AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భయపెడుతోన్న బాబా వంగా జోష్యం.. 2026లో ప్రపంచం రక్తసిక్తమేనా

భవిష్యత్తును ఎవరూ చూడలేరు.. అయితే భవిష్యత్ లో ఏమి జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది అందరూ తెలుసుకోవాలని కోరుకుంటారు. అందుకనే జ్యోతిష్యం, న్యూమరాలజీ వంటి వాటిపై దృష్టి సారిస్తారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా రానున్న రోజుల్లో ఏమి జరుగుతుందనేది తెలుసుకోడానికి బాబా వంగ, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, నోస్ట్రాడమస్ వంటి వారు చెప్పిన విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే 2026 ఏడాదికి సంబంధించి ప్రసిద్ధ బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా వేసిన అంచనాలు భయానకంగా ఉన్నాయి. కొత్త సంవత్సరం 2026 చాలా దారుణాలకు వేదికగా నిలుస్తుందని అంచనా వేసింది.

భయపెడుతోన్న బాబా వంగా జోష్యం.. 2026లో ప్రపంచం రక్తసిక్తమేనా
Babavanga
Surya Kala
|

Updated on: Sep 29, 2025 | 4:41 PM

Share

బల్గేరియాలో జన్మించిన బాబా వంగా “బాల్కన్ల నోస్ట్రాడమస్” గా ప్రసిద్ధి చెందింది. ఈ ఆధ్యాత్మికవేత్త బాల్యంలోనే అంటే 11 ఏళ్ల వయసులోనే తన కంటి చూపును కోల్పోయింది. అప్పటి నుంచి ఆమెకు అతీంద్ర శక్తులు వచ్చాయని.. భవిష్యత్ లో జరగనున్నవాటిని చెప్పే శక్తి వచ్చిందని నమ్ముతారు. 1996లో 84 సంవత్సరాల వయసులో ఆమె మరణించింది. బల్గేరియాలోని పెట్రిచ్‌లో ఆమె నివసించిన ఇల్లు ఇప్పుడు ఒక మ్యూజియంగా మారింది.

బాబా వంగా చెప్పిన భవిష్యత్ అందరినీ భయపెడుతుంది. ఆమె చెప్పిన యునైటెడ్ స్టేట్స్‌లో 9/11 దాడులు, 2022లో బ్రిటన్‌ను తాకే వినాశకరమైన వరదలు వంటి సంఘటనలు నిజం అవ్వడంతో కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు బాబా వంగా ఏమి చెప్పిందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంటుంది. ఇప్పటి వరకు బాబా వాంగా ఊహించినవన్నీ జారిగాయి. దీంతో 2026లో జరుగబోయే పరిణామాల గురించి కూడా ఆమె వెల్లడించింది.

2026 లో మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందా?

వంగా చెప్పిన అత్యంత సంచలనాత్మక ప్రవచనాలలో ఒకటి మూడవ ప్రపంచ యుద్ధానికి సంబంధించినది. 2026 లో మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందని ఆమె అంచనా వేసిందని నమ్ముతారు. ప్రపంచ శక్తుల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని చెప్పింది. అంతేకాదు చైనా తైవాన్‌ను స్వాధీనం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందని వెల్లడించింది. 2026 లో రష్యా , యునైటెడ్ స్టేట్స్ మధ్య ప్రత్యక్ష ఘర్షణ జరుగుతుంది.. ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఆమె అంచనా వేసింది.

ఇవి కూడా చదవండి

2026లో కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెంది యాంత్రిక మేధస్సు పని చేస్తుందని.. దీంతో కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే కాలానుగుణంగా వచ్చే మార్పులను మనిషి తప్పనిసరిగా స్వీకరించాలని పేర్కొంది.

ఎలియన్స్ భూమి మీద అడుగు

2026లో ఏలియన్‌లు లేదా గ్రహాంతర జీవులు భూమి మీద అడుగు పెడతారని.. ఆ సమయంలో సంచలన విషయాలు జరగనున్నాయని.. ఒకానొక సమయంలో ఎలిన్స్ కు మనుషులకు ఘర్షణ తలెత్తే అవకాశం ఉందని అంచనా వేసింది.

భూమి మీద వాతావరణంలో భారీ మార్పులు కలుగుతాయని.. సముద్ర మట్టం పెరుగుతుందని.. ఊర్లకు ఊర్లు సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉందని బాబా వంగా వెల్లడించింది. అంతేకాదు పర్యావరణ మార్పులు, సౌర తుఫానులు, వర్షాలు, వరదలతో ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు