AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబ్బాబు.. ఐఫోన్ 17ప్రో మాక్స్ కొనుక్కుంటా.. డబ్బులు విరాళం ఇవ్వమంటున్న అందమైన యువతి

యువత నుంచి పెద్దవారి వరకూ ఐఫోన్ అంటే ఒక రకమైన క్రేజ్. ఈ ఫోన్ ని ఒక స్టేటస్ సింబల్ గా ఫీల్ అయ్యేవారు కూడా ఉన్నారు. అందుకనే ఆపిల్ సంస్థ ఐఫోన్ ఏ సిరీస్ ని రిలీజ్ చేసినా వెంటనే సెల్ అయిపోతాయి. అయితే ఐఫోన్ కొనడం అంటే అందరికీ అందని కల. ఈ నేపధ్యంలో ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఖరీదు చేయడానికి ఒక యువతి భిన్నంగా తన కల నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ కొనడానికి సోషల్ మీడియాలో సహాయం కోరింది. ప్రజలు తనకు ఒకటి లేదా రెండు రూపాయలు ఇస్తే.. ఐఫోన్ కొనుక్కోవాలనుకునే తన కల నెరవేరుతుందంటూ ఒక వీడియోను షేర్ చేసింది.

బాబ్బాబు.. ఐఫోన్ 17ప్రో మాక్స్ కొనుక్కుంటా.. డబ్బులు విరాళం ఇవ్వమంటున్న అందమైన యువతి
Viral Video
Surya Kala
|

Updated on: Sep 29, 2025 | 3:28 PM

Share

ఇటీవల విడుదలైన ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ కు భారతీయులలో విపరీతమైన క్రేజ్ ఉంది. దీన్ని కొనడానికి ప్రజలు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కొత్త ఫోన్‌ను పొందడానికి చాలా మంది గంటల తరబడి షాప్స్ వెలుపల క్యూలో గంటల తరబడి నిల్చున్నారు. అయితే కొంతమంది దగ్గర ఈ ఫోన్ ని కొనడానికి డబ్బులు లేవు. దీంతో వారు ఫోన్ ని చూసి సంతోష పడి తృప్తి పడుతుంటే.. ఒక యువతి మాత్రం ఎలాగైనా సరే ఫోన్ కొనాలనే తన కోరికను నెరవేర్చుకోవాలని భావిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను కొనడానికి తనకు విరాళాలు ఇవ్వమని కోరుతూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసి.. ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో నివసించే ‘బ్యూటీ క్వీన్’ మహి సింగ్.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఒకటి లేదా రెండు రూపాయలు విరాళంగా ఇవ్వాలని తన ఫాలోవర్స్ ని అడుగుతోంది, దీని ధర భారతదేశంలో దాదాపు ₹1.49 లక్షలు. తన తండ్రి మూడు నెలల క్రితం తనకు ఐఫోన్ 16 బహుమతిగా ఇచ్చారు. దీంతో ఇప్పుడు మార్కెట్ లో రిలీజైన కొత్త ఆపిల్ ఫోన్ కొనడానికి నిరాకరించారని ఆమె చెబుతోంది. వీడియోలో.. “ఐఫోన్ 17 ప్రో ఇప్పుడే లాంచ్ అయింది. ఈ ఫోన్ రంగు నాకు చాలా నచ్చింది. మూడు నెలల క్రితం.. నాన్న నాకు ఐఫోన్ 16 కొన్నారు. ఇప్పుడు అక్టోబర్ 21న నా పుట్టినరోజున ఈ కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నాను.. అయితే మా నాన్న కొత్త ఫోన్ ని కొనివ్వను అని చెప్పేశారని అంది ఆ సుందరి.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో ప్రజలను డబ్బులు అడగడం

కనుక నా కోరిక తీరాలంటే.. “మీరందరూ ఒకటి లేదా రెండు రూపాయిలతో సహాయం చేస్తే.. నేను ఈ ఫోన్ కొనగలను. నేను చాలా కృతజ్ఞురాలినై ఉంటాను. నా కలను నెరవేరుతుంది.. నిజాయితీగా చెప్పాలంటే నాకు ఈ ఫోన్ చాలా నచ్చింది.. దానిని వర్ణించడానికి నా దగ్గర పదాలు లేవు” అని మహి తనకు ఫోన్ మీద ఉన్న కోరికను వ్యక్త పరిచింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @Sajid7642 అనే యూజర్‌నేమ్‌తో షేర్ చేయబడిన ఈ వీడియోను 38,000 మంది చూడగా.. వందలాది మంది ఈ వీడియోను లైక్ చేసి వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఒక యూజర్ సరదాగా “నేను కూడా నా కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నాను. నేను స్కానర్‌ను ఇన్‌స్టాల్ చేయాలా?” అని రాశాడు, “దీనిని డిజిటల్ బెగ్గింగ్ అంటారని ఒకరు కామెంట్ చేశారు.

వీడియోను ఇక్కడ చూడండి<

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
NCP అధినేత శరద్ పవార్ విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..