AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Hanuman: ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.. హనుమంతుడి అనుగ్రహం మీపై ఉందని అర్ధమట..

వారంలో మంగళవారం బజరంగబలిని పూజించడానికి ఒక ప్రత్యేక రోజుగా భావిస్తారు. ఈ రోజున హనుమంతుని పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. రామాయణ కథ ప్రకారం హనుమంతుడు తన భక్తులపైనే కాదు శ్రీ రాముడి భక్తులపై కూడా ఆశీస్సులను కురిపిస్తాడు. కొన్ని ప్రత్యేక సంకేతాల ద్వారా ఇది స్పష్టంగా తెలుస్తుంది. హనుమంతుడి అనుగ్రహం మీపై ఉందని ఈ ప్రత్యేక సంకేతాలు ద్వారా తెలుసుకోవచ్చట.

Lord Hanuman: ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.. హనుమంతుడి అనుగ్రహం మీపై ఉందని అర్ధమట..
Lord Hanuman Blessings]
Surya Kala
|

Updated on: May 05, 2025 | 4:45 PM

Share

హిందూ మతంలో ఒకోకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేయబడింది. మంగళవారం రామ భక్త హనుమంతుడికి అంకితం చేయబడిన రోజు. రామాయణంతో సహా అనేక పురాణాలలో శ్రీరాముని పేరు ఎక్కడ వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని ప్రస్తావించబడింది. హనుమంతుడికి అమరత్వం వరం వలన కలియుగంలో కూడా ఉన్నాడని నమ్మకం.అందువల్ల ప్రతి యుగంలో శ్రీరాముని నామ స్మరణ జరిగే ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు. శ్రీరామ భక్తులపై ప్రత్యేక ఆశీస్సులను కురిపిస్తాడు. అదే సమయంలో మీరు హనుమంతుడి భక్తులైతే ఎల్లప్పుడూ నిర్మలమైన హృదయంతో ఆయనను స్మరిస్తే.. హనుమంతుడు మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు. కొన్ని ప్రత్యేక సంకేతాల ద్వారా హనుమంతుని ప్రత్యేక ఆశీస్సులు మీకు ఉన్నాయని తెలియజేస్తాడట.

హనుమంతుడు చాలా శక్తివంతుడు. దయగలవాడు. హనుమంతుడి జీవితం నుంచి మనిషి ఎన్నో నేర్చుకోవాలి. హనుమంతుడు ఎంత శక్తిని కలిగి ఉన్నా.. ఎప్పుడూ తన శక్తిని ప్రదర్శించడు. అయితే అవసరమైనప్పుడు మాత్రమే తన శక్తులను చూపిస్తాడు. అదేవిధంగా ధైర్యవంతుడు, ఎంత శక్తివంతుడైనా సరే మీరు ఎప్పుడు వినయంగా ఉండాలి. న్యాయంగా ప్రవర్తించే వారి పట్ల, వినయంగా ఉన్న వ్యక్తుల పట్ల హనుమంతుడు అనుగ్రహం ఉంటుంది. ఎటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నా వినయం, సత్యవంతులు అయితే హనుమంతుడు ఎల్లప్పుడూ అటువంటి వ్యక్తులను ఆశీర్వదిస్తాడు.

జ్యోతిషశాస్త్రంలో శనిని అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహంగా పరిగణిస్తారు. శనీశ్వరుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. శనీశ్వరుడు ఏ రాశిలో ఉన్నా ఇతర రాశులపై మంచి చెడుల ప్రభావం ఉంటుంది. అయితే హనుమంతుడి ఆశీర్వాదం ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ శనిశ్వరుడి భాదల నుంచి తప్పించుకుంటారు. దీని అర్థం శనిదేవుని ఏలి నాటి శని, శని దైయ ప్రతికూల ప్రభావాలు హనుమంతుని భక్తులను ప్రభావితం చేయవు.

ఇవి కూడా చదవండి

ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదోక సమయంలో ఏదో ఒక అడ్డంకిని ఎదుర్కొంటారు. అయితే ఎవరైనా తమకు ఎదురైన అతిపెద్ద అడ్డంకులను కూడా అద్భుతంగా అధిగమించినట్లయితే.. వారిపై హనుమంతుడి అనుగ్రహం మీపై ఉందని.. అదృశ్య రూపంలో కూడా మీకు సహాయం చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. హనుమంతుడు తన భక్తులను ఎల్లప్పుడూ సంక్షోభ సమయాల్లో రక్షిస్తాడు. అందుకే హనుమంతుడిని సంకటమోచక హనుమంతుడు అని పిలుస్తారు.

హనుమంతుడు.. శ్రీరాముడు కలలలో కనిపిస్తే

రామాయణ కథ ప్రకారం హనుమంతుడు తన భక్తులను మాత్రమే కాదు రాముడి భక్తులను కూడా ఆశీర్వదిస్తాడు. ఎవరి కలలోనైనా రాముడు లేదా హనుమంతుడు కనిపిస్తే హనుమంతుడు అనుగ్రహం మీపై ఉందని.. మీ పట్ల చాలా సంతోషంగా ఉన్నాడనడానికి పెద్ద సంకేతం. అలాగే కలలో హనుమంతుడి ఆలయం, బూందీ, రామాయణ పారాయణం లేదా భజన-కీర్తన వంటివి చూడటం కూడా ఆంజనేయస్వామి అనుగ్రాహం మీపై ఉందని చెప్పడానికి పెద్ద సంకేతం.

కాలంతో పోటీ పడుతూ జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రతిదీ సమయానికి చేయడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో కొన్ని సార్లు ఎంత ప్రయత్నం చేసినా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన లేరు. అయితే ఎవరిపైనా అయిన హనుమంతుడి ఆశీర్వాదం ఉంటే అటువంటి వ్యక్తి ఎటువంటి ముందస్తు ప్రణాళికలు వేయకుండానే రామాయణ పారాయణం, హనుమంతుడి భజన, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.