AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోటి దుర్వాసన, దంత క్షయ నివారణకు వేప టూత్‌పేస్ట్ బెస్ట్ మెడిసిన్.. ఈ హెర్బల్ పేస్ట్‌ తయారీ మీ కోసం

నోటి దుర్వాసన సమస్య ఇతరుల ముందు చాలా ఇబ్బంది కలిగించే సమస్య. మార్కెట్లో లభించే టూత్‌పేస్ట్, లేదా మౌత్ వాష్ లు కొంతకాలం మాత్రమే ఉపశమనం ఇస్తాయి. అయితే శాశ్వతంగా పరిష్కారాన్ని అందించవు. అటువంటి పరిస్థితిలో చౌకైన, ప్రభావవంతమైన.. వంటింటి చిట్కాని ట్రై చేయాలనుకుంటే.. వేప ఆకులతో చేసిన టూత్‌పేస్ట్ ఉత్తమమైన ఎంపిక. ఈ రోజు వేపాకులతో పేస్ట్ ఎలా చేసుకోవాలి?ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం..

నోటి దుర్వాసన, దంత క్షయ నివారణకు వేప టూత్‌పేస్ట్ బెస్ట్ మెడిసిన్.. ఈ హెర్బల్ పేస్ట్‌ తయారీ మీ కోసం
Neem Herbal Toothpaste
Surya Kala
|

Updated on: May 05, 2025 | 5:46 PM

Share

వేపలో సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది దుర్వాసనను తొలగించడమే కాకుండా చిగుళ్ళు, దంతాలను బలపరుస్తుంది. అలాగే దీని ప్రత్యేకత ఏమిటంటే దీనిని ఉపయోగించడం వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ రోజు వేప ఆకులతో హెర్బల్ టూత్‌పేస్ట్ ఎలా తయారు చేయాలి?ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం..

వేప టూత్‌పేస్ట్ తయారీ విధానం: దీని కోసం ముందుగా 1 కప్పు తాజా వేప ఆకులను తీసుకుని.. వాటిని బాగా కడిగి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేస్తున్నప్పుడే కొంచెం నీరు కలపండి. ఈ పేస్ట్ తయారయ్యాక.. వేప పేస్ట్ లో అర టీస్పూన్ రాతి ఉప్పు, అర టీస్పూన్ నల్ల ఉప్పు , అర టీస్పూన్ ఆవాల నూనె కలపండి.

అన్నింటిని బాగా కలిపిన తర్వాత.. వేప హెర్బల్ టూత్‌పేస్ట్ సిద్ధంగా ఉంటుంది. దీన్ని ఒక గాజు పాత్రలో నింపి ఫ్రిజ్‌లో ఉంచండి. ఈ హెర్బల్ పేస్ట్ 5-6 రోజులు నిల్వ ఉంటుంది. మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు ఈ పేస్ట్ ను చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎలా ఉపయోగించాలంటే: ఈ హెర్బల్ టూత్‌పేస్ట్‌ను ప్రతి ఉదయం, రాత్రి ఉపయోగించవచ్చు. వేలు లేదా బ్రష్‌తో 2-3 నిమిషాలు మీ దంతాలను సున్నితంగా బ్రష్ చేసి ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల దుర్వాసన తొలగిపోతుంది, దంతాలు మెరుస్తాయి. చిగుళ్ళు బలంగా మారతాయి. దీనితో పాటు దంతాల పసుపు రంగుతగ్గుతుంది. కావిటీలను నివారిస్తుంది.

వేప హెర్బల్ టూత్‌పేస్ట్ ప్రయోజనాలు

నోటి దుర్వాసన నుంచి ఉపశమనం: మీ నోరు తరచుగా దుర్వాసన వస్తుంటే.. మీకు మీరే అసౌకర్యంగా భావిస్తే వేప మూలికా పేస్ట్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నోటిలో ఉండే బ్యాక్టీరియాను తొలగించే సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు వేపలో కనిపిస్తాయి. ఈ బ్యాక్టీరియా దుర్వాసనను నివారిస్తుంది. నోరు తాజాగా ఉన్నట్లు అనిపిస్తుంది.

చిగుళ్ళను బలంగా చేస్తుంది: చిగుళ్ళలో వాపు, రక్తస్రావం లేదా కొంచెం నొప్పిగా అనిపిస్తే ఈ పేస్ట్ ఆ సమస్యను కూడా నయం చేస్తుంది. వేప చిగుళ్ళను బలోపేతం చేసే, ఇన్ఫెక్షన్లను నివారించే లక్షణాలను కలిగి ఉంది. క్రమం తప్పకుండా వేప హెర్బల్ టూత్‌పేస్ట్ వాడటం వల్ల చిగుళ్ళు ఆరోగ్యంగా మారతాయి. బ్రష్ చేసేటప్పుడు రక్తస్రావం వస్తుంటే అది ఆగిపోతుంది.

దంతక్షయం నివారణ: మార్కెట్లో లభించే టూత్‌పేస్టులు, అధిక చక్కెర ఉత్పత్తులు దంతక్షయానికి కారణమవుతాయి. ఈ వేప పేస్ట్ దంతక్షయాన్ని నివారిస్తుంది. దంత క్షయం ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఇది మీ దంతాలను చాలా కాలం పాటు బలంగా, సురక్షితంగా ఉంచుతుంది.

దంతాలపై పసుపును తొలగిస్తుంది: దంతాలు పసుపు రంగులో కనిపిస్తే.. వాటిని ప్రకాశవంతం మెరిసేలా చేసుకోవాలనుకుంటే వేప మూలికా టూత్‌పేస్ట్ ఒక ప్రభావవంతమైన పరిష్కారం. దీన్ని కొన్ని రోజులు నిరంతరం ఉపయోగించడం ద్వారా దంతాల పసుపు రంగు తగ్గిపోతుంది. దంతాల సహజ మెరుపు తిరిగి వస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
చేసిన రెండు సినిమాలు హిట్టే.. ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
ఇక టోల్ గేట్ల దగ్గర ఆగే పన్లేదు.. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లిపోవచ్చు
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
త్వరలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకు అంటే
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..
RCB Full Squad: స్వ్కాడ్‌తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురూ..