AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sumanth: అన్నం తక్కువ, కూరలు ఎక్కువ.. రోజూ ఇలా చేస్తే చాలు.. 51 ఏళ్ల వయసులో హెల్త్ సీక్రెట్ చెప్పిన సుమంత్..

నటుడు సుమంత్ తన ఫిట్‌నెస్, ఆహార నియమాల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అక్కినేని కుటుంబంలో క్రమశిక్షణ తరతరాలుగా వస్తున్నదని, ముఖ్యంగా తాతగారు (ఏఎన్‌ఆర్) చూపిన బాటలో నడుస్తున్నామని తెలిపారు. అలాగే నాగార్జునతోపాటు తాను కూడా ఫాలో అయ్యే హెల్త్, ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేశారు. ప్రస్తుతం సుమంత్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

Sumanth: అన్నం తక్కువ, కూరలు ఎక్కువ.. రోజూ ఇలా చేస్తే చాలు.. 51 ఏళ్ల వయసులో హెల్త్ సీక్రెట్ చెప్పిన సుమంత్..
Sumanth
Rajitha Chanti
|

Updated on: Aug 04, 2026 | 7:53 PM

Share

ఒకప్పుడు హీరోగా అలరించిన సుమంత్.. ప్రస్తుతం సహయ నటుడిగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య రహస్యాలు, కుటుంబ ఫిట్‌నెస్ అలవాట్లు, బాల్య జ్ఞాపకాలను పంచుకున్నారు. అక్కినేని కుటుంబంలో తరతరాలుగా పాటిస్తున్న క్రమశిక్షణే తమ ఫిట్‌నెస్‌కు మూలమని సుమంత్ స్పష్టం చేశారు. తాతగారు (దివంగత ఏఎన్‌ఆర్) జీవితం పట్ల, వ్యాయామం పట్ల ఎంతో డిసిప్లిన్‌తో ఉండేవారని సుమంత్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో వెయిట్ లిఫ్టింగ్ వంటివి లేకపోయినా, ఆయన తనదైన శైలిలో వ్యాయామం చేసేవారని, ముఖ్యంగా ఉదయం నడకను ఎప్పుడూ మానేవారు కాదని సుమంత్ తెలిపారు. ఈ క్రమశిక్షణ ఇప్పుడు నాగార్జునగారు, నాగ చైతన్య, అఖిల్, తాను కూడా కొనసాగిస్తున్నామని అన్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ జిమ్‌ను అస్సలు మిస్ అవ్వకుండా చూసుకుంటారని, రోజుకు కనీసం రెండు గంటల పాటు వ్యాయామం చేయడం తమ నిత్యకృత్యమని సుమంత్ వెల్లడించారు. ఆహారపు అలవాట్లు కూడా పైనుంచే అంటే తాతగారి దగ్గర నుంచి వచ్చాయని ఆయన వివరించారు.

ఆహార నియమాలు: ఆహారం విషయంలో తాము చాలా క్రమశిక్షణతో ఉంటామని సుమంత్ చెప్పారు. తాతగారు చిన్నప్పటి నుంచీ “అన్నం తక్కువ, కూరలు ఎక్కువ” అని చెప్పేవారని, అది తమ కుటుంబంలో ఇప్పటికీ పాటిస్తున్న అలవాటు అని తెలిపారు. నాగార్జునగారు తెల్ల అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ తింటారని, లేదా చాలా తక్కువగా తింటారని అన్నారు. సుమంత్‌కు ప్రోటీన్‌తో పాటు కూరగాయలంటే కూడా బాగా ఇష్టమని, నాన్-వెజ్ తిన్నా కూడా పరిమితంగానే తీసుకుంటానని చెప్పారు. సినిమా షూటింగ్‌ల సమయంలో రుచికరమైన ఆహారం లభించినా, టెంప్ట్ అవ్వకుండా జాగ్రత్త పడతానని తెలిపారు. ఎప్పుడైనా ఎక్కువ తిన్నప్పుడు, మరుసటి రోజు అదనపు వ్యాయామంతో దాన్ని కాంపెన్సేట్ చేస్తానని సుమంత్ పేర్కొన్నారు. వ్యాయామమే తనను బ్రతికించిందని, ఆరోగ్యం విషయంలో క్రమశిక్షణే అత్యంత ముఖ్యమని ఆయన నొక్కి చెప్పారు. 50 ఏళ్లు దాటిన తర్వాత ఫిట్‌నెస్‌ను మెయింటెయిన్ చేయడం కష్టమని బయటివాళ్లు అనుకుంటారని, అయితే డబ్బు ఉన్నంత మాత్రాన కాకుండా క్రమశిక్షణ ఉంటేనే అది సాధ్యమని అన్నారు.

సుమంత్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు. హైదరాబాద్ తనకు ఎంతో ఇష్టమైన నగరమని, తన బాల్య జ్ఞాపకాలెన్నో ఇక్కడే ఉన్నాయని చెప్పారు. తన స్కూల్ ఫ్రెండ్స్‌లో కొందరు ఇప్పటికీ తనకు ఆత్మీయ మిత్రులని తెలిపారు. సినీ పరిశ్రమ నుంచి తమ స్కూల్ నుండి మొదట నాగార్జునగారు వచ్చారని, ఆ తర్వాత తాను, ఆ తర్వాత రానా దగ్గుబాటి వచ్చారని, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ నుండి నాగ అశ్విన్ కూడా ఇదే స్కూల్ నుండి వచ్చారని సుమంత్ పంచుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..

ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్‏లో తనే స్పెషల్..

Follow Us
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది..
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది..
ధాన్య లక్ష్మి ఒడిలో లంబోదరుడు.. రామకోటి రామరాజు వినూత్న కళారూపం
ధాన్య లక్ష్మి ఒడిలో లంబోదరుడు.. రామకోటి రామరాజు వినూత్న కళారూపం