AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: మీ ఇంట్లో సానుకూలతతో పాటు గాలిని శుభ్రం చేసే మొక్కలు ఇవే.. ఏ దిశలో పెంచాలంటే..

ఇంటి నిర్మాణంలో కాదు ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు శాస్త్రం కొన్ని నియమాలను పేర్కొంది. అంతేకాదు ఇంటిలోపల ఆవరణలో పెంచుకునే మొక్కల విషయంలో కూడా నియమ నిబంధనలున్నాయి. ఈ రోజు ఇంటి లోపల అందాన్ని పెంచి ఇంటికి అదృష్టాన్ని, సానుకూలతను కొన్ని ఇండోర్ మొక్కలున్నాయి. ఈ రోజు ఆ మొక్కలు ఏమిటో తెలుసుకుందాం..

Vastu Tips: మీ ఇంట్లో సానుకూలతతో పాటు గాలిని శుభ్రం చేసే మొక్కలు ఇవే.. ఏ దిశలో పెంచాలంటే..
Vastu Tips For Plants
Surya Kala
|

Updated on: May 05, 2025 | 6:44 PM

Share

ప్రతి ఒక్కరూ తమ ఇల్లు అందంగా, సానుకూలంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి ఇంటిని అందంగా అలంకరిచే విషయానికి వస్తే మొక్కలు అందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ప్రకృతితో అనుసంధానం కావడంతో పాటు అదృష్టాన్ని ఆకర్షించడం వరకు మొక్కలు ఎన్నో చేస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మాత్రమే కాదు ఫెంగ్ షుయ్, జ్యోతిషశాస్త్రం, పురాణ గ్రంథాలలో కూడా వాటి ప్రాముఖ్యత ప్రస్తావించబడింది. కనుక మీ అదృష్టాన్ని ప్రకాశవంతం చేసే శక్తి ఉన్న మొక్కలు ఏమిటో తెలుసుకుందాం.

తులసి మొక్క:

భారతదేశంలో తులసి మొక్కకు విశిష్ట స్థానం ఉంది. ఆధ్యాత్మిక ఔషద గుణాలున్న తులసి మొక్క స్వచ్ఛతకు చిహ్నం. శతాబ్దాలుగా తులసి మొక్క దీని ఔషధ గుణాలతో పాటు మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. వాస్తు ప్రకారం తులసిని ఈశాన్య దిశలో ఉంచడం చాలా శుభప్రదం, ఇది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది.

మనీ ప్లాంట్:

మనీ ప్లాంట్ శ్రేయస్సు, సానుకూల ప్రవాహాన్ని తెచ్చే ఉత్తమమైన మొక్క. పేరుకి తగినట్లుగా మనీ ప్లాంట్ సంపద, స్థిరత్వాన్ని ఆకర్షించేలా చేస్తుంది. ఇంటి లోపల ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతుంది . మానసిక ప్రశాంతతను ఇస్తుంది. దీన్ని ఆగ్నేయ మూలలో ఉంచడం మంచిది.

ఇవి కూడా చదవండి

స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్ ప్రతికూల శక్తిని గ్రహిస్తుందని అంటారు. ఫెంగ్ షుయ్, వాస్తు రెండింటిలోనూ దీనిని ‘షీల్డ్’ మొక్కగా పరిగణిస్తారు, ఇది ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. ఈ మొక్క ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర లేదా మూలలో పెంచుకునేందుకు అనువైనదిగా పరిగణించబడుతుంది. దక్షిణ లేదా ఆగ్నేయ దిశలో ఉంచడం ఉత్తమం.

జాడే మొక్క

జాడే మొక్క గుండ్రని ఆకులు నాణేల వలె కనిపిస్తాయి. దీని ఆకుల మాదిరిగానే ఇది డబ్బును ఆకర్షించే మొక్కగా పరిగణించబడుతుంది. ఇది వృద్ధి, అదృష్టం, శుభ సమయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. జాడే మొక్క సంపద , అదృష్టంతో ముడిపడి ఉంది. ఈ సందర్భాన్ని ఆహ్వానించడానికి దీనిని ప్రవేశ ద్వారం దగ్గర పెట్టుకోవాలి.

పీస్ లిల్లీ

పీస్ లిల్లీ దీని పేరుకు తగ్గట్టే ఉంటుంది. ఇది భావోద్వేగ సమతుల్యత, శాంతికి ప్రసిద్ధి చెందిన మొక్క. ఎక్కువ రణగొణధ్వనుల వాతావరణం ఉన్న ఇళ్లలో పెంచుకునేందుకు ఈ మొక్క సరైన ఎంపిక. ఈ ఇండోర్ ప్లాంట్ విష పదార్థాలను ఫిల్టర్ చేస్తుంది. దీన్ని పెంచుకోవడం వల్ల సంబంధాలలో సామరస్యం వస్తుంది. దీన్ని లివింగ్ రూమ్ లేదా బెడ్ రూమ్ లో ఉంచడం ఉత్తమమని భావిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.