AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pesarattu: పెసరట్టు వేయడం ఒక కళ.. ఆంధ్రా స్పెషల్ సాంప్రదాయ టిఫిన్ పెసరట్టు ఎలా చేసుకోవాలంటే..

ఉదయాన్నే టిఫిన్ తినడం తప్పని సరి. అల్పాహారంగా ఇడ్లీ, దోస, పూరి, చపాతీ, పరోటా వంటి వంటి రకరకాల ఆహార పదార్ధాలను తినడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే ఇప్పుడు ఆ పాత మధురం అంటూ అమ్మమ్మల కాలం నాటి ఆహారపదార్ధాలను తినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అలాంటి సాంప్రదాయ టిఫిన్ లో పెసరట్టుది ప్రత్యేక స్థానం. ఈ రోజు ఆంధ్ర్ స్పెషల్ పెసరట్టు తయారీ రెసిపీ గురించి తెలుసుకుందాం..

Pesarattu: పెసరట్టు వేయడం ఒక కళ.. ఆంధ్రా స్పెషల్ సాంప్రదాయ టిఫిన్ పెసరట్టు ఎలా చేసుకోవాలంటే..
Andhra Special Pesarattu
Surya Kala
|

Updated on: May 05, 2025 | 8:18 PM

Share

ఉదయం టిఫిన్​ తింటే మధ్యాహ్నం వరకు ఆకలి వేయకూడదు అని చాలా మంది కోరుకుంటారు. అందుకు అనుగుణంగా ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని తింటారు. అలాంటి టిఫిన్స్ లో పెసరట్టు ఒకటి. పెసలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటితో చేసుకునే ఆహార పదార్దాలు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికీ చక్కటి టిఫిన్ పెసరట్టు . దీనిని తింటే తొందరగా కడుపు నిండిపోయిన ఫీలింగ్ ఇస్తుంది. ఎక్కువ సమయం ఆకలి వెయ్యదు. అయితే ఆంద్ర స్పెషల్ పెసరట్టు వేయడం ఒక కళ. పెసరట్లలో ప్లెయిన్ (సాదా) పెసరట్టు, ఉప్మా పెసరట్టు, ఉల్లి పెసరట్టు, అల్లం పెసరట్టు, క్యారెట్ పెసరట్టు ఇలా ఎన్నో రకాలున్నాయి. దీనిని అందరూ సరిగ్గా చేసుకోలేరు. ఈ రోజు ఈ కొలతల ప్రకారం పెసరట్టు వేసుకుంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే ఎవరైనా. ఈ రోజు సులభంగా పెసరట్టు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.. ముఖ్యమైనవి

కావాల్సిన పదార్ధాలు

  1. పెసలు – ఒక కప్పు
  2. ఉల్లిపాయ – రెండు
  3. పచ్చి మిర్చి – 8
  4. అల్లం – తగినంత
  5. జీలకర్ర – మూడు స్పూన్లు
  6. మిరియాలు – 6
  7. ఉప్పు – రుచికి సరిపడా
  8. పసుపు – చిటికెడు
  9. నెయ్యి –

తయారీ విధానం: పెసలను సుమారు 6గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని శుభ్రంగా కడిగి మిక్సీ గిన్నె తీసుకుని పెసలు వేసుకుని.. అందులో చిన్న ఉల్లిపాయ ముక్క, రెండు స్పూన్ల జీలకర్ర, మిరియాలు, 5 పచ్చి మిర్చి , ముక్కలుగా కట్ చేసిన అల్లం వేసుకుని పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పెసర పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. పిండి మరీ గట్టిగా లేదా మరీ పల్చగా లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇంతలో స్టవ్ మీద పెనం పెట్టి.. వేడి ఎక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసి పెసర పిండిని దోస మాదిరిగా వేసి.. దానిపై చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. అంతే ఆంధ్రాస్పెషల్ పెసరట్టు రెడీ.. దీనిని ఉప్మా కాంబినేషన్ లో అల్లం చట్నీతో తింటే టెస్ట్ కిర్రాక్ అంతే అని అంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?