం మొదలు పెట్టింది. ఇలా పాము డ్యాన్స్ చేస్తున్న దృశ్యాం అక్కడ ఉన్నవారిని ఆకట్టుకుంది. అయితే నాగిని సాంగ్ కు పాము నిజంగా నాట్యం చేస్తుందా లేదా అది కేవలం యాదృచ్చికమా? అనేదానికి ఎవరి దగ్గరా సమాధానం లేదు.
ఈ వీడియోను వైరల్ టిటి అనే ఖాతా యూట్యూబ్‌లో షేర్ చేసింది. ఈ వార్త రాసే సమయానికి, వేలాది మంది దీనిని చూసి వ్యాఖ్యానిస్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత ఇప్పుడు ప్రజలు లైక్‌లు, వ్యూస్ కోసం ఇతర జీవులను కూడా వేధించడం ప్రారంభించినట్లు అనిపిస్తుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



