AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhagavad Gita on War: గీత ప్రకారం ఎప్పుడు, ఎలా యుద్ధం చేయాలి.. శిక్షిస్తారనే భయాన్ని ఎలా సృష్టించాలంటే..

శ్రీ కృష్ణ పరమాత్ముడు సమస్త మానవాళి కి అందించిన జ్ఞానం భగవద్గీత. న్యాయం-అన్యాయం , ధర్మం- అధర్మంల మధ్య తేడా.. అన్యాయాన్ని అంతం చేయడానికి యుద్ధం చేయాల్సిన ఎదురైనప్పుడు ఏ విధంగా ఆలోచించాలి. వాస్తవంగా శ్రీ కృష్ణుడు యుద్ధం వినాశకరమైనదిగా పేర్కొన్నాడు. అయితే అన్యాయాన్ని, అధర్మాన్ని అంతం చేసి న్యాయాన్ని రక్షించడానికి యుద్ధం అనివార్యం అయినప్పుడు కొన్ని పద్దతులను పాటించాలని పేర్కొన్నాడు. యుద్ధం ఎప్పుడు, ఎలా చేయాలో శ్రీకృష్ణుడు గీతంలో వివరంగా చెప్పాడు.

Bhagavad Gita on War: గీత ప్రకారం ఎప్పుడు, ఎలా యుద్ధం చేయాలి.. శిక్షిస్తారనే భయాన్ని ఎలా సృష్టించాలంటే..
Bhagavad Gita On WarImage Credit source: Iscon
Surya Kala
|

Updated on: May 05, 2025 | 5:20 PM

Share

ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్ చర్యను ప్రపంచవ్యాప్తంగా విమర్శిస్తున్నారు. అదే సమయంలో ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్తాన్‌కు గుణపాఠం నేర్పడానికి భారతదేశం రకరకాల చర్యలను తీసుకుంటూ పాకిస్తాన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే పాకిస్తాన్ తన కార్యకలాపాలను, రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేయడం ఆపకపోతే భవిష్యత్తులో భారతదేశం.. పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితి తలెత్తవచ్చని చెప్పడం తప్పు కాదు. అయితే యుద్ధం చేయాల్సి వస్తే.. ముందు ఎలా యుద్ధానికి సిద్ధం అవ్వాలి.. యుద్ధం తర్వాత ఆ దేశం పరిస్థితి గురించి భగవద్గీతలో చాలా విషయాలను చెప్పాడు శ్రీ కృష్ణుడు. భగవద్గీత ప్రకారం యుద్ధం ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం..

భగవద్గీతలో యుద్ధం గురించి ఏమి చెప్పాడంటే

యుద్ధం చేయాల్సిన పరిస్థితి తలెత్తితే మొదట విధ్వంసం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితిలోనైనా యుద్ధం మొదటి ఎంపిక కాదని శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు. అయితే యుద్ధం అనివార్యం అయితే మీరు ఏ లక్ష్యం కోసం పోరాడుతున్నారో.. దానిని సాధించడానికి సమయం పడుతుంది. అటువంటి పరిస్థితిలో యుద్ధం ప్రారంభం కంటే రోజు రోజుకీ వ్యర్థంగా అనిపిస్తుంది. కనుక యుద్ధం మొదలు పెట్టే ముందు మీరు చేసే యుద్ధం లక్ష్యం గురించి ఖచ్చితంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. యుద్ధానికి ముందు ఇతరుల ఆలోచనలకు ముఖ్య స్థానం ఉంది. అదే విధంగా యుద్ధం చేసే ముందు ఇరువర్గాల వారు పరస్పర సంభాషణలో అభిప్రాయాలను విశాల దృక్పథంతో వ్యక్తపరచడంతో పాటు.. ఒకోకరికొకరు ఇతరుల మాటలను కూడా వినాలి. రెండు పార్టీలు యుద్ధ పరిస్థితిని నివారించడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే శాంతి చర్చలు ఫలవంతం అవుతాయి.

గీత ప్రకారం ఎప్పుడు యుద్ధం చేయాలంటే

చర్చల ద్వారా సమస్య పరిష్కారం కానప్పుడు యుద్ధమే ఏకైక మార్గం అని శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. దీనితో పాటు వైరి జనంలో ప్రతి కణంలో అన్యాయం, అధర్మం, మోసం ఉన్నప్పుడు, పరిస్థితిని మార్చడానికి యుద్ధం అనివార్యం అవుతుంది. అన్ని యుద్ధాలలో న్యాయం అత్యున్నతమైనదిగా పరిగణించబడుతుంది. ప్రతి మానవునికి న్యాయం జరగడం యుద్ధం మొదటి లక్ష్యం కావాలి. న్యాయమైన యుద్ధాన్ని పవిత్ర యుద్ధం అని కూడా అంటారు.

ఇవి కూడా చదవండి

యుద్ధానికి ముందు పరిస్థితి, శత్రువులు బలం, సొంతం బలం గురించి పూర్తి జ్ఞానం కలిగి ఉండటం ముఖ్యం.

భగవద్గీత ప్రకారం యుద్ధం చేసే ముందు ఒక యోధుడికి యుద్ధ పరిస్థితి, శత్రువు, తన సొంత శక్తుల గురించి పూర్తి జ్ఞానం కలిగి ఉండటం చాలా ముఖ్యం. సగం జ్ఞానం ఎల్లప్పుడూ ప్రమాదకరం. ఉదాహరణకు, అభిమన్యునికి చక్రవ్యూహం గురించి అసంపూర్ణ జ్ఞానం మాత్రమే ఉంది. అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించడానికి ఇదే కారణం. అయితే ఆ చక్ర వ్యూహం నుంచి బయటపడలేకపోయాడు. శత్రు పక్షం కౌరవులు దీనిని సద్వినియోగం చేసుకున్నారు. అభిమన్యుడు ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు అయినప్పటికీ గెలవలేకపోయాడు.

యుద్ధాన్ని నివారించే శిక్ష భయం

గీతలో అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉండి.. ఎటువంటి నిరసన వ్యక్తం చేయకపోతే అన్యాయం చేసే వ్యక్తులకు ధైర్యం పెరుగుతుందని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. ఇది అన్యాయాన్ని పెంచుతుంది. కనుక తప్పు, అన్యాయం చేసే వ్యక్తి హృదయంలో శిక్షిస్తారనే భయం ఎల్లప్పుడూ ఉంచాలని శ్రీ కృష్ణుడు చెప్పాడు. యుద్ధం వచ్చే పరిస్థితిని నివారించడానికి.. శత్రువులలో శిక్షిస్తారనే భయాన్ని సృష్టించడం చాలా ముఖ్యం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.