AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి పడుకునే ముందు ఈ పని చేస్తున్నారా..? లేకుంటే నష్టపోతారు జాగ్రత్త

వాస్తు ప్రకారం వంట గది సరిగ్గా ఉంటే ఇంట్లో ధనం నిలుస్తుంది. మంచి ఆరోగ్యం, శాంతి, లక్ష్మీ అనుగ్రహం లభిస్తాయి. వంట గదిలో కొన్ని నియమాలు పాటిస్తే బాధలు తగ్గి శుభం పెరుగుతుంది. ఈ చిట్కాలు పాటించి మీ ఇంట్లో శుభశక్తులను ఆకర్షించండి.

రాత్రి పడుకునే ముందు ఈ పని చేస్తున్నారా..? లేకుంటే నష్టపోతారు జాగ్రత్త
Vastu Tips To Attract Wealth
Prashanthi V
|

Updated on: May 06, 2025 | 1:25 PM

Share

ఇంట్లో వంటగది సరిగ్గా ఉంటే.. ఇంట్లో ధనం కూడా నిలిచిపోతుంది అని వాస్తు శాస్త్రం చెబుతుంది. వంటగది ఎలాంటి చోట ఉండాలో, ఎలాంటి వస్తువులు అక్కడ పెట్టాలో ఏవి వెంటనే తీసేయాలో తెలుసుకోవాలి. ఇవన్నీ మన ఇంట్లో ధనం నిలిచేలా ఆరోగ్యం బాగుండేలా సహాయపడతాయి. వంటగది ఈశాన్యంలో ఉంటే ఇంట్లో డబ్బులు నిలవవు. ఈ దిశ వంటకు అనుకూలం కాదు. అద్దె ఇల్లు అయినా ఇది సమస్య కలిగిస్తుంది. అలాంటి సందర్భాల్లో పేదలకు అన్నదానం చేస్తే ఆ ప్రభావం తగ్గుతుంది.

వంటగదిలో అద్దం అవసరం లేదు. అద్దం మసకగా విరిగినట్టైతే వెంటనే తీసేయాలి. డిష్ వాష్ ట్యాప్ ఈశాన్యంలో ఉంటే మంచిది. దీనిని మార్చితే ఇంట్లో మహిళలకు ఆరోగ్య సమస్యలు రావచ్చు. వంటగదికి తూర్పు దిశలో కిటికీ వుంటే అది మంచిది.

వంటగదిలో పగిలిన గాజులు, ఉపయోగించని పాత్రలు, విరిగిన వస్తువులు, చెత్త, మందులు ఉండకూడదు. ఇవన్నీ కుటుంబానికి ఆర్థికంగా నష్టం తెస్తాయి. వెంటనే వీటిని తీసేయాలి.

మహిళలు స్నానం చేసిన తర్వాతే వంటగదిలోకి రావాలి. స్నానం చేయలేకపోతే కనీసం నోరు కడుక్కోవాలి. ముఖం శుభ్రం చేసుకోవాలి. శుభ్రత లేకుండా వంటచేస్తే ఆరోగ్యం చెడుతుంది.. దేవతలు అసంతృప్తిగా ఉంటారు.

వంట మొదలుపెట్టేటప్పుడు చింతపండు తాకొద్దు. అలా తాకితే లక్ష్మిదేవి ఇంట్లో ఉండదని చెబుతారు. బదులుగా బియ్యాన్ని తాకడం మంచిది. బియ్యం నానబెట్టి, త్రాసుతో కొలవడం మంచిది. అది ధనదాయకంగా ఉంటుంది.

వంట చేసే సమయంలో ఆహారం తరచూ రుచి చూడకూడదు. ఇది అన్నపూర్ణాదేవిని అసంతృప్తిగా చేస్తుంది. వంట చేసిన తర్వాతే ఆహారం రుచి చూడాలి. ఇది సంపదకు మార్గం చూపుతుంది.

రాత్రి పడుకునే ముందు స్టవ్ ని శుభ్రంగా కడగడం మంచిదని నమ్మకం. అలాగే అన్నం మొత్తం తీసేయకుండా కొంత అన్నం పాత్రలో వదిలేయాలి. ఇది అన్నలక్ష్మి అనుగ్రహంగా భావించబడుతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో మహాలక్ష్మి అనుకూలత కలుగుతుందని పెద్దలు చెబుతారు.

వంటగదిలో నలుపు రంగు మంచిది కాదు. బదులుగా ఆకుపచ్చ, ఎరుపు, నారింజ రంగులు వాడాలి. ఇవి వెలుగునిచ్చే శుభ రంగులు. నీటి పాత్రలు, జగ్గులు ఈశాన్యంలో ఉంచాలి. స్టవ్, గ్యాస్ వంటి వస్తువులు నైరుతి వైపు ఉండాలి. వండిన ఆహారాన్ని స్టవ్ కుడి వైపున ఉంచాలి. ఇలా చేయడం వలన ఇంట్లో సంపద నిలిచిపోతుంది.

సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి