AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unique Lovestory: 20 ఏళ్ల యువకుడిని ప్రేమించిన 9 మంది పిల్లల తల్లి.. ప్రియుడి కోసం ఇంట్లోనుంచి జంప్.. పోలీస్ స్టేషన్ కి చేరుకున్న వింత ప్రేమ కహానీ

తొమ్మిది మంది పిల్లలు, మనవలు, మనవరాళ్ళతో సంతోషంగా గడపాల్సిన ఓ బామ్మ 20 ఏళ్ల యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న బామ్మ.. కోడలకు పట్టుబడింది. దీంతో ఆ మహిళ తన ఫ్యామిలీ విడిచిపెట్టి ప్రేమికుడితో కలిసి జీవించడానికి నిర్ణయించుకుంది. సినిమా స్టోరీకి మించిన ట్విస్ట్ ఉన్న ఈ బామ్మ ప్రేమ కథ ఉత్తర్ ప్రదేశ్ లోని షాజహాన్‌పూర్‌లో చోటు చేసుకుంది.

Unique Lovestory: 20 ఏళ్ల యువకుడిని ప్రేమించిన 9 మంది పిల్లల తల్లి.. ప్రియుడి కోసం ఇంట్లోనుంచి జంప్.. పోలీస్ స్టేషన్ కి చేరుకున్న వింత ప్రేమ కహానీ
Unique Love Story 1
Surya Kala
|

Updated on: May 05, 2025 | 4:08 PM

Share

ప్రేమకు అందం, వయసు, ఆస్తి వంటి వాటితో పనిలేదని చెబుతారు. ఎవరైనా ఎవరితోనైనా ప్రేమలో పడవచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్లో జరిగిన ఓ వింత ప్రేమకు సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మధ్య వయస్కురాలైన స్త్రీ 20 ఏళ్ల అబ్బాయిని ప్రేమించింది. ఆ మహిళకు 9 మంది పిల్లల్లో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వివాహం చేసుకున్నారు. ఆమె కుమార్తెలలో ఒకరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కోడలు తన అత్త ప్రవర్తనలో తేడా గురించి.. ఆమె ఇంట్లో ఆ విషయం తెలియజేసింది. కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో ప్రేమికుడి కోసం ఇంటి నుంచి పారిపోయింది. ఇప్పుడు ఆమె తన భర్త, పిల్లల వద్దకు తిరిగి వెళ్లాలని అనుకోవడం లేదు. తాను ప్రేమించిన 20 ఏళ్ల ప్రియుడితో కలిసి జీవించాలనుకుంటుంది.

అయితే ప్రేమికుడి వయస్సు ఆ స్త్రీ పెద్ద కొడుకు వయస్సు కంటే తక్కువ. అతను వృత్తిరీత్యా మెహందీ కళాకారుడిగా పనిచేస్తున్నాడు. ఆ యువకుడు మే 6న వివాహం కూడా చేసుకోబోతున్నాడు. అయితే యువకుడి పెళ్లికి ముందే.. ఆ యువకుడి ప్రియురాలు.. అమ్మమ్మ వయసున్న ఈ మహిళ ఒక కొత్త సమస్యను సృష్టించింది. ఆ మహిళ మొండితనం ఆమె కుటుంబాన్ని, గ్రామస్తులను, చివరికి ఆమె ప్రేమికుడిని కూడా కలవరపెట్టింది. ఈ సంబంధాన్ని వ్యతిరేకిస్తే వారి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని కూడా ఆ మహిళ బెదిరిస్తోంది.

ఈ వింత ఘటన షాజహాన్‌పూర్‌లోని జలాలాబాద్ తహసీల్ ప్రాంతంలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. నివేదికల ప్రకారం తొమ్మిది మంది పిల్లల తల్లి మెహందీ వేసుకునే 20 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. ఆ మహిళ ఇప్పుడు తన ప్రేమికుడితో కలిసి జీవించాలని పట్టుదలతో ఉంది. ఆ మహిళ వారం క్రితం తన ప్రేమికుడి ఇంటికి చేరుకుంది. బామ్మ కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఈ విషయం ఫోన్ చేసి యువకుడి సభ్యులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

పోలీసుల ముందే యువకుడి ఇంటి దగ్గర హై వోల్టేజ్ డ్రామా జరిగిందని చెబుతున్నారు. ఆ మహిళకు వివాహమైందని, ఆమెకు పిల్లలు ఉన్నారు. కుమారుల్లో ఒకరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ మహిళ ప్రేమిస్తున్నట్లు చెబుతున్న యువకుడి వివాహం కూడా నిశ్చయమైంది. అతని వివాహ వేడుక మే 6న జరగనుంది. ఆ యువకుడు ఆ మహిళ ఇంటికి పొరుగున ఉన్న గ్రామంలో నివసిస్తున్నాడు. మెహందీ వేసుకునే ఈ యువకుడు ఆ మహిళ గ్రామానికి తరచుగా వచ్చేవాడు. అప్పుడు వీరిద్దరి మధ్య సంబంధం ఏర్పడింది.

Unique Love Story

Unique Love Story

ఇంటిని విడిచి ప్రేమికుడి వద్దకు పారిపోయిన మహిళ

ఆ మహిళ భర్త ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు. ఒక రోజు తాను, తన కోడలు.. తన భార్యను ఆ యువకుడితో అభ్యంతరకరమైన పరిస్థితిలో ఉండగా చూశామని ఆయన చెప్పారు. వీరి అక్రమ సంబంధానికి అభ్యంతరం చెప్పారు. అయినా ఆ మహిళ, ఆమె ప్రేమికుడి మధ్య సంబంధం కొనసాగింది. ఇద్దరూ తరచుగా కలిసి బహిరంగంగా తిరగడం ప్రారంభించారు. ఆ మహిళ భర్త , కుమారుడు దీని పట్ల కఠినంగా వ్యవహరించడంతో, ఏప్రిల్ 29న ఆ మహిళ తన ఇద్దరు చిన్న పిల్లలతో పాటు తన ప్రేమికుడితో వెళ్లిపోయింది.

ప్రేమికుడికి కూడా ఇబ్బంది

ప్రియుడి కోసం వెళ్ళిపోయిన స్త్రీకి ఎంతో నచ్చ చెప్పిన తర్వాత తన ప్రేమికుడితో కలిసి గ్రామానికి తిరిగి వచ్చింది. అయితే ఇంట్లో ఉండటానికి నిరాకరించింది. దీని తరువాత ఈ విషయం పోలీసుల వద్దకు చేరింది ఈ పంచాయితీ. అందరూ ఆ స్త్రీని ఒప్పించడానికి ప్రయత్నించారు కానీ ఆమె అంగీకరించలేదు. ఆ స్త్రీ మొండితనం వల్ల ప్రేమికుడు కూడా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. అతను తన పని మీద బరేలీకి వెళ్ళానని చెప్పాడు. ఆ స్త్రీ కూడా అక్కడికి చేరుకుంది. ఆ మహిళ తనను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి గ్రామానికి తీసుకువచ్చిందని ప్రేమికుడు చెప్పాడు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..