AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohini Ekadashi: జీవితంలో సుఖ సంతోషాల కోసం మోహిని ఏకాదశి రోజున విష్ణువుకి ఈ పరిహారాలు చేయండి..

ఏకాదశి తిధికి హిందూ మతంలో చాలా పవిత్రమైన తిధి. విష్ణువుకి అంకితం చేయబడిన ప్రతి ఏకాదశి తిధికి ఒకొక్క విశిష్టత ఉంది. అదే విధంగా వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశిని మోహినీ ఏకాదశి అని అంటారు. ఈ రోజున విష్ణువు అవతారమైన "మోహిని" దేవిని పుజిస్తారు. ఈ రోజు చేసే ఉపవాసం ఆనందం శ్రేయస్సు కి మాత్రమే కాదు మోక్షాన్ని కూడా ఇస్తుందని నమ్మకం.

Mohini Ekadashi: జీవితంలో సుఖ సంతోషాల కోసం మోహిని ఏకాదశి రోజున విష్ణువుకి ఈ పరిహారాలు చేయండి..
Mohini Ekadashi
Surya Kala
|

Updated on: May 05, 2025 | 3:07 PM

Share

వైశాఖ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని మోహినీ ఏకాదశిగా జరుపుకుంటారు. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున విష్ణువు మోహిని రూపాన్ని దాల్చి దేవతలకు అమృతాన్ని ప్రసాదించాడు. ఈ ఏకాదశి చాలా శుభప్రదమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండి, ఆచారాల ప్రకారం విష్ణువును పూజించడంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మోహినీ ఏకాదశి రోజున విష్ణువుకు ఇష్టమైన వస్తువులను సమర్పించడం ద్వారా భక్తుల అదృష్టం ప్రకాశిస్తుందని .. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం.

2025 మోహిని ఏకాదశి తిథి పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్ల పక్ష ఏకాదశి తిధి మే 7న ఉదయం 10:19 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మర్నాడు మే 8న మధ్యాహ్నం 12:29 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిధి ప్రకారం మోహిని ఏకాదశి ఉపవాసం మే 8న జరుపుకోనున్నారు.

మోహిని ఏకాదశి రోజున విష్ణువు ఏ వస్తువులను సమర్పించాలంటే

తులసి దళాలు తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది. ఏదైనా నైవేద్యం సమర్పిస్తుంటే తులసి దళాలను చేర్చడం తప్పనిసరి అని భావిస్తారు. తులసి లేకుండా విష్ణువు ఏ నైవేద్యాన్ని స్వీకరించడని నమ్ముతారు. మోహిని ఏకాదశి రోజున విష్ణువుకు తులసి దళాలు సమర్పించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరిగి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

పసుపు రంగు విష్ణువుకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం. కనుక మోహిని ఏకాదశి రోజున అరటిపండు, మామిడి లేదా పసుపు రంగు స్వీట్లు వంటి పసుపు రంగు పండ్లు, పసుపు రంగు ఆహారాన్ని సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. పసుపు రంగు శ్రేయస్సు , శుభాన్ని సూచిస్తుంది. వీటిని సమర్పించడం వలన విష్ణువు సంతోషపడతాడని నమ్మకం.

వెన్న, పటికబెల్లం విష్ణువుకు వెన్న , పటికబెల్లం నైవేద్యం పెట్టడం చాలా ఇష్టం. బాల గోపాలుడి రూపంలో ఆయన ఆరాధనలో ఈ నైవేద్యానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మోహిని ఏకాదశి రోజున వెన్న, చక్కెర మిఠాయిని నైవేద్యం పెట్టడం వల్ల జీవితంలో మాధుర్యం వస్తుంది. సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది.

బియ్యం పాయసం బియ్యం, పాలు, చక్కెరతో తయారు చేసిన పాయసం విష్ణువుకు ఇష్టమైన నైవేద్యాలలో ఒకటి. మోహిని ఏకాదశి రోజున పాయసాన్ని సమర్పించడం ద్వారా ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి.

పండ్లు విష్ణువుకు కాలానుగుణ పండ్లను సమర్పించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. విశ్వాసం, లభ్యత ప్రకారం మామిడి, అరటిపండు, పుచ్చకాయ లేదా సీతాఫలం వంటి ఏదైనా సీజనల్ పండ్లను నైవేద్యంలో చేర్చవచ్చు. పండ్లు నైవేద్యం పెట్టడం వల్ల జీవితంలో సానుకూలత, తాజాదనం వస్తుంది.

మోహినీ ఏకాదశి రోజున అన్నదానం ప్రాముఖ్యత

మోహిని ఏకాదశి రోజున విష్ణువుకు ఇష్టమైన వస్తువులను సమర్పించడం వల్ల ఆయన ఆశీర్వాదం లభించడమే కాకుండా జీవితంలోని అడ్డంకులు కూడా తొలగిపోతాయి. ఈ రోజు చేసే పూజ ఉపవాసం ఆత్మ శుద్ధి, ఆధ్యాత్మిక పురోగతికి కూడా ముఖ్యమైనది. నమ్మకం ప్రకారం విష్ణువును నిర్మలమైన హృదయంతో పూజించి, ఆయనకు ఇష్టమైన ఆహారాన్ని అందించడం ద్వారా ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు. జీవితంలో అదృష్టం, ఆరోగ్యం, సంపదను పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

ఈ కూరల్లో పొరపాటున కూడా టమాటా వేయకండి.. అసలు విషయం తెలిస్తే షాకే.
ఈ కూరల్లో పొరపాటున కూడా టమాటా వేయకండి.. అసలు విషయం తెలిస్తే షాకే.
దివ్యౌషధం వంటింట్లోనే ఉంటుంది కానీ.. ఎవ్వరూ పట్టించుకోరు..
దివ్యౌషధం వంటింట్లోనే ఉంటుంది కానీ.. ఎవ్వరూ పట్టించుకోరు..
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.!
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.!
భగ్గుమంటున్న బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
భగ్గుమంటున్న బంగారం,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
వీరు ఒకట్రెండు శుభవార్తలు వినే ఛాన్స్..
వీరు ఒకట్రెండు శుభవార్తలు వినే ఛాన్స్..
జింగ్ జింగ్ అమేజింగ్.. చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని ప్రయోజనాలా
జింగ్ జింగ్ అమేజింగ్.. చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని ప్రయోజనాలా
సరికొత్త చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’, ‘లక్కీ భాస్కర్’!
సరికొత్త చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’, ‘లక్కీ భాస్కర్’!
వెంకటేష్ పాత్రలో అక్షయ్.. మీనాక్షి ప్లేస్‌లో రాశీ ఖన్నా..
వెంకటేష్ పాత్రలో అక్షయ్.. మీనాక్షి ప్లేస్‌లో రాశీ ఖన్నా..
నందమూరి బాలకృష్ణకి ఫ్యాన్ అయిపోయిన గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్
నందమూరి బాలకృష్ణకి ఫ్యాన్ అయిపోయిన గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్
ఆ ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్
ఆ ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్