Piyush Goyal: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్.. త్వరలో కరోనాపై అప్రమత్తం ఉండలని సూచన
piyush-goyal : కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ దర్శించుకున్నారు. ఉదయం ఆయన శ్రీవారిని..
piyush-goyal visits tirumala: కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ దర్శించుకున్నారు. ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కేంద్ర మంత్రి స్వామివారిని దర్శించుకుని తన మొక్కకులు తీర్చుకున్నారు. స్వామివారి తీర్థప్రసాదాలను పీయూష్ గోయల్ కు అర్చకులు అందజేశారు.
ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఇన్ని రోజులు దేశ ప్రజలు కరోనా వైరస్ వలన దుర్భర జీవితాన్ని అనుభవించారని చెప్పారు. ఇక నుంచి అయినా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని.. త్వరలో కోవిడ్ అంతమై దేశ ప్రజలకు కొత్త జీవితం ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్ననని మంత్రి తెలిపారు. ఇంకా కరోనా వైరస్ అంతం కాలేదని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు కరోనా విజృభన అరికట్టడానికి లాక్ డౌన్ ను కొనసాగిస్తున్న నేపథ్యంలో తిరుమలలో రద్దీ తగ్గింది. భక్తులు పరిమిత అసంఖ్యలోనే శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
Also Read: ఒకే ఫేమ్ లో టాలీవుడ్ లెజెండరీ హీరోలు.. 33 ఏళ్ళక్రితం ఫోటో వైరల్
ఓ వైపు స్పాకెళ్లి బాడీ మసాజ్ చేయించుకున్న గుడ్లగూబ.. మరోవైపు ఐలవ్ యూ అంటున్న రామచిలుక