నల్లమల్ల అటవీ ప్రాంతంలో అరుదైన దృశ్యం.. రెండు తలలతో పుట్టిన కోతిపిల్ల..! కట్ చేస్తే..
ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తెలిసిన ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో అరుదైన జంతు జాలం దాగి ఉన్నప్పటికీ అందులో ఒక ఆడ కోతి రెండు తలలు ఉన్న కోతి పిల్లలకు జన్మనివ్వటం అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. అయితే, రెండు తలలతో పుట్టిన ఆ కోతి పిల్ల పుట్టిన 12 గంటలపాటు

కర్నూలు జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో అరుదైన దృశ్యం కనిపించింది. అడవిలోని ఓ కోతి రెండు తలల పిల్లకు జన్మనిచ్చింది. నల్లమల అటవీ ప్రాంతంలోని బైర్లూటి టింబర్ డిపో వద్ద క ఆడ కోతి రెండు తలలు ఉన్న కోతిపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తెలిసిన ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో అరుదైన జంతు జాలం దాగి ఉన్నప్పటికీ అందులో ఒక ఆడ కోతి రెండు తలలు ఉన్న కోతి పిల్లలకు జన్మనివ్వటం అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. అయితే, రెండు తలలతో పుట్టిన ఆ కోతి పిల్ల పుట్టిన 12 గంటలపాటు మాత్రమే బతికి ఉందని, ఆ తర్వాత పుట్టిన కోతిపిల్ల మృతి చెందినట్టుగా తెలిసింది.
గతంలో నిజామాబాద్ జిల్లాలోనూ ఇలాంటి వింత ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని జక్రాన్‌పల్లి మండల కేంద్రంతో ఓ రైతు గొర్రెల మందలోని ఓ గొర్రె ప్రసవించింది. ఆ గొర్రెకు పుట్టిన పిల్ల రెండు తలలతో జన్మించింది. వింతగా జన్మించిన గొర్రె పిల్లను చూసేందుకు ఎగబడ్డారు. జన్యు లోపంతోనే ఈ రకంగా జన్మించి ఉండొచ్చని పశు వైద్య అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే, గతంలో థాయ్‌లాండ్‌లో ఒక పిల్లి రెండు తలలతో ఉన్న పిల్లి కూనకు జన్మనిచ్చింది. పుట్టిన ఆ పిల్లిపిల్ల రెండు మూతులతోనూ పాలు తాగేస్తోందంటూ ఎంతో సంతోషంగా, మురిసిపోతూ ప్రకటించుకున్నాడు ఆ పిల్లి యజమాని.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




