AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలులో టికెట్ అడిగితే ఆధార్ చేతిలో పెట్టింది.. టీసీ షాక్.. బామ్మ రాక్..

ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు రాజకీయ నేతలు ఇచ్చిన హామీల్లో ఒకటి మహిళలు బస్సులో ఫ్రీగా ప్రయాణించడం. ఇది కర్ణాటకలో మొదలై.. తెలుగు రాష్ట్రాల్లో కూడా అడుగు పెట్టింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ పేర్లతో మహిళలకు బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను మహిళలు తమ ఆధర్ కార్డ్ ని చూపించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక వీడియోలో రైలు లో టికెట్ అడుగుతున్న టీటీకి తన ఆదార్ కార్డ్ చూపించింది ఓ బామ్మ. ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

రైలులో టికెట్ అడిగితే ఆధార్ చేతిలో పెట్టింది.. టీసీ షాక్.. బామ్మ రాక్..
Viral VideoImage Credit source: Twitter
Surya Kala
|

Updated on: Sep 29, 2025 | 4:15 PM

Share

ప్రస్తుత జనరేషన్ లో పుట్టక ముందే.. అమ్మ కడుపులో ఉన్నప్పుడే అన్నీ నేర్చేసుకుంటున్నారు.. సోషల్ మీడియా, నెట్, స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వయసుతో సంబంధం లేకుండా నేటి సమాజంలో ఏమి జరుగుతుందనే విషయంలో అప్ డేట్ గా ఉంటున్నారు. అదే సమయంలో ఇంకా చాలా మంది అమాయకత్వంతో కనిపిస్తూ.. అయ్యో అనిపిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతలో నివసించే బామ్మ, తాతలు అయితే మరీ అమాయకులు. కళ్ళు మూసుకుని ఎవరేమి చెప్పినా నమ్ముతారు. అందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియో. ఈ వీడియో ఒక పల్లెటూరి బామ్మ అమాయకత్వానికి నిదర్శనం అని చెప్పవచ్చు. అవును కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బస్సులలో స్త్రీలకూ ప్రయాణం ఉచితం అన్న సంగతి తెలిసిందే. అయితే రైలులో ఒక వృద్ధురాలు తన ఆధార్ కార్డును చూపించి టికెట్ కలెక్టర్‌ను టికెట్ అడిగింది. ఈ బామ్మ వీడియో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సికందర్ అనే X ఖాతాలో షేర్ చేయబడిన ఈ వీడియోలో ఒక అమ్మమ్మ రైలులో ప్రయాణిస్తున్నట్లు చూడవచ్చు. అయితే ఆ బామ్మ బస్సులో వలెనే.. రైలులో కూడా తన ఆధార్ కార్డు చూపిస్తే ఉచితంగా ప్రయాణించవచ్చని అనుకున్నట్లు ఉంది కాబోలు.. తన దగ్గరకు వచ్చిన TCకి టికెట్ కి బదులుగా తన ఆధార్ కార్డును చూపించి టికెట్ అడుగుతుంది. అతనికి మొదట ఏమీ అర్థం కాలేదు.. ‘ఏంటిది?’ అని బామ్మని అడిగాడు. అప్పుడు అక్కడ ఉన్న మరో మహిళ బస్సులో ఆధార్ చూపిస్తే ఫ్రీ టికెట్ ఇస్తున్నారు కదా.. అదే విధంగా ట్రైన్ లో ఇస్తారు అనుకున్నట్లు ఉంది అని చెప్పింది. దీంతో ఆ బామ్మ అమాయకత్వాన్ని చూసిన TC ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ.. చేతిలో ఆధార్ కార్డుని ఆ బామ్మ చేతిలో తిరిగి పెట్టేసి.. ట్రైన్ లో ఆధార చూపిస్తే టికెట్ ఇవ్వరు. డబ్బులు పెట్టి కొనుక్కోవాలి అని చెప్పినట్లు ఉన్నాడు.

ఈ సంఘటన అక్కడే ఉన్న మరో ప్రయాణీకుడు వీడియో తీశాడు. సికందర్ అనే వ్యక్తి ఎక్స్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశారు. ఆ బామ్మ కల నెరవేరాలంటే రాహుల్ గాంధీ కానీ, సిద్ధరామయ్య కానీ, ప్రధాని కావాల్సిందే’ అని క్యాప్షన్ తో ఈ వీడియో షేర్ చేశారు. ఒకరు ఇది స్క్రిప్ట్ లాగా ఉందని వ్యాఖ్యానించాడు. మరొకరు “మన గ్రామ ప్రజలు ఎంత అమాయకంగా ఉన్నారో చూడండి, వారికి ఏమీ తెలియదు” అని అన్నాడు. అయితే ఈ సంఘటన ఎప్పుడు? ఎక్కడ జరిగిందో తెలియలేదు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us